ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మరణించారు. ఓ చిన్నారి తీవ్రగాయాలతో ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై సీఎం భూపేశ్ బఘేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

ఛత్తీస్ గఢ్ లోని ధమ్ తారీ జిల్లాలో బుధవారం సాయంత్రం బొలెరో కారు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ రోడ్డు ప్రమాదంలో చిన్నారితో పాటు పలువురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు. జగత్రా సమీపంలోని కాంకేర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

వ్యాప్కోస్ మాజీ చీఫ్ రాజిందర్ గుప్తా, కుమారుడు గౌరవ్ ను అరెస్టు చేసిన సీబీఐ.. ఎందుకంటే ?

సోరం నుంచి మర్కటోలా వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ‘‘బలోద్ జిల్లాలోని జగత్రా సమీపంలో ట్రక్కు, కారు ఢీకొనడంతో 10 మంది మృతి చెందారు. ఓ చిన్నారి తీవ్రంగా గాయపడింది. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం రాయ్ పూర్ కు తరలించాం. ట్రక్కు డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాం’’ అని బలోద్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు.

Scroll to load tweet…

ఈ దుర్ఘటనపై ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన బాలిక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే పురూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ చేసి, విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Scroll to load tweet…

బీహార్‌లోనూ బుధవారం సాయంత్రం ఇలాంటి ప్రమాదమే జరిగింది. సీతామర్హిలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో 7 మంది మరణించారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఉన్నారు. ఓ వివాహ వేడుకకు హాజరై ఆటోలో కుటుంబ సభ్యులు, బంధువుల కలిసి వస్తున్నారు. అయితే మగోల్వా ప్రాంతానికి చేరుకునే సరికి వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. మృతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, క్షతగాత్రులను సీతామర్హిలోని జిల్లా హాస్పిటల్ కు తీసుకెళ్లామని ఎస్డీవో ప్రశాంత్ కుమార్ చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి తరలించామని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

క్రికెటర్ మహ్మద్ షమీకి వేశ్యలతో వివాహేతర సంబంధాలు - భార్య హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు

కాగా.. ప్ర‌మాదం త‌ర్వాత ట్ర‌క్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.సీతామర్హి-పుప్రి రహదారిలోని పాఖీ చౌక్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదం స్థానికుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. గ్రామ‌స్తులు ట్ర‌క్కును త‌గుల‌బెట్టారు. దీంతో పోలీసులు అప్రమత్తమై, ఆందోళన కారులను శాంతింపజేశారు.