ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ క్షీణిస్తోంది.. కానీ ‘భారత్’ ఈ సంక్షోభం నుంచి బయటపడింది - మోహన్ భగవత్
ప్రపంచంలోని అనేక దేశాల్లో కుటుంబ వ్యవస్థ క్షీణిస్తోందని, కానీ మన దేశం మాత్రం ఈ సంక్షోభం నుంచి బయట పడిందని అన్నారు. భారతదేశ సంస్కృతి మూలాలు దృఢంగా, సత్యంపై ఆధారపడి ఉండటమే దానికి కారణం అని చెప్పారు.

ప్రపంచ వ్యాప్తంగా కుటుంబ వ్యవస్థ క్షీణిస్తోందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. కానీ భారత్ కు సత్యం పునాదిగా ఉందని, అందుకే మన దేశం ఈ సంక్షోభం నుంచి బయటపడిందని తెలిపారు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ సిటీలో మంగళవారం సీనియర్ సిటిజన్ల సమావేశం జరిగింది. దీనికి మోహన్ భగవత్ హాజరై మాట్లాడారు. మన సంస్కృతి మూలాలు సత్యంపై ఆధారపడి ఉన్నాయని చెప్పారు. అయితే ఈ సంస్కృతిని రూపుమాపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇండియా టు భారత్.. పేరు మార్పుపై 2016లోనే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ?
కొందరు తమ స్వార్థ తత్వాల ద్వారా లౌకిక సుఖాలను, ప్రయత్నాలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మోహన్ భగవత్ అన్నారు. ఈ ధోరణిని ఆయన 'సాంస్కృతిక మార్క్సిజం'గా అభివర్ణించారు. ‘‘ప్రాపంచిక సుఖాల వైపు మొగ్గు చూపడం హద్దులు దాటింది. కొంతమంది తమ స్వార్థం కారణంగా ప్రాపంచిక సుఖాలను నెరవేర్చుకునే ఈ ధోరణిని సరైనదిగా సమర్థించడానికి ప్రయత్నిస్తారు. దీన్ని నేడు సాంస్కృతిక మార్క్సిజం అంటారు’’ అని అన్నారు.
‘‘ఇలాంటి అనైతికతకు మంచి పేరు తీసుకురావడం ద్వారా వీళ్లు మద్దతిస్తున్నారు. ఎందుకంటే సమాజంలో ఇలాంటి అరాచకాలు వారికి సహాయపడతాయి, వారు తమ ఆధిపత్యాన్ని స్థాపించగలరు’’ అని మోహన్ భగవత్ అన్నారు. కొందరు వివిధ తత్వాలు, సిద్ధాంతాల గురించి మాట్లాడటం ద్వారా మంచిని నాశనం చేయాలనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేవారు.
జీతం ఇంకా పడటం లేదని హోంగార్డు మనస్థాపం.. ఈఎంఐ ఎలా కట్టాలని అధికారుల ముందే ఆత్మహత్యాయత్నం..
ఇలాంటి ఫిలాసఫీ కారణంగానే మన దేశంతో పాటు ప్రపంచంలోని ఇతర దేశాల్లోనూ ఈ సంక్షోభం ప్రబలంగా ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్నారు. ఫలితంగా కుటుంబ వ్యవస్థ క్షీణిస్తోందని చెప్పారు. కానీ సత్యం భారతదేశానికి ఆధారం కాబట్టే భారత్ మనుగడ సాగించగలుగుతోందని తెలిపారు. మన సంస్కృతి మూలాలు దృఢంగా, ఈ సత్యంపై ఆధారపడి ఉన్నాయని అన్నారు. అస్మానీ, సుల్తానీ అనే మన సంస్కృతిని రూపుమాపడానికి అనేక ప్రయత్నాలు జరిగాయని ఆయన వ్యాఖ్యానించారు.