18 ఏళ్లకే పెళ్లి, 20 ఏళ్లకు తల్లి... దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న బిగ్ బాస్ బ్యూటీ!
బిగ్ బాస్ బ్యూటీ ఇండస్ట్రీలో ఒక సంచలనం. 18 ఏళ్లకే పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు అనేక సవాళ్ళను ఎదుర్కొని నటిగా రాణించారు.
సినీ పరిశ్రమలో స్వశక్తితో ఎదిగి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన స్టార్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అలాగే కొందరు నటీనటులు సినిమాల నుంచి టీవీ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయి బుల్లితెర స్టార్స్ గా రాణిస్తున్నారు. తమకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకుంటున్నారు. సినిమా హీరోయిన్స్ కు మించిన పాపులారిటీ దక్కించుకుంటున్నారు. అలాంటి వారిలో మనం మాట్లాడుకోబోయే నటి కూడా ఒకరు. ఆమె దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న టీవీ నటిగా గుర్తింపు పొందారు.
ఆమె ఎవరో కాదు హిందీ సీరియల్ నటి శ్వేతా తివారి. హిందీలో అత్యంత ఆదరణ పొందిన ధారావాహిక ' కసౌటి జిందగీ కె ' లో శ్వేతా తివారి ప్రధాన పాత్రలో నటించింది. ప్రేరణ శర్మ క్యారెక్టర్ లో అద్భుతంగా జీవించింది. ఈ సీరియల్ ఏడేళ్ల పాటు సక్సెస్ ఫుల్ గా రన్ అయింది. దీని ద్వారా ఆమెకు గుర్తింపు లభించింది. ఆ తర్వాత హిందీ బిగ్ బాస్ సీజన్ 4 లో పార్టిసిపేట్ చేసింది. ఆ సీజన్ విన్నర్ గా నిలిచింది. దీంతో ఆమెకు మరింత క్రేజ్ పెరిగింది.
ఆ తర్వాత వరుస ఆఫర్లు దక్కించుకుంటూ సీరియల్స్, షోలు చేస్తూ స్టార్ గా ఎదిగింది. శ్వేతా తివారి పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకు కలిసి రాలేదు. దీంతో స్మాల్ స్క్రీన్ కి పరిమితం అయింది. కెరీర్ విషయంలో వెనుదిరిగి చూసుకోలేదు. కానీ ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. రెండు సార్లు ప్రేమలో మోసపోయింది. శ్వేతా తివారి 1998 లో నటుడు రాజా చౌదరి ని ప్రేమ వివాహం చేసుకుంది.
వారికి పాలక్ తివారి జన్మించింది. అయితే ఏవో విభేదాల కారణంగా 2007 లో శ్వేతా తివారి, రాజు చౌదరి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత అభివన్ కోహ్లీ అనే వ్యక్తితో ఆమె మరోసారి ప్రేమలో పడింది. 2013లో అభివన్ కోహ్లీ ని పెళ్లి చేసుకుంది. వారికి రేయాన్ష్ కోహ్లీ అనే కొడుకు పుట్టాడు. ఆమె భర్త గృహ హింసకు పాల్పడుతున్నాడని 2019 లో కోర్టును ఆశ్రయించింది. అదే సంవత్సరంలో వీరిద్దరూ విడిపోయారు.
ప్రస్తుతం శ్వేతా తివారి కొడుకు, కూతురితో ఒంటరిగా ఉంటున్నారు. అయితే పింక్ విల్లా, మెన్స్ ఎక్స్పీ నివేదిక ప్రకారం ఆమె ఆస్తుల విలువ దాదాపు రూ. 81 కోట్లు అని సమాచారం. అనేక సవాళ్లను అధిగమించి శ్వేతా తివారి పరిశ్రమలో రాణించింది. అనేక మందికి స్ఫూర్తిగా నిలిచింది.