అల్ఫోన్సో రకం మామిడి పండ్లను పూణెకు చెందిన ఓ వ్యాపారి ఈఎంఐ ఆఫర్ తో అందిస్తున్నారు. ఈ పండ్ల ధర మిగితా రకాలతో పోలిస్తే అధికంగా ఉంటుంది. ఈఎంఐతో మామిడి పండ్లను అందించడం దేశంలో ఇదే తొలిసారి. 

సాధారణంగా మామిడి పండ్ల ధర ఎంత ఉంటుంది. సీజన్ లో అయితే కిలో రూ.100 లోపే ఉంటుంది. ఇప్పుడు సీజన్ ప్రారంభం కాబట్టి రూ.150 నుంచి 200 మధ్య దొరుకుతోంది. అన్ సీజన్ లో మాత్రం ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. కానీ ఓ చోటు మాత్రం డజనకు 800-1300 ధర ఉందంటే నమ్ముతారా.. ? అవును నిజమే.. కానీ అవి రెగ్యులర్ గా మనకు మార్కెట్ లో కనిపించే మామిడి పండ్లు కావు. చాలా ప్రత్యేకతలున్న అల్ఫోన్సో మామిడి పండ్లు. అయితే వీటిని మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేయలేరు కాబట్టి.. ఓ వ్యాపారి ఈఎంఐ ద్వారా కూడా అందిస్తున్నారు. ఇది కూడా నమశక్యంగా లేదు కదూ.. దేశంలోనే ఓ వ్యాపారి ఇలా మొదటిసారిగా కొత్త ప్రయోగం చేశారు. ఇంతకీ ఎక్కడ ఇలా అమ్ముతున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

ఛత్తీస్‌గఢ్‌లో మత ఘర్షణ.. హింసాకాండలో యువకుడు మృతి, ముగ్గురు పోలీసులకు గాయాలు

మామిడి పండ్ల సీజన్ ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. మార్కెట్ లోకి ఈ పండ్ల పెద్దగా రావడం లేదు కాబట్టి ధర కాస్తా ఎక్కువగా ఉంది. అయితే అల్ఫోన్సో మామిడి ధర ఇంకా ఎక్కువగా ఉంది. దీంతో ప్రజలు ఒకే సారి ఇంత పెద్ద మొత్తంలో చెల్లించలేరనే ఉద్దేశంతో మహారాష్ట్రలోని పూణెకు చెందిన ఓ వ్యాపారి ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్స్ (ఈఎంఐ)లో వీటిని అందిస్తున్నారు.

Scroll to load tweet…

ఈ ప్రత్యేక పథకాన్ని ప్రారంభించిన పుణెకు చెందిన వ్యాపారి గౌరవ్ సనాస్ వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో మాట్లాడారు. ‘‘అధిక ధర ఉన్న అల్ఫోన్సోపై కోవిడ్ తరువాత ప్రజలు ఆసక్తి కోల్పోయారు. అందుకే కస్టమర్లను వెనక్కి రప్పించేందుకు ఈఎంఐపై మామిడి పండ్లు ఇచ్చే పథకాన్ని ప్రారంభించాం.’’ అని తెలిపారు.

ప్రాజెక్టు టైగర్ కు నేటితో 50 ఏళ్లు.. కొత్త లుక్ లో ప్రధాని.. పులుల డేటా విడుదల చేయనున్న మోడీ..

దేశంలోనే ఈఎంఐపై మామిడి పండ్లను తొలి సారిగా తామే అమ్ముతున్నామని అన్నారు. సీజన్ ప్రారంభంలో ధరలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అందరూ మామిడి పండ్లను ఆస్వాదించేందుకు ఈ పథకాన్ని అమలు చేసినట్లు తెలిపారు. ‘‘రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, ఇతర వస్తువులను ఈఎంఐపై కొనుగోలు చేస్తున్నారు. అయితే మామిడి పండ్లను ఎందుకు కొనుగోలు చేయకూడదనే ప్రశ్న వచ్చింది. అందుకే ఈ విధానం తీసుకొచ్చాం. ఇప్పుడు ప్రతీ ఒక్కరూ మామిడి పండ్లను ఈఎంఐ ద్వారా కొనుగోలు చేయొచ్చు’’ అని అన్నారు. 

అల్ఫోన్సో మామిడి పండ్లను తన అవుట్ లెట్ నుంచి ఈఎంఐపై కొనుగోలు చేయాలనుకునే వారు క్రెడిట్ కార్డును ఉపయోగించాల్సి ఉంటుందని, కొనుగోలు మొత్తాన్ని మూడు, ఆరు లేదా 12 నెలల ఈఎంఐలుగా మారుస్తామని ఆయన తెలిపారు. కనీసం రూ.5,000 కొనుగోలు చేసే వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని సనాస్ తెలిపారు. ఇప్పటికే కొందరు ఈ పథకాన్ని వినియోగించుకున్నారని తెలిపారు.

రాహుల్ గాంధీకి శిక్ష విధించిన జడ్జి నాలుక కోస్తానని బెదిరించిన కాంగ్రెస్ నేత.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఏమిటీ ఈ మామిడి ప్రత్యేకత..
అల్ఫోన్సో మామిడి పండ్లను హాపస్ అని కూడా పిలుస్తారు. వీటి రుచి, వాసన ప్రత్యేకంగా ఉంటుంది. ఈ పండ్ల ఉత్తమ నాణ్యత ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దాని అద్భుతమైన రుచి, అధిక డిమాండ్ కారణంగా అల్ఫోన్సో మిగితా మామిడి కంటే అధిక ధర ఉంటుంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో వీటి ధర డజనుకు రూ.800 నుంచి రూ.1300 వరకు విక్రయిస్తున్నారు.