టెక్ దిగ్గజం విప్రో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా అమిత్ చౌదరి నియామకం.

విప్రో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా అమిత్ చౌదరి నియమితులయ్యారు. ఆయన 15 సంవత్సరాల కిందట క్యాప్ జెమినిలో చేరారు. తరువాత విప్రోకు మారారు. తాజాగా సంస్థలో ఉన్నత పదవిని అధిరోహించారు. 

Tech giant Wipro appoints Amit Chaudhary as Chief Operating Officer

టెక్ దిగ్గజం విప్రో తన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్‌గా అమిత్ చౌదరిని నియమిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. ఆయన సంస్థ సంస్థాగత కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, స్థిరమైన అభివృద్ధిని కొనసాగించడానికి ఆయన బాధ్యత వహిస్తారని సంస్థ పేర్కొంది. బెంగళూరుకు చెందిన ఈ సంస్థలో సీఐవో గా ఉన్న బీఎం భానుమూర్తి గత ఏడాది జూలైలో పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. తాజా నియామకంతో ఈ సంస్థ తన టాప్ మేనేజ్ మెంట్ లో సీఓఓ స్థానాన్ని తిరిగి భర్తీ చేసినట్లయ్యింది.

ఇండియన్ ఆర్మీ యూనిఫామ్ డిజైన్, ప్యాటర్న్‌పై పేటెంట్ రైట్స్ నమోదు

పరివర్తన చొరవలపై చౌదరి సంస్థ అంతటా విప్రో నాయకత్వ బృందాలతో కలిసి పనిచేస్తాడని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆయన గ్లోబల్ బిజినెస్ ఆపరేషన్స్, డెలివరీ ఎక్సలెన్స్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎంటర్ ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్ విధులను నిర్వహిస్తారు.

ఎమ్మెల్యేకు వాట్సాప్‌లో వీడియో కాల్ చేసి ప్రైవేట్ పార్ట్స్ చూపించిన మహిళ.. పోలీసులను ఆశ్రయించిన బీజేపీ నేత

చౌదరి క్యాప్ జెమినిలో 15 సంవత్సరాల పాటు చేశారు. అనంతరం ఆయన విప్రోలో చేరాడు. అక్కడ ఆయన ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్ యూనిట్ కు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా, దాని ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. క్యాప్ జెమినికీ ముందు, చౌదరి బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, కాడెన్స్ డిజైన్ సిస్టమ్స్ లో వివిధ నాయకత్వ పదవులను నిర్వహించారు.

ఈ నియామకంపై విప్రో లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ థియరీ డెలాపోర్టే మాట్లాడుతూ.. అమిత్ వ్యూహాత్మక ఆలోచనను కలిగి ఉన్నారని, విశ్వసనీయతతో విధులను నిర్వహిస్తారని తెలిపారు. “అమిత్ వ్యూహాత్మక ఆలోచన, విశ్వసనీయతతో అద్భుతమైన మిశ్రమాన్ని తీసుకువస్తున్నారు. ఆయన అనుభవం, ప్రత్యేక అవగాహనతో విప్రో వాటాదారుల అవసరాలను అందించే వ్యాపారాన్ని నిర్మించడం కొనసాగిస్తుంది’’అని తెలిపారు. 

సుబ్రమణ్యస్వామికి తగిన భద్రత కల్పించాం.. హైకోర్టుకు వివరించిన కేంద్రం

తన నియామకంపై చౌదరి మాట్లాడుతూ, “ నేను విప్రోలో చేరడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. అద్భుతమైన టీమ్‌తో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను. సంస్థ ప్రధాన వ్యాపారాన్ని మరింత బలోపేతం చేసే కొత్త విధానాన్ని తీసుకురావాలని నేను భావిస్తున్నాను. మేము మా వినియోగదారులకు అందించే విలువను మరింతగా పెంచుతాము. ’’ కాగా.. అమిత్ చౌదరి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-కాన్పూర్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-కలకత్తా పూర్వ విద్యార్థి. ఆయన న్యూయార్క్‌లో కూడా పని చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios