సల్మాన్ ఖాన్ కు మెయిల్ లో మళ్లీ హత్యా బెదిరింపులు.. ఎవరి నుంచి అంటే ?
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు యూకేలో చదువుకుంటున్న ఓ భారతీయ విద్యార్థి నుంచి మెయిల్ ద్వారా హత్యా బెదిరింపులు వచ్చాయి. నిందితుడు అక్కడ మెడిసిన్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. దీంతో పోలీసులు అతడిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
కండల వీరుడు, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మరోసారి హత్య బెదిరింపులు వచ్చాయి. యూకేలో వైద్య విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థి మెయిల్ ద్వారా ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆ విద్యార్థిపై ముంబై పోలీసులు లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్ వోసీ) జారీ చేశారు. ఈ మెయిల్ పంపిన విద్యార్థిగా గుర్తించిన పోలీసులు అతడిని భారత్ కు రప్పించే ప్రక్రియను ప్రారంభించారు.
జమ్మూలో బాలాజీ మందిరం నిర్మించిన టీటీడీ.. భక్తుల సందర్శనార్థం జూన్ 8న ప్రారంభం..
కాగా.. పోలీసు విచారణలో ఆ విద్యార్థి హర్యానాకు చెందినవాడని తేలింది. అతను మెడిసిన్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. యూకేలో విద్యాసంవత్సరం ముగియడంతో ఈ ఏడాది చివరికల్లా ఆ విద్యార్థి భారత్ కు తిరిగి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే జైలులో ఉన్న గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ పేరుతో మార్చిలో ఆ విద్యార్థి సల్మాన్ ఖాన్ కు బెదిరింపు సందేశాలు పంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడు గోల్డీ బ్రార్ ను కలిసి వారి విభేదాలను శాశ్వతంగా పరిష్కరించుకోవాలని, లేదంటే పర్యవసానాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సల్మాన్ ఖాన్ కు కొన్ని రోజుల క్రితం తన అధికారిక ఐడీకి ఈ-మెయిల్ వచ్చింది.
ఇంటర్ లో 600/600 మార్కులు సాధించిన కార్పెంటర్ కుమార్తె.. అభినందించిన సీఎం స్టాలిన్
ఇటీవల పోలీసు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి సల్మాన్ ఖాన్ ను చంపేస్తానని ఓ మైనర్ బాలుడు ఫోన్ చేశాడు. దీనిపై విచారణ ప్రారంభించిన ముంబై పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఆ బాలుడు రాజస్థాన్ కు చెందిన వాడని పేర్కొన్నారు. కాగా..సల్మాన్ ఖాన్ చాలా కాలం నుంచి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. ఆయనకు అనేక సార్లు హత్య బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల బుల్లెట్ ప్రూఫ్ ఎస్ యూవీని కొనుగోలు చేశాడు.
ఘోరం.. భర్త వేధింపులు భరించలేక ఇద్దరు పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్య.. ఎక్కడంటే ?
ఈ ఏడాది మార్చిలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్‌ను చంపడమే తన జీవిత లక్ష్యం అని అన్నాడు. కృష్ణజింకను చంపినందుకుగాను ఆయన తమ సమాజానికి క్షమాపణలు చెప్పినప్పుడే అది ముగుస్తుందని అన్నారు. కాగా.. కృష్ణజింకలను లారెన్స్ బిష్ణోయ్ సమాజం తమ ఆధ్యాత్మిక నాయకుడు భగవాన్ జాంబేశ్వర్ పునర్జన్మ అని నమ్ముతారు. దానిని జంబాజీ అని కూడా పిలుస్తారు.