తమిళనాడులో దారుణం సంభవించింది. మన్నార్‌గుడిలోని ఓ టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. పేలుడు ధాటికి భవనం భవనం కుప్పకూలింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.