దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసులో నిందితులకు తగిన శిక్ష పడింది. నిందులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. సీన్ రీ కన్ స్ట్రక్షన్ కోసం తీసుకొని వెళితే... అక్కడ పోలీసులపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో... పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో.. నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 

AlsoRead Disha murder case: ఎన్ కౌంటర్ తో కథ ముగియలేదు.. అసలు కథ ఇప్పుడే......

ఎన్ కౌంటర్ వార్త వినగానే ప్రజలు సంబరాలు  చేసుకుంటున్నారు. పోలీసులపై పొగడ్తల వర్షం కురిపిస్తూ  హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైనా దిశ ఆత్మకు శాంతి కలిగిందంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఈ ఘటనపై నిర్భయ తల్లి స్పందించారు.

తమ కుమార్తె చనిపోయి ఏడు సంవత్సరాల అవుతున్నా తమకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కానీ... దిశ తల్లిదండ్రులకు కేవలం 7 రోజుల్లోనే న్యాయం లభించిందని.. అందుకు తనకు చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు. తెలంగాణ పోలీసులు మంచి పని చేశారని ఆమె ప్రశంసలు కురిపించారు. నిర్భయ ఘటనలో నిందితులకు కూడా త్వరగా శిక్ష విధించాలని ఈ సందర్భంగా చెప్పారు. తెలంగాణ పోలీసులు చేసిన పనిని సమర్థించిన ఆమె... వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఈ సందర్భంగా కోరారు.

AlsoRead ''రాజకీయ నాయకుల కొడుకులైతే ఇలానే చేస్తారా..?'' పూరి ట్వీట్ పై కామెంట్స్!...

2012 డిసెంబర్ లో దేశ రాజధానిలో ఓ యువతి కూడా ఇలాంటి ఘటనే ఎదురైంది. నిర్భయను సామూహిక అత్యాచారం చేసి... అత్యంత కిరాతకంగా హింసించారు.కనీసం ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా చేసి వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. దాదాపు 13 రోజుల పాటు ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. కాగా... నిందితులు మాత్రం ఇప్పటికీ జైల్లోనే జీవించే ఉన్నారు.