స్నేహితులతో కలిసి ప్రియురాలిపై అత్యాచారం చేసిన ప్రియుడు..
వివాహేతర సంబంధం పెట్టుకుని అతడినే పెళ్లి చేసుకుంటానని వెళ్లిన ఓ మహిళకు.. చేదు అనుభవం ఎదురయ్యింది. తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడు ప్రియుడు.

చెన్నై : వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ మీద ఆమె ప్రియుడు, స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తిరువళ్లూరు సమీపంలోని పూలరంబాక్కంలోని ఓ ఇంట్లో జరిగింది. ఇద్దరు పిల్లల తల్లి అయిన 26 ఏళ్ల ఆ మహిళపై ఆమె 20 ఏళ్ల ప్రియుడు, అతని ఇద్దరు స్నేహితులు ఆదివారం అత్యాచారం చేశారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
బాధితురాలి ప్రియుడు విజయకుమార్, ఆటోరిక్షా డ్రైవర్. ఆమెకంటే ఆరేళ్లు చిన్నవాడు. ఆమెకు చీర కొనిస్తానని చెప్పి ఇంటికి తీసుకెళ్లాడని పోలీసులు తెలిపారు. ఆ మహిళ విజయ్‌కుమార్‌తో గత ఆరు నెలలుగా సంబంధాన్ని కొనసాగిస్తోంది. తన భర్తతో తనకు సత్సంబంధాలు లేవని, విడిపోవాలనే ఆలోచనలో ఉందని పోలీసులు తెలిపారు. బాధితురాలిని మార్కెట్‌కు తీసుకెళ్తానని విజయ్‌కుమార్ హామీ ఇవ్వడంతో ఆదివారం ఆమె విజయకుమార్ ను కలవడానికి వచ్చింది.
ఒడిశాలో మరో రష్యన్ మృతి.. పదిహేను రోజుల్లో మూడో రష్యా జాతీయుడి మరణం..
విజయ్ కుమార్ ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని, ఇంటికి తిరిగి వెళ్లనని ఆమె... అతనికి చెప్పింది. దీంతో అతను బాధితురాలిని తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. అక్కడికి వెళ్లాక.. తన సోదరుడికి యాక్సిడెంట్ అయ్యిందని, తాను వెంటనే ప్రమాద స్థలానికి చేరుకోవాలని చెప్పి హడావుడిగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇంట్లోనుంచి వెళ్లే ముందు అదే గ్రామానికి చెందిన సామ్‌రాజ్, 27, సతీష్, 27 అనే తన స్నేహితులను ఇంటికి రావాల్సిందిగా కోరినట్లు పోలీసుల విచారణలో తేలింది.
వీరిద్దరూ ఆమెను బలవంతం చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం బయటపెడితే పరిస్థితి దారుణంగా ఉంటుందని ఆమెను హెచ్చరించారు. ఆమె ఏడ్చి, గట్టిగా కేకలు పెట్టినప్పటికీ, దగ్గర్లో సహాయానికి ఎవ్వరూ లేరు. ఆ ఇల్లు నిర్జన ప్రదేశంలో ఉందని పోలీసులు చెప్పారు. ఆ తరువాత అక్కడినుంచి బయటపడిన మహిళ పుల్లరంబాక్కం వరకు ఆటోలో ఎలాగో చేరుకుంది. తిరువళ్లూరు తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. చిన్నాచితకా పనులు చేస్తూ జీవనోపాధి పొందుతున్న విజయ్‌కుమార్‌తో పాటు అతని ఇద్దరు సహచరులను ఇన్‌స్పెక్టర్ కమల్ హసన్ నేతృత్వంలోని బృందం పట్టుకుంది.
(లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆమె గోప్యతను కాపాడేందుకు బాధితురాలి గుర్తింపు బహిర్గతం చేయబడలేదు)