Asianet News TeluguAsianet News Telugu

ప్ర‌గ‌తిశీల స‌మాజానికి విద్యే పునాది.. దానికే మా అధిక ప్రాధాన్య‌త - పంజాబ్ సీఎం భగవంత్ మాన్

విద్య వల్లే ప్రగతిశీల సమాజం నిర్మించడం సాధ్యం అవుతుందని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు. అందుకే తమ  ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. 

Education is the foundation of a progressive society.. it is our highest priority - Punjab CM Bhagwant Mann
Author
First Published Aug 31, 2022, 2:19 PM IST

తమ ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రగతిశీల సమాజాన్ని నిర్మించడానికి ఇదే పునాది అని సీఎం భగవంత్ మాన్ అన్నారు. స్థానికంగా ఉండే ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలను మంగ‌ళ‌వారం సంద‌ర్శించిన ఆయ‌న విద్యార్థులు, ఉపాధ్యాయులతో సంభాషించారు.

ఒకే బైక్ పై ఏడుగురి ప్రయాణం.. ఆ కుటుంబ సభ్యుల వీడియోపై నెట్టింట్లో రచ్చ.. (వీడియో)

‘‘ తప్పులు వెతకాలనే ఉద్దేశంతో నేను ప‌ర్య‌టించ‌డం లేదు. విద్యా రంగంలో సమగ్ర సంస్కరణలను ప్రవేశపెట్టడానికి అట్టడుగు స్థాయిలో పరిస్థితిని అంచనా వేయడమే  నేను ప‌ర్య‌టిస్తున్నాను. ’’ అని ఆయన పేర్కొన్నారు. నూతన, ప్రగతిశీల సమాజాన్ని నిర్మించడానికి విద్య పునాది అని, అందుకే తమ ప్రభుత్వం దానికే అధిక ప్రాధాన్యత ఇస్తుందని మన్ నొక్కి చెప్పారు.

విద్యారంగంలో బహుముఖ మెరుగుదలలను ప్రవేశపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పనిచేస్తోందని, ముఖ్యంగా సమాజంలోని నిరుపేదలు, అణగారిన వర్గాల విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను ‘‘స్కూల్స్ ఆఫ్ ఎమినెన్స్’’గా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు

ఈ పాఠశాలలు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే అందిస్తాయని భగవంత్ మాన్ అన్నారు. దీంతో పాటు అవి సంపూర్ణ అభివృద్ధికి తోడ్పడుతాయని, జీవతంలో రాణించేలా చూస్తాయని చెప్పారు. విద్యార్థులకు మంచి విద్యా సౌకర్యాలు లభించేలా ఈ పాఠశాలల్లో అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆయన ఉద్ఘాటించారు.

కర్ణాటక హోంమంత్రికి సిగ్గుంటే మురుగ మఠాధిపతిపై చ‌ర్య‌లు తీసుకోవాలి - బీజేపీ ఎమ్మెల్సీ హెచ్. విశ్వ‌నాథ్

ఇది విద్యార్థులు కాన్వెంట్ లో చదువుకున్న వారితో పోటీ పడటానికి వీలు కల్పిస్తుందని సీఎం మాన్ అన్నారు. విద్యార్థులతో సంభాష‌ణ సందర్భంగా, సీఎం వారి పాఠశాలలో పాఠశాలలోని పాఠ్యాంశాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థులను వారి ఆశయాలను అడిగి తెలుసుకున్నారు. వారు అనుకున్న లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు.

లెక్క‌ల మాస్టార్ ను చెట్టుకు క‌ట్టేసి కొట్టిన విద్యార్థులు.. అస‌లేం జ‌రిగిందంటే..?

కృషి, పట్టుదల, అంకితభావం విజయానికి కీలకమని మన్ నొక్కిచెప్పారు, విద్యార్థులందరూ తమకు తాముగా ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకోవడానికి తమ జీవితంలో ఈ బంగారు నియమాలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ఇంటరాక్షన్ అనంతరం పాఠశాలలో అత్యాధునిక సైన్స్ లేబొరేటరీని నిర్మించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios