కునో నేషనల్ పార్క్ లో లైంగిక హింసతో ఆడ చిరుత మృతి.. మూడు నెలల్లో మూడో మరణం
మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో మరో చిరుత చనిపోయింది. దక్ష అనే ఆడ చిరుతపై రెండు మగ చిరుతలను సంభోగించాయి. ఈ సమయంలో ఆడ చిరుతకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ గాయాలతోనే ఆ చిరుత చనిపోయింది.
దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చి మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో ఉంచిన దక్ష అనే ఆడ చిరుత చనిపోయింది. మగ చిరుతల జరిపిన లైంగిక హింసతోనే ఈ మరణం సంభవించినట్టు ప్రాథమికంగా తెలుస్తోందని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల దక్ష ఉండే ఎన్ క్లోజర్ లోకి వాయు, అగ్ని అనే రెండు మగ చిరులు ప్రవేశించాయి. అయితే అవి రెండు దక్షతో సంభోగించాలని ప్రయత్నించాయి. ఈ క్రమంలో హింసాత్మకంగా ప్రవర్తించాయి. ఇది చిరుతల్లో సాధారణంగానే జరిగే ప్రక్రియ దీనిని వైట్ వాకర్స్ అని కూడా పిలుస్తురని అధికారులు తెలిపారు.
సల్మాన్ ఖాన్ కు మెయిల్ లో మళ్లీ హత్యా బెదిరింపులు.. ఎవరి నుంచి అంటే ?
ఆ సమయంలో తీవ్ర గాయాలపాలైన దక్షకు డాక్లర్లు వైద్యం అందించారు. అయినా కూడా పరిస్థితి విషమించడంతో ఆ ఆడ చిరుత చనిపోయింది. ప్రాజెక్ట్ చిరుత కింద దక్షిణాఫ్రికా, నమీబియా నుంచి చిరుతలను తీసుకొచ్చి, కునో నేషనల్ పార్కులో వదిలిన తరువాత మరణించిన మూడో చిరుత ఇది. గత ఏడాది నుంచి 20 చిరుతలను జాతీయ పార్కుకు తీసుకురాగా, అందులో రెండు మార్చి, ఏప్రిల్ నెలల్లో చనిపోయాయి.
బందీగా పెరిగిన సాషా అనే చిరుతను భారతదేశానికి తీసుకురావడానికి ముందు నుంచే మూత్రపిండాల వ్యాధితో బాధపడుతోంది. అది మార్చిలో మరణించింది. ఆ చిరుతకు జనవరి 23న అలసట, నీరసంగా అనిపించడంతో అధికారులు చికిత్స కోసం క్వారంటైన్ కు తరలించారు. అయినా కూడా ఆ చిరుత చనిపోయింది. ఏప్రిల్ లో రెండో చిరుత ఉదయ్ జాతీయ పార్కులో అస్వస్థతకు గురయ్యింది. దీంతో అది చికిత్స పొందుతూ మరణించింది.
జమ్మూలో బాలాజీ మందిరం నిర్మించిన టీటీడీ.. భక్తుల సందర్శనార్థం జూన్ 8న ప్రారంభం..
కాగా.. జూన్ లో రుతుపవనాల ప్రారంభానికి ముందు కునో నేషనల్ పార్క్ లోని స్వేచ్ఛాయుత పరిస్థితులకు అలవాటుపడిన శిబిరాల నుంచి ఐదు చిరుతలను (ఇందులో మూడు ఆడ, రెండు మగ) విడుదల చేస్తామని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలిపింది. చిరుతలను కేఎన్పీ నుంచి బయటకు వెళ్లడానికి అనుమతిస్తామని, అవి గణనీయమైన ప్రమాదంలో ఉన్న ప్రాంతాలలోకి తొంగిచూస్తే తప్ప వాటిని తిరిగి స్వాధీనం చేసుకోలేమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు నమీబియా నుంచి తీసుకువచ్చిన ఎనిమిది చిరుతల్లో నాలుగింటిని కంచె వేసిన శిబిరాల నుంచి కేఎన్ పీలోని స్వేచ్ఛాయుత పరిస్థితుల్లోకి విడుదల చేశారు.
ఇంటర్ లో 600/600 మార్కులు సాధించిన కార్పెంటర్ కుమార్తె.. అభినందించిన సీఎం స్టాలిన్
గత ఏడాది సెప్టెంబర్ లో నమీబియా నుంచి వచ్చిన ఎనిమిది చిరుతలను మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లోని ప్రత్యేక ఎన్ క్లోజర్ లోకి విడుదల చేశారు. చిరుత పునఃప్రారంభ కార్యక్రమంలో భాగంగా నమీబియా నుంచి ప్రత్యేక విమానంలో ఈ చిరుతలను గ్వాలియర్ కు తీసుకొచ్చారు. అనంతరం రెండు భారత వైమానిక దళ హెలికాప్టర్లలో వాటిని జాతీయ ఉద్యానవనానికి తరలించారు. ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చిరుతలను భారత్ ఆహ్వానించింది.