ఛత్తీస్‌గఢ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. ఇందులో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ఛత్తీస్‌గఢ్‌లో రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. జష్‌పూర్ జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
నారాయణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న అనిల్ సింగ్ తన కుటుంబంతో కలిసి ఆదివారం జిల్లాలోని గుల్లు ఫాల్‌కు విహారయాత్రకు వెళ్లాడు. సాయంత్రం ఆలస్యంగా తిరిగి వస్తూ లోయ నుంచి దిగుతుండగా.. కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో అనిల్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో 9 మంది గాయపడ్డారు.
9 రోజుల విరామం తర్వాత భారత్ జోడో యాత్ర పునఃప్రారంభం.. ఈ రోజు యూపీలోకి రాహుల్ ఎంట్రీ..
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగానే అనిల్ సింగ్ సోదరి జయంతి, ఎనిమిదేళ్ల కుమారుడు మోహిత్, 11 నెలల బాలిక వెనీషా మృతి చెందారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని పొరుగు రాష్ట్రమైన జార్ఖండ్ రాజధాని రాంచీలోని ఆసుపత్రిలో చేరారు. మరో నలుగురు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
స్నేహితులతో కలిసి ప్రియురాలిపై అత్యాచారం చేసిన ప్రియుడు..
‘‘ జలపాతం, ఆనకట్ట మధ్య ఒక పదునైన మలుపు వద్ద డ్రైవర్ కంట్రోల్ కోల్పోయినట్టు తెలుస్తోంది. వాహనం చెట్టును ఢీకొట్టింది. గాయపడిన ఆరుగురిలో ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం పొరుగున ఉన్న జార్ఖండ్‌లోని రాంచీకి తరలించాం’’ అని జష్పూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డి రవిశంకర్ తెలిపారు. ఈ ప్రమాదంపై సంబంధిత ఇండియన్ పీనల్ కోడ్ నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఎస్పీ అన్నారు.
ఒడిశాలో మరో రష్యన్ మృతి.. పదిహేను రోజుల్లో మూడో రష్యా జాతీయుడి మరణం..
తమిళనాడు రాష్ట్రంలో కూడా ఇలాంటి రోడ్డు ప్రమాదమే జరిగింది. కడలూరులో మంగళవారం ఉదయం చోటు చేసుకోవడంతో ఐదుగురు మృతి చెందారు. కడలూరు జిల్లా వేపూర్ సమీపంలో మంగళవారం ఉదయం ఆరు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోయారు. కారులో ఉన్న ఐదు మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వరుసగా ఆరు వాహనాలు ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందులో రెండు ప్రైవేట్ బస్సులు, రెండు లారీలు, రెండు కార్లు ఉన్నాయి. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
