తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఎదురు కాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు హతం
తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఆదివారం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. ఆ ప్రాంతం నుంచి పోలీసులు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని కిస్తారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని తెలంగాణ -ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని పుట్టపాడు అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఆదివారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. సీపీఐ (మావోయిస్ట్) యాక్షన్ టీమ్ పోలీసులపై దాడికి పాల్పడుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసు బృందం కూంబింగ్ నిర్వహించిందని కొత్తగూడెం పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
జమ్మూకాశ్మీర్ లోని పూంచ్ లోయలో పడ్డ బీఎస్ఎఫ్ వాహనం.. ఒకరు మృతి
ఉదయం 6.10 గంటల ప్రాంతంలో నక్సల్స్ ఎత్తైన ప్రదేశం నుంచి పోలీసులపై కాల్పులు జరపగా, పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. కొన్ని నిమిషాల పాటు జరిగిన ఎదురుకాల్పుల తర్వాత పోలీసు బృందం ఆ ప్రాంతాన్ని గాలించింది. దీంతో అక్కడ రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిలో ఒకరిని చెర్ల ఎల్‌ఓఎస్ కమాండర్ 26 ఏళ్ల మడకం ఎర్రయ్య అలియాస్ రాజేష్‌గా గుర్తించగా , మరొకరిని 22 ఏళ్ల నందాల్ అని భావిస్తున్నారు.
3 నెలల్లోగా దర్యాప్తు సంస్థలు, పోలీసు స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయండి: సుప్రీంకోర్టు
ఘటనా స్థలం నుంచి ఒక ఎస్‌ఎల్‌ఆర్, ఒక సింగిల్ బోర్ గన్, పేలుడు పదార్థం తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ప్రకటనలో తెలిపారు. కాగా, పుట్టపాడు ఎన్‌కౌంటర్ బూటకమని మావోయిస్టు బీకే-ఏఎస్‌ఆర్ డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ పని మీద నిరాయుధంగా పుట్టపాడుకు వెళ్లిన రాజేష్‌ను పోలీసులు పట్టుకుని చిత్రహింసలు పెట్టి హత్య చేశారని ఆరోపించారు.
Kerala Boat Tragedy: ఘోర పడవ ప్రమాదం.. హౌస్ బోట్ బోల్తా, 23 మంది జలసమాధి
ఎన్‌కౌంటర్‌ను నిజమని నిరూపించడానికి పోలీసులు మృతదేహాలతో ఆయుధాలను కూడా అక్కడ వదలిపెట్టారని పేర్కొన్నారు. కాగా.. రాజేష్ 19 సంవత్సరాల వయస్సులో మావోయిస్టుల్లో చేరాడు. 2016-22 వరకు చెర్ల ఎల్ఓఎస్ సభ్యుడిగా పనిచేశాడు. అక్టోబర్ 2022 లో చెర్ల ఎల్ఓఎస్ కమాండర్‌గా ప్రమోషన్ పొందినట్టు ఆజాద్ ఆ ప్రకటనలో తెలిపారు.