Asianet News TeluguAsianet News Telugu

మహారాష్ట్ర.. త‌ర్వాతి టార్గెట్ జార్ఖండ్‌, రాజ‌స్థాన్‌, బెంగాల్.. బీజేపీ నేత వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

Maharashtra political crisis: శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కదులుతున్న మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే సోమవారం నాడు 9 మంది మంత్రుల శాఖలను తొలగించారు. ఈ క్రమంలోనే బీజేపీ నాయ‌కుడు సువేందు అధికారి చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారాయి. 
 

political crisis:After Maharashtra, it will be Jharkhand, Rajasthan's turn, TMC will also meet same fate, says BJP's Suvendu Adhikari
Author
Hyderabad, First Published Jun 28, 2022, 3:09 PM IST

BJP's Suvendu Adhikari: మ‌హారాష్ట్రంలో రాజ‌కీయ సంక్షోభం ముదురుతోంది. శివ‌సేన రెబ‌ల్ ఎమ్మెల్యేల తిరుబాటు కార‌ణంగా ఆ పార్టీ ఇప్పుడు రెండు చీలిపోయింది. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కదులుతున్న మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే సోమవారం నాడు 9 మంది మంత్రుల శాఖలను తొలగించారు. మహారాష్ట్ర రాజ‌కీయ సంక్షోభానికి ప్ర‌ధాన కార‌ణం బీజేపీనే అని స‌ర్వత్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ అధికారదాహంతో ప్ర‌జ‌లు ఎన్నుకున్న ప్ర‌భుత్వాన్ని కూల‌దోసి ప్ర‌జాస్వామ్యాన్ని ఖూని చేస్తున్న‌ద‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఇదివ‌ర‌కు రాష్ట్రాల్లో బీజేపీ అధికారం కోసం చేసిన చ‌ర్య‌ల‌ను ప్ర‌తిప‌క్షాలు ఎత్తిచూపుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ నాయ‌కుడు సువేందు అధికారి చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారాయి. 

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్నందున, అధికార శివసేనకు చెందిన పలువురు తిరుగుబాటు ఎమ్మెల్యేలు అస్సాంలో క్యాంపులు వేయడంతో, రాష్ట్రంలోని మ‌హా వికాస్ అఘాడీ (ఎంవీఏ)  సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో ఉన్నట్లుగా పేర్కొన్న బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు సువేందు అధికారి.. త్వ‌ర‌లో తృణ‌మూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న బెంగాల్ కూడా ఇదే త‌ర‌హా ప‌రిస్థితిని ఎదుర్కొంటుద‌ని పేర్కొన్నారు. అతి త్వ‌ర‌లోనే టీఎంసీ అధికారం ముగుస్తుంద‌ని తెలిపారు. అంత‌టితో ఆగ‌కుండా  మహారాష్ట్ర తర్వాత బీజేపీయేతర రాష్ట్రాలైన జార్ఖండ్, రాజస్థాన్‌లు వరుసలో ఉన్నాయనీ,  ఆ తర్వాత బెంగాల్ వంతు వస్తుందని కూడా సువేందు అధికారి చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోవడంతో విసుగు చెందిన కాషాయదళం అధికారాన్ని చేజిక్కించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తోందని బీజేపీపై టీఎంసీ విమ‌ర్శ‌లు గుప్పించింది. సువేందు అధికారి చేసిన వ్యాఖ్య‌లు మండిప‌డింది. కూచ్ బెహార్ జిల్లాలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి  సువేందు అధికారి మాట్లాడుతూ.. "మొదట, మహారాష్ట్రలో ఈ పరిస్థితిని పరిష్కరించనివ్వండి. ఆ తర్వాత అది జార్ఖండ్ మరియు రాజస్థాన్‌ల వంతు అవుతుంది. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ వస్తుంది. వారు (TMC) కూడా అదే త‌ర‌హా ప‌రిస్థితిని ఎదుర్కొంటారు. (అంటే ఇతర ప్రతిపక్షాలు పాలిత రాష్ట్రాల మాదిరిగానే).ఈ ప్రభుత్వం 2026 వరకు కొనసాగదు.. 2024 నాటికి ఈ ప్రభుత్వం గద్దె దించబడుతుంది అని పేర్కొన్నారు. 

ఆయ‌న వ్యాఖ్య‌లు టీఎంసీ ఘాటుగానే స్పందించింది.  బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అధికారి సువేందు అధికారి వాస్త‌వ ప‌రిస్థితిలోకి రాలేన‌ట్టున్నారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల ఓటమితో ఇంకా తేరుకోలేని బీజేపీ, అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఎంతటికైనా వెళ్లడానికి సిద్ధంగా ఉందంటూ విమ‌ర్శ‌లు గుప్పించింది. "ఎక్కువగా ఎన్నికల ప్రచారం జరిగినప్పటికీ, ఎన్నికలలో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు, వారు హుక్ లేదా  అక్ర‌మ మార్గంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నారు" అని ఆయన అన్నారు. ఇదే తరహాలో, సీనియర్ టీఎంసీ పార్ల‌మెంట్ స‌భ్యులు, పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి సుఖేందు శేఖర్ రే మాట్లాడుతూ.. బీజేపీ మహారాష్ట్రను సంక్షోభంలోకి నెట్టిందని అధికారి వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయ‌నీ, బీజేపీ నీచ రాజ‌కీయాలు చేస్తోంద‌ని మండిపడ్డారు. "పిల్లి ఇప్పుడు సంచిలో నుండి బయటపడింది. పశ్చిమ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం వెనుక బీజేపీ ఉంద‌నేది ఈ వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయి. దేశంలోని ప్రతి ప్రతిపక్షం పాలిత రాష్ట్రాల‌ను బీజేపీ టార్గెట్ గా చేసుకుంది. బీజేపీకి  ఈ దేశ ప్రజలు తగిన సమాధానం ఇస్తారు"  అని అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios