Asianet News TeluguAsianet News Telugu

భారత సరిహద్దుల్లో  పాక్ డ్రోన్‌ కూల్చివేత.. భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం

పాకిస్థాన్ భూభాగం నుంచి ఎగిరొచ్చిన ఒక డ్రోన్‌ను భారత భద్రతా బలగాలు కూల్చివేశాయి. ఈ డ్రోన్‌ నుంచి హెరాయిన్, ఓపియం ప్యాకెట్లు,పలు అనుమానాస్పద వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) అధికారులు తెలిపారు. 

Drone Carrying 2 Kg Heroin, Opium Shot Down Near Pak Border In Amritsar KRJ
Author
First Published Apr 27, 2023, 2:00 PM IST

పాకిస్తాన్ కు ఎన్నిసార్లు బుద్ది చెప్పిన తన తీరును మార్చుకోవడం లేదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూనే ఉంది. సరిహద్దు ప్రాంతాలపై ఇష్టానుసారంగా దాడికి యత్నిస్తునే ఉంటుంది.   మారుతున్న టెక్నాలజీని ఆసరా చేసుకుని.. కొత్త కొత్త మార్గాల్లో దాడులకు తెగపడుతోంది. ఇటీవల డ్రోన్లను వాడుతోంది. డ్రోన్లతో దాడికి తెగబడటం, మత్తు పదార్దాలను, పేలుడు పదార్ధాలను సరిహద్దు దాటి పంపిస్తుంది. ఇలాంటి ప్రయత్నాలను భారత్ ఎప్పటికప్పడూ తిప్పికొడుతూనే ఉంది. 

తాజాగా.. సరిహద్దు భద్రతా దళం (BSF) గురువారం తెల్లవారుజామున అమృత్‌సర్ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో డ్రోన్‌ను కూల్చివేసింది. దాని నుంచి దాదాపు 2 కిలోల మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకుంది. ఏప్రిల్ 27న తెల్లవారుజామున 2.20 గంటలకు అమృత్‌సర్ జిల్లాలోని ధనో కలాన్ గ్రామం సమీపంలో పాకిస్థాన్ నుంచి భారత భూభాగంలోకి అనుమానాస్పద డ్రోన్ ప్రవేశించడంతో .. సరిహద్దు వెంబడి మోహరించిన సైనికులు వెంటనే అప్రమత్తమయ్యారు. దానినిపై కాల్పులు జరిపి.. కూల్చిపడేశారు. అనంతరం.. ఆ డ్రోన్ నుంచి 2 కేజీల హెరాయిన్, ఓపియం స్వాధీనం చేసుకున్నట్టు BSF అధికారులు తెలిపారు. 

ధనో కలాన్ శివార్లలోని పొలాల్లో డ్రోన్‌ల శబ్దం,సరుకులను పడవేయడం విన్న జవాన్లు.. ఈ ప్రాంతంలో ప్రాథమిక శోధన సమయంలో.. నలుపు రంగు క్వాడ్‌కాప్టర్, DJI మ్యాట్రిస్ 300 RTK, పాక్షికంగా విరిగిన స్థితిలో లభించాయి. పసుపు టేప్‌తో చుట్టబడిన పెద్ద ప్యాకేజీని స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్యాకెట్‌లో రెండు హెరాయిన్ ప్యాకెట్లు, రెండు చిన్న నల్లమందు ప్యాకెట్లు ఉన్నాయి. సరుకుతో పాటు ఇనుప ఉంగరాన్ని కూడా కట్టి ఉంచారు. హెరాయిన్ మొత్తం బరువు రెండు కేజీలు, నల్లమందు 170 గ్రాములు ఉంటుందని అధికారి తెలిపారు.

అంతకుముందు బుధవారం.. సరిహద్దు భద్రతా దళాలు (BSF) బుధవారం పాకిస్తాన్ వైపు నుండి చొరబడిన డ్రోన్‌పై కాల్పులు జరిపి అడ్డుకున్నాయి. అమృత్‌సర్ సెక్టార్‌లోకి ప్రవేశించిన ఓ డ్రోన్ ను BSF దళాలు అడుకున్నాయి. కాల్పులు జరిపిన తర్వాత..  డ్రోన్ తిరిగి పాక్ వైపుకు తిరిగి వెళ్లిందని BSF తన ప్రకటనలో తెలిపింది. అలాగే.. మార్చి 28న అమృత్‌సర్‌లో పాకిస్థాన్ డ్రోన్‌ను బీఎస్‌ఎఫ్ కూల్చివేసిందని, అది నిషిద్ధ వస్తువులతో భారత భూభాగంలోకి ప్రవేశించిందని పారామిలటరీ దళం తెలిపింది. అమృత్‌సర్‌లో ప్రాంతంలో డ్రోన్ కదలికలు ఎక్కువయ్యాయనీ, ఎప్పడికప్పడు బీఎస్‌ఎఫ్ దళాలు వాటిని కూల్చివేస్తునే ఉన్నాయి. అంతకు ముందు.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) దళాలు ఫిబ్రవరి 2  రాత్రి అమృత్‌సర్ సెక్టార్‌పైకి చొరబడిన పాకిస్తాన్ డ్రోన్‌ను ఇండో-పాక్ సరిహద్దు వెంబడి కూల్చివేశాయి.  

Follow Us:
Download App:
  • android
  • ios