కర్ణాటక సీనియర్ లీడర్, ఫైవ్ టైమ్ ఎమ్మెల్యే జీహెచ్ తిప్పారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు ఒక మహిళ వాట్సాప్ వీడియో కాల్ చేసి ఆమె ప్రైవేట్ పార్ట్స్ చూపించడం మొదలు పెట్టిందని పేర్కొన్నారు. 

బెంగళూరు: కర్ణాటక ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ లీడర్ జీహెచ్ తిప్పారెడ్డి తన వాట్సాప్‌కు ఓ వీడియో కాల్ వచ్చిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ మహిళ తనకు వీడియో కాల్ చేసి ఆమె ప్రైవేట్ పార్ట్స్ చూపించడం మొదలు పెట్టిందని ఆరోపించారు. ఆ మహిళ ఎవరో తనకు తెలియదని వివరించారు. అనంతరం, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసి.. సదరు మహిళపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అక్టోబర్ 31వ తేదీన సాయంత్రం తనకు వీడియో కాల్ వచ్చినట్టు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జీహెచ్ తిప్పారెడ్డి ఆరోపించారు. ఆ వీడియో కాల్‌లో ఎదుటి మహిళ తన ప్రైవేట్ పార్ట్స్ చూపించిందని పేర్కొన్నారు. ఆమె తన డ్రెస్‌ విప్పడం మొదలు పెట్టిందని వివరించారు. కాల్ డిస్‌కనెక్ట్ చేయగానే ఓ వల్గర్ వీడియోను తనకు పంపించిందని తన ఫిర్యా దులో ఆయన పేర్కొన్నారు. ఆ కాలర్ పై వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read: ఆ కాల్స్‌తో జాగ్రత్త : ‘‘సార్’’ అంటూ వలపు వల.. ఆ ట్రాప్‌లో పడ్డారో, ఇక అంతే సంగతులు

ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనకు తొలిసారి ఆమె నుంచి కాల్ వచ్చినప్పుడు ఆమె గురించి ప్రశ్నలు వేశానని, కానీ, ఆమె వాటికి సమాధానాలు చెప్పలేదని వివరించారు. ఆ తర్వాత కొన్ని నిమిషాలకు తనకు మరో కాల్ వచ్చిందని పేర్కొన్నారు. ఆ కాల్‌ లో మహిళ తన ప్రైవేట్ పార్ట్స్ చూపించడం మొదలు పెట్టిందని వివరించారు.

‘అప్పుడు నేను నా ఫోన్ పక్కన పెట్టేశా.. మళ్లీ ఒక అర నిమిషంలో కాల్ వచ్చింది. అప్పుడు ఫోన్ నా వైఫ్‌కు ఇచ్చాను. ఆమె ఆ కాల్‌ను కట్ చేసి నెంబర్ బ్లాక్ చేసింది’ అని ఆయన వివరించారు. ఓ పోలీసు అధికా రి సలహా మేరకు తాను సైబర్ క్రైమ్ సెల్ పోలీసు లకు ఫిర్యాదు అందించినట్టు తెలిపారు.