దిశ ఎన్ కౌంటర్ నిందితుల ఎన్ కౌంటర్ పై బహుత్ డేర్ అయా..దురస్త్ అయే..డేర్ అయే..బహుత్ డేర్ అంటూ పోలీసులపై ప్రశంసలు గురిపించారు. తెలంగాణ పోలీసులు ఒక సాహసం చేశారంటూ జయాబచ్చన్ ప్రశంసించారు. 

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ వైద్యురాలు దిశ హత్యకేసు నిందితుల ఎన్ కౌంటర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సతీమణి ఎంపీ జయాబచ్చన్. 

దిశ ఎన్ కౌంటర్ నిందితుల ఎన్ కౌంటర్ పై బహుత్ డేర్ అయా..దురస్త్ అయే..డేర్ అయే..బహుత్ డేర్ అంటూ పోలీసులపై ప్రశంసలు గురిపించారు. తెలంగాణ పోలీసులు ఒక సాహసం చేశారంటూ జయాబచ్చన్ ప్రశంసించారు. 

నలుగురు కామాంధులకు పోలీసులు సరైన శిక్ష వేశారని చెప్పుకొచ్చారు. పోలీసులు తీసుకున్న నిర్ణయం చాలా ధైర్యవంతమైనదని జయాబచ్చన్ స్పష్టం చేశారు. రాజ్యసభకు వెళ్తున్న ఆమెను ఎన్ కౌంటర్ పై మీడియా ప్రశ్నించగా ఆలస్యంగా వచ్చారంటూ చెప్పుకొచ్చారు. 

ఆ నలుగురిని లాక్కొచ్చి ప్రజలకు అప్పగిస్తే తెలుస్తుంది: దిశ ఘటనపై జయాబచ్చన్...

ఇకపోతే దిశ రేప్, హత్యపై కీలక వ్యాఖ్యలు చేశారు జయాబచ్చన్. రాజ్యసభలో దిశపై జరిగిన రేప్, హత్య ఘోరాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశపై దారుణానికి ఒడిగట్టిన నిందితులను జైల్లో పెట్టొద్దని బయటకు లాక్కొచ్చి పబ్లిక్ కు అప్పగిస్తే తెలుస్తోందన్నారు.

మహిళలపై దాడులకు సంబంధించి ఇతర దేశాల్లో దారుణమైన శిక్షలు ఉంటాయన్నారు. మహిళలపై దాడులకు పాల్పడేవారిని బహిరంగంగా శిక్షిస్తారంటూ చెప్పుకొచ్చారు. అలాంటి శిక్షలనే దేశంలో కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. 

దేశంలో ఎన్ని చట్టాలను అమలు చేస్తున్నా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన, కథువా ఘటనలు చూస్తుంటే చాలా బాధేస్తుందన్నారు. 

దిశ నిందితుల ఎన్ కౌంటర్: ఖండించిన కార్తీ, ఆ సినిమా చూడాలంటూ సెటైర్లు

మహిళలపై దాడికి పాల్పడిన వారిని తక్షణమే శిక్షించేలా చర్యలు తీసుకోవాలని అందుకు కఠిన చట్టాలను రూపొందించాలని ఆమె రాజ్యసభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తోందని నిలదీశారు జయాబచ్చన్. 

ఇకపోతే తెలంగాణ వైద్యురాలు దిశను గతనెల 27న రాత్రి రేప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు నలుగురు నిందితులు. కేసు నమోదు చేసిన షాద్ నగర్ పోలీసులు ఘటనపై విచారణ చేపట్టి 24 గంటల్లోనే దారుణానికి ఒడిగట్టిన నలుగురు నిందితులు ముహ్మద్ ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులను అరెస్ట్ చేశారు. 

ఈ కేసులో చర్లపల్లిలో జైల్లో ఉన్న నిందితులను గురువారం రాత్రి పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కేసు రీ కనస్ట్రక్షన్ లో భాగంగా ఎక్కడైతే దిశను అత్యంత దారుణంగా పెట్రోల్ పోసి తగులబెట్టారో ఆ ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు. 

పోలీసులు కేసు విచారణకు సంబంధించి ఆధారాలు సేకరిస్తుండగా పోలీసులపై రాళ్లు రువ్వి తప్పించుకునే ప్రయత్నం చేశారు నిందితులు. దాంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో నలుగురు నిందితులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. 

తెలంగాణ వైద్యురాలు దిశ రేప్, హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ అనంతరం ఘటనా స్థలంలోనే శవ పంచనామా నిర్వహించారు వైద్యులు. శాంతి భద్రతల దృష్ట్యా దిశ నిందితుల మృతదేహాలకు ఎన్‌కౌంటర్‌ చేసిన ప్రదేశంలోనే గాంధీ ఆస్పత్రికి చెందిన ఫోరెన్సిక్ నిపుణులు పంచనామా నిర్వహించారు. 

శవ పంచనామా అనంతరం నాలుగు మృతదేహాలను ఫరుక్‌ నగర్‌, పొందుర్గు, నందిగామ, చౌదరిగూడ తహాశీల్ధార్ లకు అప్పగించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.

దిశకు న్యాయం, పోలీసులను ఏమనకండి... ఢిల్లీ నిర్భయ తల్లి

ఇకపోతే నిందితుల స్వగ్రామం అయిన నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం గుడిగండ్ల గ్రామంలో వనపర్తి ఎస్పీ అపూర్వారావు పర్యటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.