Asianet News TeluguAsianet News Telugu

మిజోరంలో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు.. రూ.12 కోట్ల డ్రగ్స్ స్వాధీనం.. నలుగురి అరెస్ట్

అస్సాంలోని ఐజ్వాల్‌లోని భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడింది. ఈ క్రమంలో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారిపై నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్, 1985లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Drugs worth over Rs 12 crore seized in Mizoram, 4 arrested
Author
First Published Jan 16, 2023, 4:22 AM IST

డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న స్మగ్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. పైగా వారి దందాను యద్దేచ్చగా కొనసాగిస్తున్నారు. యువతను టార్గెట్ చేస్తూ.. కోట్ల విలువైన బిజీనెస్ చేస్తున్నారు. ఇలా పోలీసులకు, కస్టమ్స్ అధికారులకు సవాల్ విసురుతున్నారు. తాజాగా అస్సాంలోని ఐజ్వాల్‌లోని భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడింది.  వివరాల్లోకెళ్తే.. 12 కోట్ల విలువైన హెరాయిన్‌తో పాటు ఇతర మాదక ద్రవ్యాలను మిజోరం పోలీసులు, అస్సాం రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఐజ్వాల్‌లోని రెండు వేర్వేరు ప్రాంతాల నుంచి నలుగురిని అరెస్టు చేశారు. ఈ మేరకు ఆదివారం ఓ అధికారి వెల్లడించారు. 

నిర్దిష్ట ఇన్‌పుట్‌తో  అస్సాం రైఫిల్స్, రాష్ట్ర పోలీసు యొక్క CID స్పెషల్ బ్రాంచ్ బృందం ఆదివారం ఐజ్వాల్‌లోని ఉత్తర భాగంలోని తుంపుయ్ ప్రాంతంలో సంయుక్త ఆపరేషన్ ప్రారంభించినట్లు అధికారి తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరు స్మగ్లర్ల వద్ద నుంచి రూ.9.8 కోట్ల విలువైన ట్రిప్రోలిడిన్ హెచ్‌సీఎల్, సూడోపెడ్రిన్ 98 వేల ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

మరో ఘటనలో రాష్ట్ర పోలీసులు శనివారం ఐజ్వాల్‌లోని బవాంగ్‌కవాన్-సాయిరాంగ్ జంక్షన్ వద్ద ఒక వాహనాన్ని అడ్డగించి సోదాలు నిర్వహించగా.. 501 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు  తెలిపారు. స్వాధీనం చేసుకున్న హెరాయిన్‌ను 40 సబ్బు పెట్టెల్లో దాచి ఉంచారు. దక్షిణ మిజోరంలోని లుంగ్లీ పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులను రూ.2.5 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలతో అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. వీరిలో ఒకరు మహిళ కూడా. అరెస్టు చేసిన నలుగురు నిందితులపై నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్, 1985లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios