Asianet News TeluguAsianet News Telugu

స్కూటర్‌పై తీసుకెళ్తున్న క్రాకర్స్ పేలిపోయాయి.. తండ్రి, కొడుకు దుర్మరణం.. వీడియో వైరల్

దేశమంతా దీపావళి సంబురాలు చేసుకుంటుంటే ఆ ఇంట మాత్రం విషాదం నెలకొంది. క్రాకర్స్ కొనుక్కుని స్కూటర్‌పై వెళ్తుండగా అవి భారీ విస్ఫోటనం చెందాయి. స్కూటర్ కూడా పేలిపోయింది. దీంతో స్కూటర్‌పై వెళ్తున్న తండ్రీ కొడుకులు దుర్మరణం పాలయ్యారు. తమిళనాడు విల్లుపురం జిల్లాలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.
 

fire crackers laden scooter bursts father son killed in tamilnadu
Author
Chennai, First Published Nov 5, 2021, 4:48 PM IST

చెన్నై: దీపావళి రోజున ఆ ఇంట విషాదం అలుముకుంది. దీపాలు, బాణాసంచాతో వెలిగిపోవాల్సిన ఆ ఇల్లు ఆర్తనాదాలతో నిండిపోయింది. టపాసులు కాల్చడానికి ఆరాటపడ్డ ఆ ఏడేళ్ల చిన్నారి అవే క్రాకర్స్ పేలి తుది శ్వాస విడిచాడు. ఇంటికి Crackersను Scooterపై తీసుకెళ్తుండగా ఒక్కసారిగా అవి పేలిపోయాయి. భారి విస్ఫోటనం వచ్చి స్కూటర్ కూడా Burst అయింది. ఇందులో తండ్రీ కొడుకు దుర్మరణం పాలయ్యారు. వారితోపాటు అదే చోట ఉన్న మరో ముగ్గురు గాయపడ్డారు. Tamil Naduలోని విల్లుపురం జిల్లాలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. క్రాకర్స్ పేలుడు CCTVలో రికార్డ్ అయింది. ఇప్పుడు ఈ Video వైరల్ అవుతున్నది.

సీసీటీవీ ఫుటేజీ ప్రకారం, టూ వీలర్‌పై తండ్రి కొడుకు వెళ్తున్నారు. ఆ చిన్నారి స్కూటర్ ముందు ఉంచిన రెండు చుట్టలు చుట్టిన ఫైర్ క్రాకర్స్‌పై కూర్చుని ఉన్నాడు. ముందుకు వెళ్తూ ఓ పోలీసు బారికేడ్ దాటింది. రోడ్ క్రాస్‌కు సమీపంలోనే క్రాకర్స్ పేలిపోయాయి. ఈ పేలుడుకు కొన్ని క్షణాల ముందే ఎదురుగా మరో ద్విచక్ర వాహనం వస్తున్నట్టు కనిపించింది.

ఫైర్ క్రాకర్స్‌ను స్కూటర్‌ ముందు చుట్టిపెట్టారు. వీటిపై ఏడేళ్ల పిల్లాడు కూర్చున్నాడు. రోడ్ మలుపు నుంచి ఎదురుగా అకాస్మతుగా మరో టూ వీలర్ కనిపించడంతో డ్రైవర్ ఒక్కసారిగా జంకి ఉంటాడని ఈ ఘటనను దర్యాప్తు చేస్తున్న ఓ అధికారి వివరించారు. స్కూటర్ కూడా ఒక్కసారిగా వణకడంతో ఏర్పడిన ఒత్తిడి కారణంగా క్రాకర్స్ పేలి ఉండవచ్చని అంచనా వేశారు. ఈ ఘటన విల్లుపురం జిల్లాలోని కొత్తకుప్పమ్ దగ్గర చోటుచేసుకుంది. క్రాకర్స్ పేలగానే స్కూటర్ కూడా బరస్ట్ అయింది. క్రాకర్స్ పేలగానే తండ్రీ కొడుకులు పది నుంచి 15 మీటర్ల దూరం విసిరేసినట్టుగా పడిపోయారు. పేలుడు సమయంలో సమీపంలో ఉన్న ముగ్గురు మోటరిస్టులూ గాయపడ్డారు. వీరిని గణేశ్, సయ్యద్ అహ్మద్, విజి ఆనంద్‌గా గుర్తించారు. గాయపడ్డిన వారిని పుదుచ్చేరిలోని జిప్‌మర్ హాస్పిటల్‌లో చికిత్సకు తరలించారు.

Also Read: తమిళనాడులో టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు, ఆరుగురు దుర్మరణం

స్కూటర్‌పై వెళ్తున్న తండ్రీ కొడుకులు పేలుడు దాటికి మరణించారు. కాగా, ఎదురుగా వస్తున్న టూ వీలర్‌పైనున్న వ్యక్తి సహా మరో ఇద్దరు ఈ ఘటనలో గాయపడ్డారు.

మృతులను కలయినేశన్(35), ప్రదేశ్(7)గా అధికారులు గుర్తించారు. వీరు స్వస్థలం పుదుచ్చేరి నుంచి కంట్రీ మేడ్ క్రాకర్స్ కొనుగోలు చేశారని వివరించారు. ఆ వ్యక్తి అత్తగారి గ్రామమున్న విల్లుపురం జిల్లాకు ఆ క్రాకర్స్‌తో స్కూటర్‌పై బయల్దేరారు. కలయినేశన్ అత్తగారి ఇంటి వద్ద పండుగ సంబురాలు జరుపుకోవడానికి తండ్రీ కొడుకులు స్కూటర్‌పై వెళ్తున్నారు. కానీ, మార్గం మధ్యలోనే అవి పేలిపోయాయి. 

Also Read: బెంగాల్‌ ఏమైనా ప్రత్యేకమా?.. బాణాసంచాపై పూర్తి నిషేధం వద్దు.. సుప్రీంకోర్టు తీర్పు

ఆ క్రాకర్స్ చట్టం నుంచి అనుమతులు లేని ఫ్యాక్టరీలు తయారు చేశాయా? అని అధికారులను అడగ్గా, అలాంటిదేమీ లేదని వివరించారు. లీగల్ యూనిట్లే ఆ కంట్రీ క్రాకర్స్‌ను తయారు చేశాయని తెలిపారు. ఘటనపై విల్లుపురం జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios