షాక్: గౌరీ లంకేష్ తరహలోనే మరికొందరి హత్యలకు ప్లాన్

Diary Recovered From Gauri Lankesh Murder Suspects Reveals Several Other Targets
Highlights

మరికొందరి హత్యలకు ప్లాన్


బెంగుళూరు:  జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసులో  అరెస్టైన నిందితుడి నుండి స్వాధీనం చేసుకొన్న  డైరీలో  కీలక విషయాలను పోలీసులు సేకరించారు. గౌరీ లంకేష్ తో పాటు మరికొందరిని హత్య చేయాలని నిందితుడు ప్లాన్ చేసినట్టుగా  డైరీలో కొన్ని పేర్లు రాసుకొన్నారని పోలీసులు  చెబుతున్నారు.

నిందితుడి వద్ద దొరికిన డైరీలో గిరీష్‌కర్నాడ్‌తో పాటు మరికొందరి పేర్లు హిట్‌లిస్ట్‌లో ఉండడం పోలీసులను షాక్‌కు గురిచేస్తోంది. ఒక వర్గంపై  చేస్తున్న  వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న వారిపై జరుగుతున్న దాడులు ప్రకంపనలు రేపాయి.

గౌరీలంకేష్ హత్య కేసులో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వాఘమెరే అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ హత్యలో అతడిని కీలకంగా భావిస్తున్నారు. అయితే అతని దగ్గర లభ్యమైన డైరీపై పెద్ద దుమారమే రేపుతోంది. గౌరీ తరహాలోనే మరికొందరిని హతమార్చేందుకు ఈ గ్యాంగ్ పథకం వేసినట్లు వెల్లడైంది. లిస్ట్‌లో పలువురు ప్రముఖులు ఉండడం సంచలనంగా మారింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న డైరీలో కన్నడ నటుడు, సాహితీ వేత్త గిరీష్‌కర్నాడ్ పేరు ఉన్నట్లు చెబుతున్నారు. 

అయనతో పాటు సాహితీ వేత్త లలితానాయక్, చెన్నమలస్వామి, ద్వారకానాథ్‌రావు పేర్లున్నాయి. వీరితో పాటు మరికొందరి పేర్లు కోడ్ భాషలో ఉన్నాయి. వీరందరీ కల్బుర్గీ, గౌరీలంకేష్ తరహాలోనే చంపాలని ప్లాన్ వేశారు. అయితే ఇప్పడు ఈ లిస్ట్ హాట్ టాపిక్‌గా మారింది.
 

loader