Coronavirus: పాట్నా మెడికల్ కాలేజీలో 159 మంది వైద్యులకు కరోనా
Coronavirus: దేశంలో కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే, వీరిలో ఎక్కువ సంఖ్యలో వైద్యులు, ఇతర సిబ్బంది కూడా ఉండటం కలకలం రేపుతోంది. ఇక బీహార్-పాట్నాలోని నలందా మెడికల్ కళాశాల, ఆస్పత్రిలో (NMCH) పని చేస్తున్న 159 వైద్యులకు కరోనా సోకింది.
Coronavirus: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దీంతో కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాందోళనకు గురిచేస్తున్నది. దేశంలోని చాలా రాష్ట్రాలకు ఒమిక్రాన్ వేరియంట్ విస్తరించింది. ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుదల అధికమవుతోంది. తాజాగా బీహార్ రాష్ట్రంలో చాలా మంది వైద్యులు వైరస్ బారినపడటం కలకలం రేపుతున్నది. వివరాల్లోకెళ్తే.. పాట్నాలోని నలందా మెడికల్ కళాశాల, ఆస్పత్రిలో (NMCH) పని చేస్తున్న 159 మంది వైద్యులకు కరోనా రెండు రోజుల వ్యవధిలోనే ఈ స్థాయిలో కేసులు నమోదుకావడం కలకలం రేపుతోంది. కరోనా సోకిన వైద్యులకు లక్షణాలు తక్కువగా ఉన్నాయని, వారంతా ఆస్పత్రిలో క్యాంపస్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు పాట్నా డిస్టిక్ మెడికల్ ఆఫీసర్ చంద్రశేఖర్ సింగ్ తెలిపారు. ఇటీవల కాలంలో పాట్నాలో జరిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యక్రమంలో అనేక మంది వైద్యులు పాల్గొన్నారు. ఇందులో నలందా మెడికల్ కాలేజీ వైద్యులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్యులు, విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వీరందరూ కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read: coronavirus: అమెరికాలో కరోనా విలయతాండవం.. ఒక్కరోజే 10 లక్షల కేసులు !
బీహార్‌లోని పాట్నాలోని నలంద మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (ఎన్‌ఎంసిహెచ్) లో ఆదివారం నాడు 87 మంది వైద్యులకు కరనా వైరస్ సోకినట్టు నిర్థారణ అయింది. తాజాగా మరో 72 మంది వైద్యులకు కరోనా సోకినట్టు రిపోర్టుల్లో వెల్లడైంది. దీంతో మొత్తం కరోనా సోకిన వైద్యుల సంఖ్య 159 కి పెరిగిందని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వినోద్ కుమార్ సింగ్ తెలిపారు. NMCH మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బినోద్ కుమార్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, "పాట్నాలోని నలంద మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (NMCH)కి చెందిన మరో 72 మంది వైద్యులు COVID-19 బారిపడ్డారు" అని తెలిపారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం బీహార్ లో 1,386 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 7,27,873 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అలాగే, 12,096 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు.
Also Read: Bulli Bai: బుల్లిబాయ్ యాప్ కేసు.. ఒకరి అరెస్టు.. సమాచారం లేదన్న బెంగళూరు పోలీసులు !
ఇదిలావుండగా, ఇతర రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. భారత్ లో ఒక్కరోజే 37 వేలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదుకావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మంగళవారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన కరోనా వైరస్ వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 37,379 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా వైరస్ కేసులు 3,49,60,261 కు చేరాయి. క్రియాశీల కేసులు సైతం క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం 1,71,830 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా 11 వేల మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోవిడ్-19 రికవరీల సంఖ్య 3,43,06,414కు పెరిగింది. దాదాపు 117 రోజుల తర్వాత అత్యధికంగా ఒకరోజు కోవిడ్ కేసులు ఇవేనని గణాకాంలు పేర్కొంటున్నాయి. అలాగే, గత 24 గంటల్లో కరోనా మహమ్మారితో పోరాడుతూ 124 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్త కరోనా మరణాల సంఖ్య 4,82,071 చేరింది.
Also Read: Bulli Bai: బుల్లిబాయ్ యాప్ కేసు.. ఒకరి అరెస్టు.. సమాచారం లేదన్న బెంగళూరు పోలీసులు !