ఇంటర్ లో 600/600 మార్కులు సాధించిన కార్పెంటర్ కుమార్తె.. అభినందించిన సీఎం స్టాలిన్

తమిళనాడుకు చెందిన ఓ సాధారణ కార్పెంటర్ కుమార్తె ఇంటర్ లో 600కు 600 మార్కులు సాధించి టాపర్ గా నిలిచింది. ఆమె ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకుంది. ఆ బాలికను, తల్లిదండ్రులను, టీచర్లను సీఎం స్టాలిన్ అభినందించారు. 

Carpenters daughter who scored 600/600 marks in Inter..  CM Stalin congratulated..ISR

ఆ బాలిక తండ్రి ఓ సాధారణ కార్పెంటర్. మధ్య తరగతి కుటుంబం. జీవితంలో మంచి స్థాయిలో ఉండాలంటే చదువే మార్గమని ఆ బాలిక నమ్మింది. దాని కోసం రేయింబవళ్లు కష్టపడింది. ఇటీవల విడుదలైన తమిళనాడు హయ్యర్ సెకండరీ (ఇంటర్ ) పరీక్ష ఫలితాల్లో ఆరు సబ్జెక్టుల్లో 100కు వంద మార్కులు మొత్తంగా 600కు 600 మార్కులు సాధించింది. దీంతో ఆమెను స్వయంగా సీఎం స్టాలిన్ తన ఆఫీసుకు పిలిపించుకొని అభినందించారు.

30 మంది చిన్నారులపై సీరియల్ రేపిస్ట్ హత్యాచారం, దోషిగా తేల్చిన కోర్టు..ఈ సైకో హర్రర్ కథ చదివితే వెన్నులో వణుకే

తమిళనాడు హయ్యర్ సెకెండరీ పరీక్షలను డీజీఈ సోమవారం విడుదల చేసింది. ఇందులో దిండిగల్ జిల్లాకు చెందిన ఓ కార్పెంటర్ కుమార్తె ఎస్ నందిని 600కు 600 మార్కులు సాధించింది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 100 మార్కుల చొప్పున స్కోర్ చేసింది. దీంతో సీఎం ఎంకే స్టాలిన్ నందినిని, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను తన ఆఫీసుకు పిలిపించుకున్నారు. వారందరినీ అభినందించారు. బాలిక ఉన్నత చదువులకు తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నందిని మాట్లాడుతూ.. ‘‘600కు 600 మార్కులు సాధించడం చాలా సంతోషంగా ఉంది. దీనిని నా ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు అంకితమిస్తున్నాను. ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చు’’ అని చెప్పింది.

ఘోరం.. భర్త వేధింపులు భరించలేక ఇద్దరు పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్య.. ఎక్కడంటే ?

అలాగే.. చెన్నై కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్ గాయత్రి అనే బాలిక అగ్రస్థానంలో నిలిచింది. రెండు సబ్జెక్టుల్లో 592, మరో నాలుగు సబ్జెక్టుల్లో 99 మార్కులు సాధించింది. ఆమె తల్లి పండ్ల దుకాణంలో, తండ్రి ప్రైవేట్ లైబ్రరీ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. ‘‘విద్య మాత్రమే మన జీవితాన్ని అనేక విధాలుగా మార్చగలదు. ఇతరులను అర్థం చేసుకోవడానికి విద్య ఒక్కటే మార్గం’’ అని గాయత్రి చెప్పింది. ప్రతీ ఒక్కరు జీవితంలో ఒక లక్ష్యాన్ని, మార్గాన్ని కలిగి ఉండాలని చెప్పారు.

స్వీపర్ గా పనిచేస్తున్న ఒంటరి తల్లి కుమార్తె మోనిషా కూడా 499 మార్కులు సాధించింది. ఆమె పోలీస్ ఆఫీసర్ కావాలనుకుంటుంది. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో చదువును ఎవరూ వదులుకోకూడదు. ఈ రోజు జీవితం మన చేతుల్లో ఉండకపోవచ్చు. కానీ రేపు మారుతుంది. అది మన చదువుతోనో, ప్రతిభతోనో మారవచ్చు. కాబట్టి మనం బాగా చదువుకోవాలి’’ అని పేర్కొంది. ఆ బాలికను కరుణాలయ అనే స్వచ్ఛంద సంస్థ గుర్తించి పెంచి పోషించింది. కాగా.. మొత్తంగా సోమవారం విడుదలైన హయ్యర్ సెకండరీ పరీక్షల్లో బాలికల ఉత్తీర్ణత శాతం 96.38 కాగా, బాలురు 91.45 శాతంగా ఉంది. మార్చి- ఏప్రిల్ నెలల్లో ఈ పరీక్షలు జరిగాయి. వీటికి మొత్తంగా 8,03,385 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 7,55,451 మంది ఉత్తీర్ణత సాధించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios