రైతు ఆందోళనకారులకు కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తర్వాత ప్రతి రోజు 500 మంది రైతులు ట్రాక్టర్‌లలో పార్లమెంటుకు వెళ్తారని సంయుక్త కిసాన్ మోర్చా వెల్లడించింది. సమావేశాలు పూర్తయ్యే వరకు ఈ ట్రాక్టర్ మార్చ్ జరుగుతుందని తెలిపింది. నవంబర్ 26తో ఢిల్లీ సరిహద్దులో ఆందోళనలు ప్రారంభమై ఏడాది గడవనుంది.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు సాగు చట్టాలపై రైతులు నిర్విరామంగా పోరాడుతున్నారు. గతేడాది నవంబర్ 26న ఈ ఆందోళన మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజీ లేకుండా ఆందోళనలు చేస్తున్నారు. అంతేకాదు, కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తేవడానికి రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. తాజాగా, సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తర్వాత ప్రతి రోజు పార్లమెంటుకు శాంతియుత ట్రాక్టర్ మార్చ్ చేపడతామని వెల్లడించారు. ప్రతి రోజు 500 మంది ఎంపిక చేసిన రైతులు ట్రాక్టర్లలో పార్లమెంటుకు ర్యాలీగా వెళ్తారని సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది.

మూడు వ్యవసాయ చట్టాల(Agri Laws)ను వ్యతిరేకిస్తూ Delhi సరిహద్దులో ప్రధానంగా Punjab, Haryana, ఉత్తరప్రదేశ్‌ల నుంచి Farmers ఇక్కడ Protest చేస్తున్నారు. ఢిల్లీ సరిహద్దులో ఆందోళనలు గతేడాది నవంబర్ 26న మొదలుపెట్టారు. ఇదే రోజున అంటే ఈ నెల 26వ తేదీ నుంచి రైతు సంఘాలు తమ సంఘ సభ్యులను పెద్ద మొత్తంలో గుమిగూడే పని చేస్తుందని రైతులు తెలిపారు. శీతాకాల Parliament sessions ప్రారంభమైన తర్వాత టిక్రి, ఘాజీపూర్‌ల నుంచి ప్రతి రోజు ఐదు వందల మంది రైతులు శాంతియుతంగా ఢిల్లీకి వెళ్తారని సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. పార్లమెంటుకు వెళ్తారని, అక్కడ సమావేశాలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి సాయంత్రం మళ్లీ తిరుగుప్రయాణమవుతారని వివరించింది. 

Also Read: హర్యానా ఎల్లెనాబాద్ ఉపఎన్నికలో ‘రైతుల విజయం’.. ఆరువేల మెజార్టీతో అభయ్ గెలుపు

ఢిల్లీ పోలీసులు ఈ ప్రకటనపై స్పందించారు. కేవలం కిసాన్ సంసద్‌కు మాత్రమే అనుమతులు ఇస్తామని వివరించారు. ట్రాక్టర్ మార్చ్ చేపట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వబోమని తెలిపారు. ఇదే వారంలో రైతులకు, ఢిల్లీ పోలీసులకు మధ్య సమావేశం జరిగే అవకావం ఉంది. రాకేశ్ తికాయత్ మాట్లాడుతూ, వారు రోడ్లు తెరిచారని, తాము ఢిల్లీ వెళ్లడానికి నిర్ణయించుకున్నామని అన్నారు. ఒక వేళ రైతుల మార్చ్‌కు పోలీసులు అనుమతి ఇవ్వకుంటే ఎలా? అని ప్రశ్నించగా, తామేమైనా చైనా నుంచి వచ్చామా, పర్మిషన్ తీసుకోవడానికి? అని ఎదురు ప్రశ్న వేశారు.

Also Read: అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రశ్నలతో రోస్ట్ చేసిన రైతులు.. మీటింగ్ మధ్య నుంచే తప్పుకున్న ఢిల్లీ సీఎం

రైతు ఆందోళన మొదలుపెట్టి ఏడాది గడుస్తున్న సందర్భంగా భారీ నిరసనలకు ప్రణాళికలు వేస్తున్నట్టు ఎస్‌కేఎం వివరించింది. నవంబర్ 29 నుంచి ప్రతి రోజు ఎంపిక చేసిన 500 మంది రైతు వాలంటీర్లను ఫుల్ డిసిప్లీన్‌తో ఢిల్లీకి పంపుతామని తెలిపింది. జాతీయ రాజధానిలో వారి నిరసన హక్కును తెలియజేయడానికి వారు వెళ్తారని పేర్కొంది. ఈ నిర్ణయం కేవలం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికేనని, తద్వార తమ డిమాండ్లను వారు తీరుస్తారనే భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. అన్ని రైతు సంఘాలు తమ సభ్యులను ఢిల్లీ వైపు రప్పిస్తాయని, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్తాన్‌ల నుంచి పెద్దమొత్తంలో రైతులు వచ్చే అంచనాలు ఉన్నాయని తెలిపింది., సరిహద్దుల్లోనే అదే రోజున భారీ సభలు నిర్వహించే ప్లాన్స్ వేస్తున్నట్టు వివరించింది. ఈ పోరాటంలో అసులు బాసిన కనీసం 650 మంది అమరులకు నివాళులు అర్పిస్తామని తెలిపింది.

శీతాకాల సమావేశాలు ఈ నెల 29వ తేదీ నుంచి డిసెంబర్ 23వ తేదీ వరకు జరగనున్నాయి.