Asianet News TeluguAsianet News Telugu

డిజిటల్ యాక్సెస్ అందరినీ కలుపుకుపోవాలి - జీ 20 శిఖరాగ్ర సమావేశం లో ప్రధాని మోడీ

డిజిటల్ ఆర్కిటెక్చర్‌ను విస్తృతంగా అందుబాటులోకి తెస్తే, అది సామాజిక, ఆర్థిక పరివర్తనను అందుబాటులోకి తీసుకొస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ విషయాన్ని గత కొన్ని సంవత్సరాల్లో భారత్ నిరూపించిందని చెప్పారు. 

Digital access should be inclusive - PM Modi at 20 summit
Author
First Published Nov 16, 2022, 1:58 PM IST

డిజిటల్ పరివర్తన మానవ జాతిలోని చిన్న భాగానికి మాత్రమే పరిమితం కాకూడదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. డిజిటల్ యాక్సెస్ నిజంగా అందరినీ కలుపుకొని పోయినప్పుడే దాని గొప్ప ప్రయోజనాలు నెరవేరుతాయని తెలిపారు. ఇండోనేషియా రాజధాని బాలిలో జరుగుతున్న జీ-20 శిఖరాగ్ర సమావేశంలో భాగంగా డిజిటల్ పరివర్తన అంశంపై జరిగిన సెషన్‌లో బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని మాట్లాడారు. 

ఈ నెల 18న ‘నో మనీ ఫర్ టెర్రర్’ సదస్సును ప్రారంభించనున్న ప్రధాని మోడీ

డిజిటల్ ఆర్కిటెక్చర్‌ను విస్తృతంగా అందుబాటులోకి తెస్తే, అది సామాజిక, ఆర్థిక పరివర్తనను తీసుకురాగలదని గత కొన్నేళ్లలో భారత్ అనుభవం తెలిపిందని చెప్పారు. వచ్చే ఏడాది భారత్ లో చేపట్టబోయే జీ  20 శిఖరాగ్ర సమావేశంల థీమ్ లో ‘‘డేటా ఫర్ డెవలప్‌మెంట్’’ సూత్రం అంతర్భాగంగా ఉంటుందని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ డిజిటల్ పరివర్తన అనేది మన యుగంలో అత్యంత విశేషమైన మార్పు. డిజిటల్ టెక్నాలజీల సరైన ఉపయోగం పేదరికానికి వ్యతిరేకంగా దశాబ్దాలుగా సాగుతున్న ప్రపంచ పోరాటంలో శక్తి గుణకం అవుతుంది’’ అని మోడీ అన్నారు.

‘‘వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాడటంలో డిజిటల్ టెక్నాలజీ కూడా సహాయపడుతుంది. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో రిమోట్-వర్కింగ్, పేపర్‌లెస్ గ్రీన్ ఆఫీసులు విజయవంతంగా కొనసాగడం మనమందరం గమనించాం ’’ అని ఆయన తెలిపారు. డిజిటల్ సదుపాయం నిజంగా అందరినీ కలుపుకొని, డిజిటల్ టెక్నాలజీ వినియోగం నిజంగా విస్తృతంగా ఉన్నప్పుడే ఈ ప్రయోజనాలు నెరవేరుతాయని ప్రధాని అన్నారు.  దురదృష్టవశాత్తూ ఇప్పటి వరకు మనం ఈ శక్తివంతమైన సాధనాన్ని సాధారణ వ్యాపార ప్రమాణాల నుంచే  చూశామని తెలిపారు.

మీ సిక్ మైండ్ ను మీ దగ్గరే పెట్టుకోండి... ట్రోలర్స్ కు శశిథరూర్ రిటార్ట్.. అసలు విషయం ఏంటంటే...

డిజిటల్ పరివర్తన ప్రయోజనాలు మానవ జాతిలోని ఒక చిన్న భాగానికి మాత్రమే పరిమితం కాకూడదనేది మన  జీ-20 నాయకుల బాధ్యత అని ప్రధాని మోడీ నొక్కి చెప్పారు. డిజిటల్ వినియోగం వల్ల పాలనలో వేగం, పారదర్శకత తీసుకురావచ్చని చెప్పారు. ‘‘భారత్ డిజిటల్ పబ్లిక్ గూడ్స్‌ను అభివృద్ధి చేసింది. దీని ప్రాథమిక నిర్మాణంలో అంతర్నిర్మిత ప్రజాస్వామ్య సూత్రాలు ఉన్నాయి.’’ అని ఆయన చెప్పారు.

ప్రపంచ రియల్ టైమ్ పేమెంట్ లావాదేవీల్లో 40 శాతానికి పైగా గత ఏడాది యూపీఐ ద్వారానే జరిగాయని తెలిపారు. భారత్ డిజిటల్ గుర్తింపు ఆధారంగా 460 మిలియన్ల కొత్త బ్యాంక్ ఖాతాలను తెరించిందని అన్నారు. ఈ రోజు ఆర్థిక చేరికలో భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా మార్చామని చెప్పారు. తమ ఓపెన్-సోర్స్ కోవిన్ ప్లాట్‌ఫారమ్ మానవ చరిత్రలో అతిపెద్ద టీకా ప్రచారాన్ని చేసిందని, మహమ్మారి సమయంలో కూడా విజయవంతమైందని తెలిపారు.

గుజరాత్‌లో మా పార్టీ అభ్యర్థిని బీజేపీ కిడ్నాప్ చేసింది: ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ఆరోపణ..

ప్రపంచంలోని చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ పౌరులకు ఎలాంటి డిజిటల్ గుర్తింపు ఇవ్వలేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కేవలం 50 దేశాలు మాత్రమే డిజిటల్ చెల్లింపు వ్యవస్థలను కలిగి ఉన్నాయని అన్నారు. వచ్చే పదేళ్లలో ప్రతి మనిషి జీవితంలో డిజిటల్ పరివర్తనను తీసుకువస్తామని, దీని వల్ల ప్రపంచంలోని ఏ వ్యక్తి డిజిటల్ టెక్నాలజీ ప్రయోజనాలను కోల్పోకూడదని జీ 20 శిఖరాగ్ర సమావేశంలో నాయకులను ఉద్దేశించి ప్రధాని అన్నారు. ఇదిలా ఉండగా భారత్ ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీ నుంచి ఒక సంవత్సరం పాటు జీ 20 అధ్యక్ష పదవిని చేపట్టనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios