Asianet News TeluguAsianet News Telugu

బెంగాల్‌ ఏమైనా ప్రత్యేకమా?.. బాణాసంచాపై పూర్తి నిషేధం వద్దు.. సుప్రీంకోర్టు తీర్పు

గ్రీన్ క్రాకర్స్ సహా అన్నిరకాల బాణాసంచాపై కలకత్తా హైకోర్టు సంపూర్ణ నిషేధాన్ని విధించింది. ఈ నిషేధాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు ఇది వరకే ఇచ్చిన తీర్పులకు లోబడకుండా ఎలాంటి వివరణలూ లేకుండానే కలకత్తా హైకోర్టు తీవ్ర ఆదేశాలు వెలువరించిందని సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం తెలిపింది.
 

supreme court sets aside calcutta high courts rule ban on fire crackers
Author
Kolkata, First Published Nov 1, 2021, 9:06 PM IST

న్యూఢిల్లీ: బాణాసంచా నిషేధంపై Supreme Court కీలక తీర్పునిచ్చింది. Calcutta High Court తీర్పును తోసిపుచ్చింది. West Bengal ఏమైనా ప్రత్యేకమా? అంటూ ప్రశ్నించింది. Fire Crackersపై సంపూర్ణ Ban సరికాదని వివరించింది. జస్టిస్ ఏఎం ఖాన్విల్కార్, జస్టిస్ అజయ్ రస్తోగీలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.

ఫైర్ క్రాకర్స్‌ను నిషేధించాలని ఓ పర్యావరణ వేత్త దాఖలు చేసిన పిటిషన్‌పై కలకత్తా హైకోర్టు గతనెల 29న బాణాసంచా పూర్తిగా నిషేధిస్తూ తీర్పునిచ్చింది. గ్రీన్ క్రాకర్స్‌ను గుర్తించే మెకానిజం కూడా పోలీసుల దగ్గర లేదని, అందుకే మొత్తంగా క్రాకర్స్‌ను నిషేధిస్తూ ఆదేశాలనిచ్చింది. అంతకు ముందు రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు క్రాకర్స్ కాల్చడానికి ప్రత్యేక సమయాన్ని, గడువునూ సూచించింది. కానీ, ఈ సూచనలను కలకత్తా హైకోర్టు తోసిపుచ్చింది.

ఆకస్మికంగా వచ్చిన ఈ తీర్పుతో బాణాసంచా వ్యాపారులు హతాశయులయ్యారు. తెలంగాణలోని శివకాశి నుంచి తాము సరుకులు కొనుగోలు చేశామని, స్టాక్ కూడా తమ దగ్గరకు చేరుకుందని వ్యాపారులు ఖంగారుపడ్డారు. ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ వ్యాపారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇది వరకే సుప్రీంకోర్టు గ్రీన్ క్రాకర్స్‌పై సానుకూల తీర్పునిచ్చిందని తెలిపారు. సుప్రీంకోర్టు రూలింగ్‌కు భిన్నంగా కలకత్తా హైకోర్టు ఆదేశాలనిచ్చిందని పేర్కొన్నారు. 

Also Read: దీపావళి సంబురాలపై ఆంక్షలు.. క్రాకర్స్‌పై కలకత్తా హైకోర్టు బ్యాన్

నిజానికి సుప్రీంకోర్టు దీపావళి సెలవుల్లో ఉన్నది. కానీ, ఈ పిటిషన్ విచారణకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పడి విచారించింది.

కలకత్తా హైకోర్టు ప్రస్తుత లీగల్ రెజైమ్ నుంచి విడివడి తీర్పునిచ్చిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎలాంటి కారణాలు, క్షేత్రస్థాయిలో తీరుతెన్నులనూ వివరించకుండానే బాణాసంచాపై సంపూర్ణ నిషేధం విధించిందని వివరించింది. క్రాకర్స్‌పై సంపూర్ణ నిషేధం విధించడానికి సరైన కారణం తెలిపితే తాము సంతృప్తి చెందేవారని పేర్కొంది. ఎలాంటి వివరణలు లేకుండానే సుప్రీంకోర్టు ఆదేశాలకు దూరంగా కలకత్తా హైకోర్టు వెళ్లిందని తెలిపింది.

అన్ని రాష్ట్రాలు సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరిస్తున్నాయని, అలాంటప్పుడు పశ్చిమ బెంగాల్ ప్రత్యేకమా? అంటూ సుప్రీం ధర్మాసనం తెలిపింది. దేశమంతటా తమ ఆదేశాలు అమల్లో ఉండాలని స్పష్టం చేసింది. అయితే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే వాటికి మినహాయింపులు ఉంటుందని తెలిపింది.

చాలా రకాల అభిప్రాయాలు కలవారుంటారని, అంతమాత్రానా సంపూర్ణ నిషేధం విధించవద్దని సుప్రీంకోర్టు వివరించింది. దానికి బదులు నిషేధిత బాణాసంచా రాష్ట్రంలోకి రాకుండా మెకానిజంను పటిష్టం చేయాలని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వమూ వాస్తవాలను ముందుంచే అవకాశమివ్వకుండా హైకోర్టు తీవ్ర ఆదేశాలు వెలువరించిందని అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వంలోకి ఎంట్రీ పాయింట్ల దగ్గర వ్యవస్థను బలపరచాలని, తద్వార నిషేధిత ఫైర్ క్రాకర్స్ రాష్ట్రంలోకి దిగుమతి కాకుండా చూసుకోవాలని సూచించింది. గ్రీన్ క్రాకర్స్‌ కాల్చడానికి అడ్డుపెట్టవద్దని తెలిపింది.

Also Read: బాణసంచా వాడకంపై యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ కీలక ఆదేశాలు.. ఎన్సీఆర్‌తో పాటుగా పలు ప్రాంతాల్లో నిషేధం..

ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు ఉంటుందని, అందరి ప్రయోజనాల దృష్ట్యా కరోనా నేపథ్యంలో అన్ని రకాల బాణాసంచా పేల్చడాన్ని Ban చేస్తున్నట్టు కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. నిజానికి కాలుష్యం కారణంగా గ్రీన్ క్రాకర్స్ కాల్చడానికి చాలా మంది నిపుణులు సజెస్ట్ చేస్తుంటారు. కానీ, ఈ రెండునూ వేరుచేసి గ్రీన్ క్రాకర్స్‌ను కచ్చితంగా గుర్తుపట్టే పరికరాలు పోలీసుల దగ్గర లేవని హైకోర్టు గుర్తుచేసింది. అందుకే అన్ని రకాల బాణాసంచా క్రయవిక్రయాలు, పేల్చడంపై నిషేధం విధిస్తున్నట్టు వివరించింది.

Follow Us:
Download App:
  • android
  • ios