జమ్మూలో బాలాజీ మందిరం నిర్మించిన టీటీడీ.. భక్తుల సందర్శనార్థం జూన్ 8న ప్రారంభం..
టీటీడీ ఆధ్వర్యంలో జమ్మూలో వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం జూన్ 8వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ ఆలయాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మంగళవారం సందర్శించారు.
జమ్మూలో తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బాలాజీ మందిరాన్ని నిర్మించింది. రూ.30 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ నూతన ఆలయాన్ని యాత్రికుల సందర్శనార్థం జూన్ 8వ తేదీన తెరవనున్నారు. హిందూ సనాతన ధర్మ వ్యాప్తి, వేంకటేశ్వరుని మహిమను పెద్ద ఎత్తున ముందుకు తీసుకువెళ్లాలనే నినాదంలో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయాల సంస్థ అయిన టీటీడీ భారతదేశంలోని ప్రతీ రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో కనీసం ఒక వెంకటేశ్వరుడి ప్రతిరూప ఆలయాన్ని నిర్మించే బాధ్యతను తనపై మోపింది. అందులో భాగంగానే జమ్మూ లో ఆలయాన్ని నిర్మించింది.
ఇంటర్ లో 600/600 మార్కులు సాధించిన కార్పెంటర్ కుమార్తె.. అభినందించిన సీఎం స్టాలిన్
తిరుపతి కేంద్రంగా పనిచేస్తున్న టీటీడీ ఇప్పటి వరకు అమరావతి, విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై, కన్యాకుమారి, భువనేశ్వర్, ముంబై, న్యూఢిల్లీలలో వేంకటేశ్వర ఆలయాలను నిర్మించింది. జమ్మూలో త్వరలోనే భక్తులకు అందుబాటులోకి రానుంది. రాయ్ పూర్, అహ్మదాబాద్ లలో కొత్త ఆలయాలు కూడా నిర్మించనున్నారు.
ఘోరం.. భర్త వేధింపులు భరించలేక ఇద్దరు పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్య.. ఎక్కడంటే ?
కాగా.. జమ్మూ లోని మజీన్ లో నూతన బాలాజీ మందిరాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రసిద్ధ మాత వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించే భక్తులకు సమీపంలోనే ఉన్న ఆ బాలాజీ మందిరం ఒక ప్రముఖ మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆలయ నిర్మాణానికి 62 ఎకరాల భూమిని కేటాయించిన జమ్మూ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మజీన్ ప్రాంతంలో టీటీడీ ప్రధాన ఆలయ సముదాయంతో పాటు ఉపాలయాలు, పోటు కిచెన్ ఏరియా, అన్నప్రసాదం కౌంటర్లు తదితరాలను నిర్మించింది. జూన్ 4న నూతన ఆలయ ప్రారంభోత్సవానికి సంబంధించిన అంకురార్పణం, ఇతర ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయి. జూన్ 8న మహాసంప్రోక్షణ నిర్వహించి, అదే రోజు నుంచి కొత్త ఆలయంలో భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.