Asianet News TeluguAsianet News Telugu

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న కారు.. నలుగురు మృతి

ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న టక్కును ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రక్కు డ్రైవర్ తో పాటు కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఢిల్లీ-ఆగ్రా జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Fatal road accident.. A car collided with a parked truck.. Four killed..ISR
Author
First Published Sep 16, 2023, 11:57 AM IST | Last Updated Sep 16, 2023, 11:57 AM IST

రోడ్డుపై ఆగి ఉన్న ఓ ట్రక్కును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదం ఉత్తరప్రదేశ్ లోని మథురలో ఢిల్లీ-ఆగ్రా జాతీయ రహదారిపై జరిగింది.  కారులోని ప్రయాణికులంతా అలీగఢ్ నుంచి మథుర సమీపంలోని కోకిలవన్ ధామ్ శని మందిర్ కు వెళ్తున్నారు.

పట్టాలెక్కనున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ స్లీపర్ వెర్షన్.. ఎప్పటి నుంచి అంటే ?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ ప్రాంతానికి చెందిన పలువురు వ్యక్తులు  కోకిలవన్ ధామ్ శని మందిర్ ను దర్శించాలని భావించారు. అందుకే ఓ వారు కారులో శుక్రవారం ప్రయాణం ప్రారంభించారు. అయితే ఆ వాహనం శనివారం ఉదయం ఢిల్లీ-ఆగ్రా జాతీయ రహదారిపై ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో మథుర వద్దకు చేరుకోగానే అక్కడ ఆగి ఉన్న ఓ ట్రక్కును వెనకాల నుంచి కారు ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నిషిద్, అలోక్, ఆకాష్ అనే ముగ్గురు ప్రయాణికులు, ట్రక్కు డ్రైవర్ అజిత్ అక్కడికక్కడే మృతి చెందినట్లు మథుర (ఉత్తరప్రదేశ్) పోలీసు సూపరింటెండెంట్ మార్తాండ్ ప్రకాశ్ సింగ్ తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న వారు అలీగఢ్ వాసులు అని, ట్రక్కు డ్రైవర్ బీహార్ లోని చాప్రాకు చెందినవాడు. కాగా.. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఏళ్ల తరబడి భర్తను వేధిస్తున్న భార్య.. బాధితుడికి అండగా నిలిచిన ఢిల్లీ హైకోర్టు

ఇలాంటి ఘటనే ఈ నెల 13వ తేదీన రాజస్థాన్ లోని జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఆగి ఉన్న బస్సును వెనకాల నుంచి వచ్చి ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది మృతి అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో అనేక మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు హాస్పిటల్ కు తరలించారు. గుజరాత్ నుంచి ఓ ప్యాసింజర్ బస్సు పలువురిని ఎక్కించుకొని మథుర వెళ్తోంది. అయితే ఆ బస్సు జైపూర్-ఆగ్రా రోడ్డులో ప్రయాణిస్తున్న సమయంలో భరత్‌పూర్ జిల్లాలోని హంత్రా సమీపంలో అదుపుతప్పింది.

సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ కేసులు ఏమయ్యాయి ? వాటిలో కదలికేదీ ? - కల్వకుంట్ల కవిత

దీంతో ఆ బస్సును హైవేపై ఉంచారు. అయితే వెనకాల నుంచి వేగంగా వచ్చిన ఓ ట్రక్కు ఆ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో భారీ ప్రాణనష్టం జరిగింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే 11 మంది మరణించారు. 12 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను రక్షించి హాస్పిటల్ కు తరలించారు. అలాగే మృతదేహాలను హాస్పిటల్ లోని మార్చురీకి తీసుకెళ్లామని ఎస్పీ భరత్‌పూర్ మృదుల్ కచావా చెప్పారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios