ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన మాజీ సీఎం, ఆప్ నాయకుడు మనీష్ సిసోడియా కస్టడీని కోర్టు మరోసారి పొడిగింది. ఏప్రిల్ 17వ తేదీ వరకు ఆయన కస్టడీలో ఉండాలంటూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఆప్ అధినేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మళ్లీ పొడిగించింది. ఆయనకు ఏప్రిల్ 17 వరకు కస్టడీ పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దర్యాప్తు కీలక దశలో ఉందని, జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరుతూ ఏజెన్సీ పిటిషన్ దాఖలు చేసింది. ఏజెన్సీ అభ్యర్థనను కోర్టు అంగీకరించింది.సీబీఐ దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ గత వారం తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. దీనిపై తదుపరి విచారణను ఏప్రిల్ 12కు వాయిదా వేసింది.
ప్రధాని మోడీ ప్రారంభించిన వారంలోపే వర్షపు నీటితో నిండిన మెట్రో స్టేషన్
ఢిల్లీ ప్రభుత్వంలో తన సహచరులకు సుమారు రూ.90-100 కోట్ల అడ్వాన్స్ ముడుపులు చెల్లించారనే ఆరోపణలకు సంబంధించిన నేరపూరిత కుట్రలో మాజీ ఎక్సైజ్ మంత్రి అత్యంత ముఖ్యమైన, కీలక పాత్ర పోషించారని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ పేర్కొన్నారు. ఈ కేసులో ఫిబ్రవరి 26 నుంచి కస్టడీలో ఉన్న ఆప్ సీనియర్ నేతను విడుదల చేయడం ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అడ్వాన్స్ ముడుపుల మొత్తంలో రూ.20-30 కోట్లు సహ నిందితులు విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్ పల్లి, అప్రూవర్ దినేష్ అరోరా ద్వారా మళ్లించినట్లు గుర్తించామని న్యాయమూర్తి తెలిపారు.
మనీష్ సిసోడియా కస్టడీని పొడిగించడం ఇదే మొదటిసారి కాదు. దర్యాప్తు ఏజెన్సీల అభ్యర్థన మేరకు ఆయన అరెస్టు అయినప్పటి నుంచి పలు దపాలుగా కస్టడీని పొడగిస్తూ వస్తున్నారు. ఇప్పుడు రద్దు చేసిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 రూపకల్పన అమలులో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అరెస్టు చేశారు.
