జమ్మూకాశ్మీర్ లోని పూంచ్ లోయలో పడ్డ బీఎస్ఎఫ్ వాహనం.. ఒకరు మృతి
Poonch: జమ్మూకాశ్మీర్ లోని పూంచ్ లో సరిహద్దు దళానికి చెందిన వాహనం లోయలో పడింది. మెంధార్ లోని బల్నోయ్ ప్రాంతంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) వాహనం కొండ రహదారిపై బ్లైండ్ కర్వ్ ను దాటుతుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఒకరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు.
BSF Vehicle Fell Into Gorge In JammuKashmir: జమ్మూకాశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఓ బీఎస్ఎఫ్ జవాను మృతి చెందాడు. అలాగే, మరో ఆరుగురు గాయపడ్డారు. మెంధార్ లోని బల్నోయ్ ప్రాంతంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) వాహనం కొండ రహదారిపై బ్లైండ్ కర్వ్ ను దాటుతుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం.
వివరాల్లోకెళ్తే.. జమ్మూకాశ్మీర్ లో చోటుచేసుకున్న ఒక రోడ్డు ప్రమాదంలో ఒక బీఎస్ఎఫ్ జవాను మరణించాడు. మరో ఆరు మంది గాయపడ్డారు. పూంచ్ జిల్లా మన్ కోట్ సెక్టార్ లో ఆదివారం బీఎస్ఎఫ్ వాహనం అదుపుతప్పి 250 అడుగుల లోయలో పడిపోవడంతో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్ ) కానిస్టేబుల్ మృతి చెందగా, మరో ఆరుగురు సిబ్బంది గాయపడ్డారని సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి.
సమాచారం అందుకున్న బీఎస్ఎఫ్, స్థానికులు సహాయక చర్యలు చేపట్టి గాయపడిన ఏడుగురు సిబ్బందిని సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే, ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిలో ఒకరు బీఎస్ఎఫ్ 158బీఎన్ కు చెందిన కానిస్టేబుల్ రామ్ చంద్రన్ మృతి చెందారు. ఈ ప్రమాదంలో రామ్ చంద్రన్ తలకు తీవ్ర గాయమైందని ఓ అధికారి తెలిపారు.
గాయపడిన వారిలో కానిస్టేబుళ్లు ఫిరోజ్ అహ్మద్, సంజయ్ సర్కార్, కరంజీత్ సింగ్, అజయ్ సింగ్, దేవేందర్ సింగ్, డ్రైవర్/కానిస్టేబుల్ ఎమ్దాదుల్ హక్ ఉన్నారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.