ఎస్పీజీ చీఫ్ అరుణ్ కుమార్ సిన్హా కన్నుమూత.. ఏమైందంటే ?
Gurugram: స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) డైరెక్టర్ అరుణ్ కుమార్ సిన్హా కన్నుమూశారు. గత కొంత కాలం నుంచి ఆయన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. దాని కోసం ఆయన చికిత్స పొందతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం ఆయన చనిపోయారు.

SPG Chief Arun Kumar Sinha: ప్రధాని భద్రత బాధ్యతలు చూసుకునే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) డైరెక్టర్ అరుణ్ కుమార్ సిన్హా చనిపోయారు.హర్యానాలోని గురుగ్రామ్ లో ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ఆయన బుధవారం ఉదయం కన్నుమూశారు. 2016 నుంచి ఎస్పీజీ చీఫ్ గా పనిచేస్తున్న ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ప్రధానుల భద్రత బాధ్యతలు నిర్వర్తించారు. వాస్తవానికి ఆయన సర్వీసు ముగిసింది. కానీ ప్రభుత్వం ఇటీవలే ఆయన సర్వీసును పొడగించింది.
61 ఏళ్ల ఈ అధికారి గత కొన్ని నెలలుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. దాని కోసం చికిత్స పొందుతున్నాడు. సిన్హా 1987 బ్యాచ్ కేరళ కేడర్ ఐపీఎస్ అధికారి. ఆయన ఎస్పీజీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టకముందు కేరళలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (స్పెషల్ సర్వీస్ అండ్ ట్రాఫిక్)గా పని చేశారు.
ఈ ఏడాది మే 30న ఎస్పీజీ చీఫ్ గా పదవి విరమణ చేయాల్సి ఉండగా.. దాని కంటే ఒక రోజు ముందు ప్రధాని మోడీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) ఆయనను మరో ఏడాది పాటు తిరిగి నియమించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దీంతో ఆయన పదవి కాలం మరో ఏడాది పెరిగింది.