రాజస్థాన్ అధికార పార్టీ అయిన కాంగ్రెస్ లో మరి సారి అంతర్గత పోరు వెలుగులోకి వచ్చింది. సొంత పార్టీకి చెందిన మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అవినీతిపై చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం నిరాహార దీక్షకు దిగుతున్నట్టు ఆయన తెలిపారు.

రాజస్థాన్ కాంగ్రెస్ లో మరో సారి విభేదాలు తలెత్తాయి. తమ ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం లేదంటూ ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ఆరోపించడంతో ఇవి బయటకు వచ్చాయి. రాష్ట్రంలో అవినీతికి వ్యతిరేకంగా ఆయన సొంత ప్రభుత్వంపైనే మంంగళవారం ఒక్క రోజు నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. 

దయచేసి బందీపూర్‌ టైగర్ రిజర్వ్ ను అదానీకి అమ్మొద్దు - ప్రధాని మోడీకి కర్ణాటక కాంగ్రెస్ విజ్ఞప్తి

గతంలో ఉన్న వసుంధర రాజే ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని తాను గెహ్లాట్ కు విజ్ఞప్తి చేశానని, కానీ ఎలాంటి సమాధానం రాలేదని సచిన్ పైలట్ ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. రాజే అవినీతి, దుష్పరిపాలన చేస్తున్నారని ఆరోపిస్తూ గెహ్లాట్ పాత వీడియోలను ప్లే చేసిన పైలట్.. ఈ విషయాలపై ఎందుకు దర్యాప్తు లేదా విచారణ ప్రారంభించలేదని ప్రశ్నించారు. గత బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద ఆధారాలు ఉన్నాయని, కానీ దానిపై చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు.

ఈ మామిడి చాలా కాస్లీ గురూ.. డజనకు 1300 వరకు ధర.. దేశంలోనే మొదటి సారిగా ఈఎంఐతో ఆఫర్.. ఎక్కడంటే ?

ఈ విషయంలో సీఎం అశోక్ గెహ్లాట్ కు లేఖ రాశానని పైలెట్ చెప్పారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయని, తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, చేసిన పనులను ప్రజలకు చూపించాలని అందులో పేర్కొన్నానని, కానీ దీనిపై సీఎం నుంచి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదని అన్నారు. రాజస్థాన్ లో దర్యాప్తు సంస్థలను సరిగ్గా వినియోగించడం లేదని అన్నారు. ‘‘ ఓ వైపు కాంగ్రెస్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తుంటే, రాజస్థాన్ లో మాత్రం వాటిని ఉపయోగించుకోవడం లేదు. ఇదొక ముఖ్యమైన అంశం.. ఎందుకంటే మేము ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్రజలు అనుకోకూడదు’’ అని ఆయన అన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో మత ఘర్షణ.. హింసాకాండలో యువకుడు మృతి, ముగ్గురు పోలీసులకు గాయాలు

రాష్ట్రంలో అవినీతిపై చర్యలు తీసుకోవాలని, తాము ఏ పనీ చేయడం లేదని, ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ప్రజలు భావించకూడదనే తన మాటలకు గుర్తుగా ఈ నెల 11న ఒక రోజు నిరాహార దీక్ష చేస్తానన్నారు. రాజస్థాన్ వ్యవహారాలకు సంబంధించి పార్టీ నాయకత్వానికి తాను పలు సూచనలు చేశానని, వాటిలో అవినీతి అంశం ఒకటని చెప్పారు. ‘‘ఇది మా ప్రభుత్వం. మేమే చర్యలు తీసుకోవాలి. అందుకే ప్రజలు మాపై నమ్మకం ఉంచారు’’ అని తెలిపారు.

Punjab Politics: 'మాఫియాకు గాడ్ ఫాదర్' : ఆప్ సర్కార్ పై నవజ్యోత్ సింగ్ సిద్ధూ వివాదాస్పద వ్యాఖ్యలు

కాంగ్రెస్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్రం ఈడీ, సీబీఐలను దుర్వినియోగం చేస్తుంటే, రాజస్థాన్ ప్రభుత్వం తన ఏజెన్సీలను కూడా ఉపయోగించుకోవడం లేదని సచిన్ పైలట్ అన్నారు. అవినీతి విషయం ప్రజల్లోకి రావాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. తమ కత్తికీ, కర్ణికీ తేడా ఉందని ప్రజలు, కాంగ్రెస్ నేతలు అనుకోవద్దని సచిన్ పైలట్ అన్నారు. కాగా.. రాజస్థాన్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఈ తరుణంలో సచిన్ పైలట్ తాజా మీడియా సమావేశం కాంగ్రెస్ కు పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది.