ఒడిశాలో మరో రష్యన్ మృతి.. పదిహేను రోజుల్లో మూడో రష్యా జాతీయుడి మరణం..
15 రోజుల్లో వ్యవధిలో మన దేశంలో ముగ్గురు రష్యన్లు మరణించారు. గత నెల 24వ తేదీన రష్యా ఎంపీ పావెల్ ఆంటోవ్, 22వ తేదీన ఆయన స్నేహితుడి వ్లాదిమిర్ బిడెనోవ్ అనుమానస్పదంగా చనిపోయారు. తాజాగా ఒడిశాలోని ఓడలో మరో రష్యన్ జాతీయుడి మృతి చెందాడు.

రష్యా దేశానికి చెందిన మరో వ్యక్తి ఒడిశాలో మృతి చెందాడు. జగత్సింగ్పూర్ జిల్లాలోని పారాదీప్ ఓడరేవులో మంగళవారం రష్యన్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మృతుడిని సెర్గీ మిల్యకోవ్ (51)గా పోలీసులు గుర్తించారు. అతడు గుండెపోటుతో మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
న్యూఇయర్ వేళ యువతిని 13 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు.. దేశరాజధాని ఘటనలో షాకింగ్ విషయాలు..
‘‘అతడు కార్గో ఓడ సిబ్బందిలో ఒకడిని మాకు తెలిసింది. అయితే అతడు మరణానికి కారణం ఏంటన్నది పోస్ట్ మార్టం నివేదిక తరువాతే తెలుస్తుంది. మా ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఆయన అకస్మాత్తుగా ఓడలో కుప్పకూలిపోయాడు. ఆయన గుండెపోటుతో మరణించి ఉండవచ్చు’’ అని జగత్సింగ్పూర్ ఎస్పీ అఖిలేశ్వర్ సింగ్ తెలిపారు.
పోలీసులు మిల్యకోవ్ పోస్ట్ మార్టంను వీడియో తీస్తారని, అతడిని విసెరల్ నమూనాలతో పాటు శరీరాన్ని కూడా భద్రపరుస్తారని ఎస్పీ పేర్కొన్నారు. కాగా..రష్యా ఎంపీ పావెల్ ఆంటోవ్ (65) డిసెంబర్ 24న రాయ్‌గఢ్‌లోని ఓ హోటల్ మూడో అంతస్తు నుంచి పడి మృతి చెందారు. అంతకు రెండు రోజుల ముందు డిసెంబర్ 22వ తేదీన పావెల్ ఆంటోవ్ స్నేహితుడైన వ్లాదిమిర్ బిడెనోవ్ కూడా అదే హోటల్ లో శవమై కనిపించారు.
చాలా ప్రాంతాల్లో రికార్డుస్థాయికి కనిష్ట ఉష్ణోగ్రతలు.. దట్టమైన పొగమంచు.. : ఐఎండీ
అయితే అంతకు ముందు చనిపోయిన పావెల్ మృతదేహాన్ని భద్రపర్చకపోవడం, శవపరీక్షను వీడియో తీయకపోవడంపై ఒడిశా పోలీసులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పావెల్, వ్లాదిమిర్ బిడెవోన్ మృతదేహాలను పోలీసులు దహనం చేశారు.