Asianet News TeluguAsianet News Telugu

జార్ఖండ్ సీఎం స‌న్నిహితుడు ప్రేమ్ ప్రకాష్ ను అరెస్టు చేసిన ఈడీ..

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సన్నిహితుడిగా ఉన్న వ్యాపారి ప్రేమ్ ప్ర‌కాష్ ఇంట్లో నుంచి మంగళవారం రెండు ఏకే- 47లు స్వాధీనం చేసుకున్న ఈడీ బుధవారం రాత్రి అతడిని అరెస్టు చేసింది. మనీలాండరింగ్ కేసులో ఆయన అరెస్టు అయ్యారు. 

ED arrested Jharkhand CM's close friend Prem Prakash
Author
First Published Aug 25, 2022, 10:06 AM IST

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ స‌న్నిహితుడైన‌ ప్రేమ్ ప్ర‌కాష్ ను ఈడీ అరెస్టు చేసింది. బుధ‌వారం ఆయ‌న ఇంట్లో నుంచి రెండు ఏకే-47 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్న త‌రువాత ఈ ప‌రిణామం చోటు చేసుకుంది. అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి సెర్చ్ ఆపరేషన్ల నిర్వ‌హించిన త‌రువాత బుధ‌వారం రాత్రి ఆయ‌న‌ను అదుపులోకి తీసుకుంది. మనీలాండరింగ్ చట్టంలోని నిబంధనల ప్రకారం ఆయ‌న‌ను రాంచీలో అరెస్టు చేశారు. 

ఒకే కుటుంబంలో 11మందిని కాటేసిన పాము.. ఐదుగురు మృతి..!

ప్రేమ్ ప్రకాష్ ఇంటి నుంచి నిన్న రెండు ఏకే-47 రైఫిళ్లు, 60 కాట్రిడ్జ్‌లను ఈడీ స్వాధీనం చేసుకుంది. 100 కోట్ల అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్‌లోని ప్రేమ్ ప్రకాష్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తుండగా ఇనుప అల్మ‌రాలో ఉంచిన రెండు ఏకే-47లు ల‌భించాయ‌ని అధికారులు తెలిపారు. 

ఈ తాజా ప‌రిణామాల‌పై బీజేపీకి చెందిన గొడ్డ ఎంపీ నిషికాంత్ దూబే ట్విట్ట‌ర్ లో స్పందించారు. ‘‘ ప్రేమ్ ప్రకాష్‌ను ఈడీ అరెస్టు చేసింది. ప్రకాష్ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, అతడి కుటుంబ స్నేహితుడు అమిత్ అగర్వాల్‌కు సహచరుడు. అతడి (ప్రకాష్)తో ఉన్న సంబంధాల‌ను ఎన్ఐఏ ద‌ర్యాప్తు చేయాలి’’ అని ఆయన ట్వీట్ చేశారు. అలాగే మాజీ బీజేపీ నాయ‌కుడు, ప్రస్తుత ఇండిపెండెంట్ ఎమ్మెల్యే సరయూ రాయ్ స్పందిస్తూ.. ప్రేమ్ ప్రకాష్‌కు ఏకే -47 రైఫిల్స్ ఎలా వచ్చాయో దర్యాప్తు చేయాలని, ఇందులో ఉగ్రవాద సంబంధాలు లేవని ట్వీట్ చేశారు. 

టిప్పు సుల్తాన్‌ను ‘ముస్లిం గుండా’ అని పిలిస్తే నాలుక కోస్తాం.. బీజేపీ ఎమ్మెల్యేకు బెదిరింపు లేఖ..

అయితే ప్రేమ్ ప్రకాష్ నివాసం నుండి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు (AL-47) పోలీసుల వద్ద ఉన్న భద్రతా సిబ్బందికి చెందినవని అర్గోరా పోలీస్ స్టేషన్ SHO వినోద్ కుమార్ తెలిపారు. ప్రేమ్ ప్రకాష్ ఇంట్లో రైఫిల్స్ ఉంచినందుకు ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసినట్లు రాంచీ పోలీసులు తెలిపారు. అక్రమ మైనింగ్, మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి మే నెలలో ఏజెన్సీ రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రేమ్ ప్రకాష్‌ను విచారించింది.

' ఏ దేవుడూ అగ్ర‌ కులానికి చెందినవారు కాదు’

కాగా.. జార్ఖండ్, బీహార్, తమిళనాడు, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లలో దాదాపు 17 నుంచి 20 ప్రాంగణాలపై ఈడీ బుధవారం దాడులు చేసింది. జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ రాజకీయ సహాయకుడు పంకజ్‌ మిశ్రా, మిశ్రా సన్నిహితుడు బాహుబలి బచ్చు యాదవ్‌లను విచారించిన తర్వాత తాజా సమాచారం అందుకొని ఈ దాడులు చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసులో మిశ్రా, యాదవ్‌లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కొంతకాలం క్రితం అరెస్టు చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios