Asianet News TeluguAsianet News Telugu

40 వేల ఏళ్ల కిందట నుంచి అందరి డీఎన్ఏ ఒకటే - ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్

భారతదేశంలో నివసిస్తున్న ప్రజలందరి డీఎన్ఏ 40 వేల కిందటి నుంచి ఒకటే అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. కులాలు, మతాలకు అతీతంగా అందరూ ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. 

Everyone s DNA is the same since 40 thousand years ago - RSS Chief Mohan Bhagwat
Author
First Published Nov 16, 2022, 2:50 PM IST

ప్రతీ భారతీయుడు హిందువేనని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ పునరుద్ఘాటించారు. ఛత్తీస్‌గఢ్‌లో మంగళశారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. ‘‘ఎవరు ఏమి చెప్పినా కాబూల్ పశ్చిమం నుండి చిండ్విన్ నదికి తూర్పున, చైనా వాలుల నుండి శ్రీలంకకు దక్షిణంగా ఉన్న ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలందరూ 40,000 సంవత్సరాలుగా ఒకే డీఎన్ఎను కలిగి ఉన్నారు. అప్పటి నుంచి మన పూర్వీకులు ఒకటేనని సైన్స్ చెబుతోంది.’’ అని ఆయన అన్నారు.

ఇండియన్ నేవీలోని కొన్ని బ్రాంచ్‌లలోనే మహిళా అభ్యర్థులకు అనుమతి .. హైకోర్టుకు కేంద్రానికి సమాధానం

ప్రజలు తమ మతం గురించి ఏమనుకుంటున్నా, ఏం మాట్లాడినా ఆయా ప్రాంతంలో నివసిస్తున్నవారందరూ వందల ఏళ్లుగా ఒక్కటిగా ఉన్నారనేది సత్యమని మోహన్ భగవత్ అన్నారు. ‘‘గత 40,000 సంవత్సరాలుగా మనందరికీ ఒకే డీఎన్ఏ ఉంది. ప్రతీ వ్యక్తికి వారి సొంత పూజా విధానం ఉంటుందని మన పూర్వీకులు మనకు నేర్పించారు. ప్రతీ ఒక్కరూ వారి సొంత భాషలో మాట్లాడాలి. దీని వల్ల మరింత అభివృద్ధి చెందుతుంది’’ అని తెలిపారు.

మతాలు, కులాలకు అతీతంగా అందరూ ఐక్యంగా ఉండాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ విజ్ఞప్తి చేశారు. “భారతదేశంలో ఎప్పుడూ ఒక మతం లేదా భాష లేదు. వివిధ కులాలు ఉన్నాయి. కానీ దేశం ఒక్కటే. రాజులు, రాజవంశాలు వచ్చి, వెళ్లాయి. కానీ భారతదేశం యుగాలుగా అలాగే ఉంది’’ అని భగవత్ తెలిపారు. కాగా.. అంతకు ముందు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మాట్లాడుతూ.. వైవిధ్యాన్ని నిర్వహించడం కోసం ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తోందని అన్నారు. అఖండ భారత్ గురించి మాట్లాడటానికి ఎందుకు భయపడాలని నొక్కి చెప్పారు.

డిజిటల్ యాక్సెస్ అందరినీ కలుపుకుపోవాలి - జీ 20 శిఖరాగ్ర సమావేశం లో ప్రధాని మోడీ

ఇదిలా ఉండగా గత ఆదివారం ఆర్ఎస్ఎస్ నాయకుడు ఇంద్రేష్ కుమార్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. భారతదేశంలోని 99 శాతం మంది ముస్లింలు వారి పూర్వీకులు, సంస్కృతి, సంప్రదాయాలు, మాతృభూమి ఆధారంగా హిందూస్థానీలే అని చెప్పారు. భారతీయులకు ఉమ్మడి పూర్వీకులు ఉన్నారని, అందుకే వారి డీఎన్‌ఏ ఉమ్మడిగా ఉంటుందని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గతంలో వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని కూడా ఆయన సమర్థించారు.

ఈ రైతు ఆలోచనే వేరబ్బా.. తన మేకల కోసం ఏం చేశాడో తెలుసా?.. వైరల్ న్యూస్ !

ఆర్ఎస్ఎస్ ముస్లిం విభాగమైన ముస్లిం రాష్ట్రీయ మంచ్ (ఎంఆర్ఎం) కార్యకర్తలతో థానే జిల్లాలోని ఉట్టాన్లోని రాంభావ్ మహల్గి ప్రబోధినిలో రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి వర్క్షాప్ ముగింపు కార్యక్రమంలో కుమార్ ఆదివారం ప్రసంగించారు. ‘‘మన దేశం పట్ల మన కర్తవ్యాన్ని మనం అత్యున్నతమైనదిగా పరిగణించాలి. పవిత్ర ఖురాన్ ఆదేశాలు, సిద్ధాంతాల ప్రకారం అన్నింటి కంటే అన్నింటి కంటే గొప్పదిగా భావించాలి. భారతదేశంలో 99 శాతం మంది ముస్లింలు తమ పూర్వీకులు, సంస్కృతి, సంప్రదాయాలు, మాతృభూమి ప్రకారం హిందుస్థానీలు’’ అని ఆయన తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios