Asianet News TeluguAsianet News Telugu

ఈ రైతు ఆలోచనే వేరబ్బా.. తన మేకల కోసం ఏం చేశాడో తెలుసా?.. వైరల్ న్యూస్ !

Thanjavur: ఒక గ్రామంలో ఒక రైతు తన మేకల కోసం బియ్యం బస్తాలను ఉపయోగించి తాత్కాలిక రెయిన్‌కోట్‌లను తయారు చేశాడు. వర్షాకాలంలో మేత వేసేటప్పుడు అవి వెచ్చగా.. వానతో ఇబ్బందులు పడకుండా చేశాడు. ఆ రైతు తన మేకల కోసం ఇలా రెయిన్ కోట్ లు తయారు చేయడంతో ఇప్పుడు ఈ ప్రాంతంలో అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.
 

A farmer in Thanjavur, Tamil Nadu creates raincoats for his goats from rice sacks
Author
First Published Nov 16, 2022, 2:38 PM IST

Kulamangalam Farmer: రైతులు తాము పెంచుకుంటున్న జంతువుల పట్ల అనుబంధంగా ఉంటారో ఉదాహరణ నిలిచే ఓ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తాను పెంచుకుంటున్న మేకల కోసం ఆ రైతు చేసిన పని ఇప్పుడు అందరి నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఈ రైతు ఆలోచనే వేరబ్బా.. రైతుల మనస్సు అంటే ఇదే కదా అంటూ కామెంట్లు వస్తున్నాయి.. ! 

వివరాల్లోకెళ్తే.. తమిళనాడులోని తంజావూర్‌లోని ఒక గ్రామంలో ఒక రైతు తన మేకల కోసం బియ్యం బస్తాలను ఉపయోగించి తాత్కాలిక రెయిన్‌కోట్‌లను తయారు చేశాడు. వర్షాకాలంలో మేత వేసేటప్పుడు అవి వెచ్చగా.. వానతో ఇబ్బందులు పడకుండా చేశాడు. ఆ రైతు తన మేకల కోసం ఇలా రెయిన్ కోట్ లు తయారు చేయడం ఇప్పుడు ఈ ప్రాంతంలో అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.

 

తన మేకల కోసం బియ్యం బస్తాలను ఉపయోగించి తాత్కాలిక రెయిన్‌కోట్‌లను తయారు చేసిన ఆ రైతు తంజావూరులోని కులమంగళం గ్రామానికి చెందినవారు. తన మేకలు తన పొలంలో మేత మేయడానికి సంచరించే సమయంలో వానలు, చలి కారణంగా ఇబ్బంది పడకుండా ఇలా చేశానని 70 ఏళ్ల గణేశన్ అనే రైతు చెప్పారు. ఆయన తన పొలంలో  మేకలతో పాటు ఆవులు, కోళ్లను కూడా పెంచుకుంటున్నారు. గణేశన్ తన జంతువులతో చాలా అనుబంధం కలిగి ఉన్నారు. 

వర్షాకాలం కారణంగా నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నందున తన మేకలు మేయేటప్పుడు చాలా చల్లగా, వణుకుతున్నాయని గమనించారు. వాటికి కలుగుతున్న ఇబ్బందిని దూరం చేయాలని నిర్ణయించుకున్న గణేశన్ తన మేకలకు బియ్యం బస్తాలను రెయిన్‌కోట్‌లుగా మార్చాడు. తోటి గ్రామస్తులు మొదట్లో ఈ విషయంపై ఆశ్చర్యం వ్యక్తం చేసినప్పటికీ.. మేకల పట్ల గణేశన్ చూపిన శ్రద్ధను వారు అభినందించారు. చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఇప్పుడు ఆ రైతు చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. ఈ అంశం ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios