జమ్మూ కాశ్మీర్ లో మళ్లీ భూకంపం సంభవించింది. ఈ ఏడాదిలో ఇదే రాష్ట్రంలో మొదటి భూకంపం ఈ నెల 8వ తేదీన వచ్చింది. తాజాగా కూడా దోడా ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయి. అయితే దీని వల్ల ఎలాంట ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. 

జమ్మూ కాశ్మీర్‌లోని దోడా ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 3.2గా నమోదు అయ్యింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సీఎస్) తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మూ కాశ్మీర్‌లోని దోడా ప్రాంతంలో మధ్యాహ్నం 12:04 గంటలకు భూప్రకంపనలు వచ్చాయి. భూకంప కేంద్రం భూమికి 10 కిలో మీటర్ల లోతులో ఉందని, రిక్టర్ స్కేల్ పై 3.2 తీవ్రతతో నమోదైందని పేర్కొంది.

గన్ చూపించిన వెనక్కి తగ్గకుండా పోరు.. బ్యాంక్ దొంగలను తరిమికొట్టిన ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్.. వీడియో వైరల్

ఈ మేరకు ఎన్ సీఎస్ ట్వీట్ చేసింది. ‘‘ జనవరి 19, 2023న 3.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అక్షాంశం: 33.21, రేఖాంశం: 75.72, లోతు: 10 కి.మీ. 12:04 గంటలకు. స్థానం: దోడా, జమ్మూ కాశ్మీర్’’ అని పేర్కొంది. ఈ ఘటనలో ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు.

Scroll to load tweet…

కాగా.. అంతకు ముందు కూడా జనవరి 8వ తేదీన జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌లో 3.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. రాత్రి 11.15 గంటలకు భూ ప్రకంపనలు వచ్చాయని ఎన్‌సీఎస్‌ తెలిపింది. భూ ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని పేర్కొంది. 

షెడ్యూల్ కంటే ముందే ఫ్లైట్ టేకాఫ్.. 35 మంది ప్రయాణికులు మిస్.. డీజీసీఏ నోటీసులు

ఇదిలా ఉండగా ఈ ఏడాది మొదటి నుంచే భారత్ లో కూడా వరుస భూకంపాలు వచ్చాయి. జనవరి 1వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. అదే రోజు ఉదయం 10.57 గంటలకు బంగాళాఖాతంలో మరో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. అయితే ఈ రెండు భూకంపాల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.

ఈ ఏడాది జనవరి 5వ తేదీన ఉత్తర భారతదేశంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత 5.5గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని బదఖ్సన్ ప్రాంతంగా ఉంది. దీని వల్ల ఢిల్లీతో పాటు జమ్మూకాశ్మీర్, పంజాబ్, హర్యానాలో ప్రకంపనలు వచ్చాయి. ఇంట్లోని సామాన్లు ఒక్కసారిగా కదలడంతో ప్రజలు ప్రాణభయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు.

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తా పడటంతో ఇద్దరు మృతి.. 30 మందికి గాయాలు

భూమి లోపల ఏడు పలకలు నిరంతరం తిరుగుతూ ఉండటమే ఈ భూకంపాలకు కారణం. ఈ ప్లేట్లు ఎక్కువగా ఢీకొనే ప్రదేశాలను ఫాల్ట్ లైన్స్ అంటారు. ఇవి తరచుగా ఢీకొంటూ ఉంటాయి. దీని వల్ల ప్లేట్లు విరిగిపోతాయి. వాటి విచ్ఛిన్నం కారణంగా లోపల ఉన్న శక్తి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో అది ఓ మార్గాన్ని కనుగొంటుంది. దీనినే భూకంపం అని అంటారు.