ఛత్తీస్‌గఢ్‌లో మత ఘర్షణ చోటు చేసుకుంది. బెమెతర జిల్లాలోని ఓ గ్రామంలో శనివారం రాత్రి జరిగిన హింసాకాండలో ఓ యువకుడు మరణించాడు. ఉద్రిక్తతను చల్లార్చేందుకు పోలీసులు 144 సెక్షన్ విధించారు. బల ప్రయోగం కూడా చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో వారికి కూడా గాయాలు అయ్యాయి. 

ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతర జిల్లాలో శనివారం ఇద్దరు యువకుల మధ్య జరిగిన గొడవ రెండు వర్గాల మధ్య ఘర్షణగా మారింది. ఈ ఘటనలో ఓ యువకుడు మరణించాడు. ముగ్గురు పోలీసు సిబ్బందికి గాయాలు అయ్యాయని ‘ది హిందూ’ నివేదించింది. ఈ హింసాకాండ తరువాత రాజధాని రాయ్‌పూర్‌కు దాదాపు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న 600 జనాభా కలిగిన బీరాన్‌పూర్ మతపరమైన ఉద్రిక్తతతో అట్టుడికింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు బలప్రయోగం చేయాల్సి వచ్చింది. నిషేధాజ్ఞలు జారీ చేశారు. అలాగే భారీగా పోలీసులను మోమరించారు. ఈ హింసాకాండకు పాల్పడిన 11 మందిని అరెస్టు చేశారు.

రాహుల్ గాంధీకి శిక్ష విధించిన జడ్జి నాలుక కోస్తానని బెదిరించిన కాంగ్రెస్ నేత.. కేసు నమోదు చేసిన పోలీసులు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీరాన్‌పూర్ గ్రామంలో ఉదయం 11 గంటలకు 14 ఏళ్ల బాలుడిపై మరో వర్గానికి చెందిన యువకుడు పదునైన వస్తువుతో దాడి చేశాడు. ఈ గొడవలో పెద్దలు జోక్యం చేసుకున్నారు. దీంతో రెండు వర్గాలకు చెందిన ప్రజలు ఒక దగ్గర గుమిగూడారు. కొంత సమయం తరువాత వారి మధ్య కూడా ఘర్షణ జరిగింది. ఇరువైపుల నుంచి ప్రజలు ముందుకు వచ్చి ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు.

ప్రాజెక్టు టైగర్ కు నేటితో 50 ఏళ్లు.. కొత్త లుక్ లో ప్రధాని.. పులుల డేటా విడుదల చేయనున్న మోడీ..

ఈ అల్లర్లపై పోలీసులకు సమాచారం అందింది. ఈ ఉద్రిక్తతను చల్లబర్చిచేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒక సబ్-ఇన్‌స్పెక్టర్‌తో పాటు మరో ఇద్దరి పోలీసులకు గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో ఓ యువకుడు తీవ్ర గాయాలపాలై మరో వర్గం గ్రూపులో అపస్మారస్థితిలో పడిపోయాడు. దీంతో అతడిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతడు మరణించాడని డాక్టర్లు ప్రకటించారు. 

సైబర్ కేటుగాళ్లకు రూ. 1.5 లక్షలు మోసం పోయిందని భార్యకు త్రిపుల్ తలాఖ్ చెప్పి విడాకులు

మృతుడిని భునేశ్వర్ సాహు (23)గా గుర్తించారు. మృతదేహాన్ని హాస్పిటల్ కు తీసుకెళ్లిన రెండు గంటల తరువాత కూడా హింస కొనసాగింది. దీంతో పోలీసులు బలప్రయోగం చేయాల్సి వచ్చింది. దీంతో పాటు అక్కడ సీఆర్ పీసీ సెక్షన్ 144 విధించారు. ఈ ఘటనపై సాజా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఓ వర్గానికి చెందిన 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో వర్గంపై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. కాగా.. గత రెండేళ్లుగా ఈ గ్రామంలో మతపరమైన ఉద్రిక్తతలు జరుగుతున్నాయి.