బందీపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ను వ్యాపారవేత్త అదానీకి అమ్మొద్దని కర్ణాటక కాంగ్రెస్ కమిటీ ప్రధాని నరేంద్ర మోడీని కోరింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్లే నేడు పులుల సంఖ్య పెరిగిందని పేర్కొంది. 

కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఆదివారం సందర్శించేందుకు వచ్చిన ప్రధాని మోడీపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ విభాగం మండిపడింది. ప్రధానిపై విమర్శలు చేసింది. బందీపూర్ లో పులుల సంరక్షణ ప్రాజెక్టును అమలు చేసింది కాంగ్రెస్ పార్టీయే అని గుర్తు చేసింది. దయచేసి ఈ జాతీయ ఆస్తిని వ్యాపారవేత్త అదానీకి అమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. 

ఈ మామిడి చాలా కాస్లీ గురూ.. డజనకు 1300 వరకు ధర.. దేశంలోనే మొదటి సారిగా ఈఎంఐతో ఆఫర్.. ఎక్కడంటే ?

ఈ మేరకు కర్ణాటక కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ఓ పోస్ట్ చేసింది. ‘‘ప్రియమైన నరేంద్ర మోడీ.. 1973 లో బండిపూర్ పులుల సంరక్షణ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది. అక్కడ మీరు ఈ రోజు సఫారీని ఆస్వాదిస్తున్నారు. తమ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే ప్రస్తుతం పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మీకు ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి బండిపూర్ ను అదానీకి అమ్మొద్దు.’’ అని ట్వీట్ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.

Scroll to load tweet…

చామరాజనగర్ లో మహమ్మారి సమయంలో మరణించిన కుటుంబాలను పరామర్శించడానికి ప్రధాని మోడీ ఎందుకు భయపడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. కోవిడ్ సమయంలో కర్ణాటకకు బీజేపీ చేసిన మోసం వల్ల, ఆక్సిజన్ అందక 36 మంది మరణించారని ఆరోపించింది. ప్రధాని చామరాజనగర్ కు వచ్చినప్పటికీ మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు ఎందుకు ఇష్టపడటం లేదని ప్రశ్నించింది. వారి నుంచి వచ్చే ఎదురుదాడిని ఎదుర్కొనేందుకు భయపడుతున్నారా అని తెలిపింది.

Scroll to load tweet…

కాగా.. ప్రధాని సందర్శించిన టైగర్ రిజర్వ్ పాక్షికంగా చామరాజనగర్ జిల్లాలోని గుండ్లుపేట తాలూకాలో, కొంత భాగం మైసూరు జిల్లాలోని హెచ్.డి.కోటే, నంజన్ గూడు తాలూకాలలో ఉంది. వన్యప్రాణుల అభయారణ్యంలో ప్రధాని మోడీ రెండు గంటలు గడిపారు. ఏనుగులకు ఆహారం కూడా ఇచ్చారు. రూ.50 స్మారక నాణెంతో పాటు పులుల సంరక్షణకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేశారు.