అరవింద్ కేజ్రీవాల్ గుక్కతిప్పుకోకుండా రైతులు ప్రశ్నలతో దాడి చేశారు. ఆర్టికల్ 370పై వైఖరి మొదలు, రాష్ట్రాలకు అధికారాలు, బీఎస్ఎఫ్ పరిధి పెంపు మొదలు అనేక అంశాలను ప్రస్తావించారు. దీనితో ఇవన్నీ రాజకీయపరమైన ప్రశ్నలని దాటవేశారు. ప్రశ్నల పరంపర పెరగడంతో ఆయన సమావేశం మధ్యలో నుంచి బయటకు వెళ్లిపోయారు. 

జలంధర్: Delhi సీఎం Arvind Kejriwalకు చేదు అనుభవం ఎదురైంది. Farmersతో సమావేశమైన అరవింద్ కేజ్రీవాల్‌పై రైతులు ప్రశ్నలపై ప్రశ్నలతో విరుచుకుపడ్డారు. అవన్నీ రాజకీయ ప్రశ్నలని దాటవేసే ప్రయత్నం చేశారు ఢిల్లీ CM. అయినా వెనక్కి తగ్గకుండా ప్రశ్నలను సంధించడంతో తాళలేక అరవింద్ కేజ్రీవాల్ సమావేశం నుంచి అర్ధంతరంగా బయటకు వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Scroll to load tweet…

Punjab ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తరుచూ ఆ రాష్ట్రం పర్యటిస్తున్నారు. ప్రస్తుతం పంజాబ్‌లో రైతుల ఆందోళనలు ప్రధాన అంశంగా ఉన్నది. ఈ నేపథ్యంలోనే అరవింద్ కేజ్రీవాల్, AAP లోకల్ యూనిట్ కలిసి రైతులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించాయి. రైతులను ఆహ్వానించాయి. మాన్సా జిల్లా ఖైలా మాలిక్‌పూర్ గ్రామంలో రైతులతో అరవింద్ కేజ్రీవాల్, ఆప్ ఎంపీ భగవంత్ మన్, ఇతర పార్టీ నేతలు రైతులతో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో పంజాబ్ కిసాన్ యూనియన్ ఉపాధ్యక్షుడు గుర్జత్ సింగ్ మాన్సా అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రశ్నలు గుమ్మరించారు. Article 370 రద్దు చేయడంపై మీ వైఖరి ఏంటని అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు. ఇది రైతుల సమస్య ఎలా అయింది అంటూ కేజ్రీవాల్ ఎదురు ప్రశ్న వేశారు. ఈ ప్రశ్న రైతుల, రాష్ట్ర హక్కులకు సంబంధించినదని, ఆ ఆర్టికల్ రద్దు చేసినవారే సాగు చట్టాలూ రూపొందించారని రైతు నేత సమర్థించారు.

Also Read: రైతుల బ్యాలెట్ పవర్‌కు పరీక్ష.. ఎల్లెనాబాద్ ఉపఎన్నిక

ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆప్ సమర్థించింది.

Scroll to load tweet…

తాను రోజూ ఢిల్లీ రాష్ట్ర హక్కులను హరించడానికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నారని, అలాంటప్పుడు మరో రాష్ట్ర హక్కులను లాగుసుకుంటే ఎందుకు సమర్థిస్తామని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ విషయంపై కేంద్రానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశామని చెప్పారు. ఇలాంటివి కాకుండా రైతులకు సంబంధించిన ప్రశ్నలేమైనా ఉన్నాయా? అని మరలా అడిగారు. రాజకీయపరమైన ప్రశ్నలకు బయట సమాధానం చెబుతానని అన్నారు. 

Scroll to load tweet…

తాను రైతులకు మద్దతుగా లేనంటే అసలు ఎవరూ ఉండనట్టేనని అరవింద్ కేజ్రీవాల్ సమర్థించుకున్నారు. రైతులు ఆందోళనలు మొదలుపెట్టినప్పటి నుంచి తాను మద్దతిస్తున్నట్టు గుర్తుచేశారు. సాగుచట్టాలు రూపొందించగానే తాము రైతులకు అండగా నిలబడ్డామని వివరించారు. కానీ, ఆయన సమాధానాలకు రైతులు సంతృప్తి చెందినట్టుగా ఆ వీడియోలో కనిపించలేదు.

మళ్లీ అదే ప్రశ్న. ఆర్టికల్ 370 రద్దుపై ఆప్ వైఖరి ఏమిటని ప్రశ్నించారు. ఇక కేజ్రీవాల్ సమాధానానికి బదులు సమావేశం నుంచి బయటకు వెళ్లడాన్ని ఎంచుకున్నారు. అంతేకాదు, రాష్ట్రానికి మరిన్ని అధికారులు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పరిధిని పెంచడం, సట్లేజ్ యమునా లింక్ కెనాల్, ఇతర దీర్ఘకాలిక సమస్యలను ఆయన ముందు ప్రస్తావించారు.

Also Read: కశ్మీర్‌లో ఉగ్రవాదం.. పౌర హత్యలపై సమాధానమివ్వండి.. అమిత్ షా భేటీలో వీటిపైనే చర్చ

కాగా, ఈ వీడియోలు వైరల్ కాగానే, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా క్యాబినెట్ మంత్రి రుహుల్లా మెహదీ, కాంగ్రెస్ నేత సల్మాన్ అనీస్ సోజ్ ట్విట్టర్‌లో స్పందించారు. రైతుల ప్రశ్నలపై హర్షం వ్యక్తం చేశారు. అరవింద్ కేజ్రీవాల్ అసలు రూపాన్ని వెలికి తీశారని అనీస్ సూజ్ పేర్కొన్నారు.