Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ త‌న కుమార్తెకు అక్ర‌మంగా కాంట్రాక్ట్ అప్ప‌గించారు - ఆప్ ఎంపీ సంజ‌య్ సింగ్ ఆరోప‌ణ‌

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కేవీఐసీ చైర్మన్ గా ఉన్న సమయంలో త‌న కుమార్తెకు అక్రమంగా ఇంటీరియర్ డిజైనింగ్ కాంట్రాక్ట్ అప్పగించారని ఆప్ ఎంపీ సంజ‌య్ సింగ్ ఆరోపించారు. ఆయనను పదవి నుంచి తొలగించాలని ప్రధాని మోడీని డిమాండ్ చేశారు. 

Delhi Lt Governor illegally awarded contract to his daughter - AAP MP Sanjay Singh alleges
Author
First Published Sep 2, 2022, 4:22 PM IST

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శుక్రవారం మరోసారి దాడి చేసింది. ఎల్జీని వెంటనే తొలగించాలని ప్రధాని నరేంద్ర మోడీని ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ సక్సేనా డిమాండ్ చేశారు. లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కేవీఐసీ చైర్మన్ గా ఉన్న స‌మ‌యంలో త‌న కుమార్తెకు అక్రమంగా ఇంటీరియర్ డిజైనింగ్ కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపించారు. 

భారత నావికా దళ కొత్త జెండాలో ఛత్రపతి స్ఫూర్తి.. శివాజీ రాజముద్ర రూపం స్వీకరణ.. నూతన పతాకం విశేషాలివే..!

‘‘ కూతురికి ఇంటీరియర్ డిజైనింగ్ కాంట్రాక్టును అక్రమంగా కట్టబెట్టినందుకు గాను ఢిల్లీ ఎల్జీగా ఉన్న వీకే సక్సేనాను ప్రధాని మోదీ వెంటనే తొలగించాలి. కేవీఐసీ ఛైర్మన్‌గా ఉన్న సక్సేనా ముంబైలోని ఖాదీ లాంజ్ ఇంటీరియర్ డిజైనింగ్ కాంట్రాక్టును అక్రమంగా కుమార్తెకు అప్పగించారు ’’ అని సంజయ్ సింగ్ ఆరోపించినట్టు వార్తా సంస్థ PTI శుక్రవారం నివేదించింది. ఢిల్లీ ఎల్జీ దుశ్చర్యల నుంచి తప్పించుకోలేరని ఆయ‌న అన్నారు. తన కుమార్తెకు ఇంటీరియర్ డిజైనింగ్ కాంట్రాక్ట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆప్ కోర్టును ఆశ్రయిస్తుందని చెప్పారు.

నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో సక్సేనా రూ. 1400 కోట్ల మార్పిడి చేశారు - ఆప్ 
సక్సేనా కేవీఐసీ చైర్మ‌న్ గా ఉన్న‌ప్పుడు డీమోనిటైజేషన్ సమయంలో రూ. 1400 కోట్ల మార్పిడికి సహకరించారని ఆప్ తాజాగా ఆరోపించింది. ఇదే విషయాన్ని గురువారం ఢిల్లీ అసెంబ్లీలో జ‌రిగిన బ‌ల నిరూప‌ణ స‌మ‌యంలో కూడా ప్ర‌స్తావించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నేతృత్వంలోని ఆప్ నాయకులు సక్సేనా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేవీఐసీ చైర్మ‌న్ గా ఉన్న‌ప్పుడు 14 వందల కోట్ల‌ను మార్చార‌ని అన్నారు.

జనాభా నియంత్రణ చ‌ట్టంపై కేంద్రానికి నోటీసు జారీ చేసిన సుప్రీం..

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై ఇటీవల సీబీఐ దాడులు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఈ విషయం వెలుగులోకి తీసుకొచ్చారు. సోమ‌వారం కూడా సిసోడియా బ్యాంకు ఖాతాల‌ను సీబీఐ అధికారులు పరిశీలించారు. అయితే ఈ పరిణామాల‌పై ఆప్ స్పందిస్తూ.. ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కేంద్రం దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తోందని ఆరోపించింది. అయితే ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, కానీ తమ పార్టీ నాయ‌కులు లొంగ‌లేద‌ని ‘ఆపరేషన్ కమలం’ విఫలమైందని ఆరోపించారు.

కాగా.. గురువారం ప్రత్యేకంగా నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంలోని బీజేపీ  ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై సీబీఐ దాడి జ‌రిగిన త‌రువాత గుజరాత్‌లో తమ పార్టీ ఓట్లు 4 శాతం పెరిగాయ‌ని అన్నారు. ‘‘ సిసోడియాపై దాడి జరిగినప్పటి నుంచి గుజరాత్‌లో ఆప్ ఓట్ షేర్ నాలుగు శాతం పెరిగింది. ఆయనను అరెస్టు చేసే నాటికి అది ఆరు శాతానికి పెరుగుతుంది. త్వరలో జరగబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుంది ’’ అని ఆయన తెలిపారు. 

బాలీవుడ్ సినిమా నుంచి ప్రేర‌ణ పొంది.. విక‌లాంగ యువకుడిని హతమార్చిన మైన‌ర్

సిసోడియా నివాసంపై సీబీఐ దాడి చేసిందని, అతడి గ్రామానికి వెళ్లి బ్యాంక్ లాకర్‌లో సోదాలు చేసింద‌ని, కానీ అందులో ఏమీ దొర‌క‌లేద‌ని కేజ్రీవాల్ వెల్ల‌డించారు. “ మనీష్ సిసోడియాపై నకిలీ కేసు పెట్టారు. ఆయ‌న దర్యాప్తును స్వాగతించాడు. కానీ పరువు నష్టం కేసుతో బెదిరించలేదు ” అని ఢిల్లీ సీఎం అన్నారు.  త‌న డిప్యూటీ సీఎంను అరెస్టు చేయాల‌ని సీబీఐపై ఒత్తిడి ఉంద‌ని తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios