మనీలాండరింగ్ కేసులో శివసేన సీనియర్ నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మంగళవారం సమన్లు పంపించింది. జూలై 1వ తేదీన ఆఫీసులో హాజరుకావాలని ఆదేశించింది. 

శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ కు ఈడీ స‌మ‌న్లు పంపించింది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి జూలై 1న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. ద‌ర్యాప్తు సంస్థ ఎదుట ప‌త్రాలు స‌మ‌ర్పించేందుకు సంజ‌య్ రౌత్ కు 13-14 రోజుల గ‌డువు కావాల‌ని ఆయ‌న త‌రుఫు న్యాయ‌వాది ఈరోజు కోరారు దీంతో ఈడీ కొంత స‌మ‌యం మంజూరు చేసింది. 

‘అగ్నిపథ్’ కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టాల‌న్న పంజాబ్ ప్ర‌తిప‌క్షాలు.. ఆమోదించిన సీఎం

“ మేము ED ఎదుట నివేదించడానికి కొంత సమయం కోరుతూ ఒక దరఖాస్తును దాఖలు చేసాం. అది మంజూరు అయ్యింది. ఈడీ ముందు పత్రాలను సమర్పించేందుకు 13-14 రోజుల గడువు ఇవ్వాలని డిమాండ్ చేశాం’’ అని రౌత్ న్యాయ‌వాది తెలిపారు. కాగా వాస్త‌వానికి గ‌తంలోనే ముంబైలోని తన ప్రాంతీయ కార్యాలయంలో ఈరోజు (మంగ‌ళ‌వారం) ఉదయం 11 గంటలకు ED త‌న అధికారుల ముందు హాజ‌రుకావాల‌ని సంజ‌య్ రౌత్ కు స‌మ‌న్లు పంపించింది. ముంబైలోని పత్రా చాల్‌ను రీ డెవ‌ల‌ప్ మెంట్ చేయ‌డానికి సంబంధించి ఈ సమన్లు ​​జారీ చేసింది. 

అయితే మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మధ్య, రౌత్ ED ముందు హాజరు కావడానికి నిరాకరించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో సంజయ్ రౌత్ భార్య వర్ష వద్ద ఉన్న దాదర్‌లోని ఫ్లాట్, స్వప్న పాట్కర్‌తో కలిసి అలీబాగ్ సమీపంలోని కిహిమ్‌లో సంయుక్తంగా ఉన్న ఎనిమిది ల్యాండ్స్ తో పాటు రూ.11.15 కోట్ల విలువైన స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. స్వ‌ప్న సంజ‌య్ రౌత్ స‌న్నిహితుడు సుజిత్ పాట్క‌ర్ భార్య‌. 

మహారాష్ట్ర.. త‌ర్వాతి టార్గెట్ జార్ఖండ్‌, రాజ‌స్థాన్‌, బెంగాల్.. బీజేపీ నేత వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

కాగా.. అంత‌కు ముందు సంజయ్ రౌత్ తనకు జారీ చేసిన ED సమన్ల విష‌యంలో బీజేని నిందించాడు. రాజ‌కీయ ప్రత్యర్థులను వారికి వ్యతిరేకంగా పోరాడకుండా నిరోధించడానికి చేస్తున్న కుట్ర‌గా ఈ స‌మ‌న్ల‌ను అభివ‌ర్ణించాడు. తాను అలీబాగ్ లో ఓ స‌మావేశానికి హాజరు కావాల్సి ఉన్నందున మంగళవారం ఈడీ ముందు హాజరు కాలేనని చెప్పారు. శివసేన ప్రధాన అధికార ప్రతినిధిగా ఉన్న సంజ‌య్ రౌత్.. త‌న‌ను చంపినా మహారాష్ట్రలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలు అనుసరించిన గౌహతి మార్గాన్ని ఆశ్రయించబోనని స్ప‌ష్టం చేశారు. ‘‘ ఈడీ నాకు సమన్లు ​​పంపిందని నాకు ఇప్పుడే తెలిసింది. మంచిది! మహారాష్ట్రలో భారీ రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మేము బాలాసాహెబ్ శివ సైనికులం. పెద్ద యుద్ధం చేస్తున్నాం. ఇది నన్ను అడ్డుకునే కుట్ర. మీరు నా తల నరికినా, నేను గౌహతి మార్గంలో వెళ్లను. నన్ను అరెస్ట్ చేయండి! జై హింద్ ’’ అని సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. 

Agnipath: అగ్నిప‌థ్ స్కీమ్‌.. నాలుగు రోజుల్లో ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ కు 94,000 ద‌ర‌ఖాస్తులు

ఇదిలా ఉండగా.. అస్సాంలోని గౌహతిలో క్యాంపు నిర్వహిస్తున్న ఏక్‌నాథ్ షిండ్ క్యాంపులోకి ఎమ్మెల్యేలకు సోమవారం సుప్రీంకోర్టులో ఊరట లభించింది. డిప్యూటీ స్పీకర్ జారీచేసిన అనర్హత నోటీసులను సవాల్‌ చేస్తూ షిండే ఒక పిటిషన్‌ వేయగా.. డిప్యూటీ స్పీకర్‌ను తొలగించాలన్న తీర్మానంపై నిర్ణయం తీసుకునేదాకా తమపై ఆయన ఎలాంటి చర్యలూ తీసుకోకుండా నియంత్రించాలని కోరుతూ మిగతా 15 మంది ఎమ్మెల్యేలూ మరో పిటిషన్‌ సుప్రీంకోర్టులో వేశారు. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ధర్మాసనం.. డిప్యూటీ స్పీకర్‌ వారికి పంపిన అనర్హత నోటీసులపై సమాధానం ఇవ్వడానికి జూలై 12 దాకా సమయమిచ్చింది.