Asianet News TeluguAsianet News Telugu

షెడ్యూల్ కంటే ముందే ఫ్లైట్ టేకాఫ్.. 35 మంది ప్రయాణికులు మిస్.. డీజీసీఏ నోటీసులు

పంజాబ్‌లోని అమృత్‌సర్ ఎయిర్ పోర్టు నుంచి సింగపూర్ వెళ్లాల్సిన ఫ్లైట్ షెడ్యూల్ కంటే ముందే బయల్దేరి వెళ్లిపోయింది. రాత్రి 8 గంటలకు వెళ్లాల్సిన విమానం మధ్యాహ్నం 3 గంటలకే వెళ్లిపోయింది. దీంతో సుమారు 30 మంది ప్రయాణికులు ఆ ఫ్లైట్ మిస్సై ఎయిర్‌పోర్టులోనే మిగిలిపోయారు.
 

scoot flight takes off hours before schedule.. left 35 passengers at amritsar airport
Author
First Published Jan 19, 2023, 1:18 PM IST

న్యూఢిల్లీ: పంజాబ్‌లోని అమృత్‌సర్ నుంచి సింగపూర్‌కు వెళ్లే ఫ్లైట్ షెడ్యూల్ కంటే ముందే టేకాఫ్ అయింది. బుధవారం రాత్రి 7.55 గంటలకు బయల్దేరాల్సిన విమానం.. మధ్యాహ్నం 3 గంటలకే వెళ్లిపోయింది. దీంతో 35 మంది ప్రయాణికులు ఆ ఫ్లైట్ మిస్ అయ్యారు. ఎయిర్‌పోర్టులో వారు గందరగోళం సృష్టించారు. సంబంధిత అధికారులకు వారు ఫిర్యాదు చేశారు. ఈ పొరపాటుపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. 

అమృత్‌సర్ ఎయిర్‌పోర్టు నుంచి ఈ విమానం సింగపూర్ వెళ్లాల్సింది. సుమారు 280 మంది స్కూట్ ఎయిర్‌లైన్ విమానం ద్వారా వెళ్లాల్సింది. కానీ, 253 మంది ప్రయాణికులు మాత్రమే వెళ్లిపోయారని అమృత్‌సర్ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ తెలిపారు. సుమారు 30 మంది ప్రయాణికులు ఆ ఫ్లైట్ మిస్ అయ్యారని వివరించచారు. దీనిపై ఎయిర్‌లైన్ అధికారులను ఎయిర్‌పోర్టు అధికారులు ఆరా తీశారు. ఫ్లైట్ టైమ్ రీషెడ్యూల్ అయిందని, ఈ టైమింగ్ మార్పును ప్రయాణికులకు ఈమెయిల్ ద్వారా తెలియజేశామని వివరించారు.

Also Read: బీజేపీ వీఐపీ ఆకతాయిలు : ఇండిగో విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్ ను తెరిచింది తేజస్వి సూర్యనే.. కాంగ్రెస్

సింగపూర్ చౌక ఎయిర్‌లైన్ స్కూట్ ఎయిర్‌లైన్‌కు, అమృత్‌సర్ ఎయిర్‌పోర్టు అథారిటీకి డీజీసీఏ నోటీసులు పంపింది. ఈ ఘటన పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ఓ ఎయిర్‌పోర్టు అధికారి ఏఎన్ఐతో మాట్లాడుతూ, ఆ 30 మంది ప్రయాణికులకు ఓ ట్రావెల్ ఏజెంట్ టికెట్లు బుక్ చేశాడని వివరించారు. కానీ,ఎయిర్‌లైన్ టైమింగ్ మార్పులపై ఆ ప్రయాణికులకు ట్రావెల్ ఏజెంట్ తెలుపలేదుని పేర్కొన్నారు. మారిన టైమ్ ప్రకారం రిపోర్ట్ చేసిన ప్రయాణికులను ఆ ఫ్లైట్ సింగపూర్ తీసుకెళ్లిందని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios