Bangalore: ప్రధాని న‌రేంద్ర మోడీ ప్రారంభించిన రెండు రోజులకే మెట్రో స్టేషన్ వ‌ర్ష‌పు నీటితో నిండిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మెట్రో వ్యవస్థ వినియోగానికి సిద్ధంగా ఉందా? అని  ప్ర‌శ్నిస్తూ పలువురు ప్రయాణికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   

Nallurhalli Metro station Waterlogging: ఇటీవ‌ల ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్రారంభించిన ప‌లు రోడ్డు మార్గాలు, వంతెన‌లు కొన్ని రోజుల్లోనే దెబ్బ‌తిన‌డంతో ప్ర‌భుత్వం విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇదే త‌ర‌హా మ‌రో ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించి ప్ర‌ధాని మోడీ ప్రారంభించిన రెండు రోజులకే మెట్రో స్టేషన్ వ‌ర్ష‌పు నీటితో నిండిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మెట్రో వ్యవస్థ వినియోగానికి సిద్ధంగా ఉందా? అని  ప్ర‌శ్నిస్తూ పలువురు ప్రయాణికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న క‌ర్నాట‌క‌లోని బెంగ‌ళూరులో చోటుచేసుకుంది. 

వివ‌రాల్లోకెళ్తే.. బెంగళూరు మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టులో భాగంగా 13.71 కిలోమీటర్ల మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన కొద్ది రోజులకే బెంగళూరులో కురిసిన వర్షాలకు నల్లూరుహళ్లి మెట్రో స్టేషన్ నీట మునిగింది. రైల్వే స్టేష‌న్ లో వ‌ర్ష‌పు నీరు నిలిచిపోవ‌డం, ప్ర‌యాణికులు అక్క‌డ నుంచి వెళ్ల‌డాన‌కి ఇబ్బంది ప‌డుతుండ‌టంతో పాటు, అక్క‌డ ప‌నిచేస్తున్న కార్మికులు వ‌ర్షపు నీటిని తొల‌గిస్తున్న దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వీడియోల‌లో క‌నిపించాయి. కొత్త నల్లూరుహళ్లి మెట్రో స్టేషన్ లోపల వ‌ర్ష‌పు నీరు చేరిన దృశ్యాల‌ను బెంగళూరు సిటిజన్ ఫోరం వైట్ ఫీల్డ్ రైజింగ్ ట్వీట్ చేసింది. టికెటింగ్ కౌంటర్ దగ్గర ప్లాట్ ఫాంపై కూడా నీరు చేరింది. ఒక్క చిన్న వ‌ర్షానికి మెట్రో లోప‌ల పూర్తిగా వ‌ర్షపు నీరు నిలిచిపోయింద‌ని పేర్కొన్నారు.

 

Scroll to load tweet…

 

అయితే, మెట్రో స్టేష‌న్ ప్రారంభించిన కొన్ని రోజుల‌కే ఇలా వ‌ర్ష‌పు నీటితో నిండిపోవ‌డంతో ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మెట్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రారంభానికి సిద్ధంగా ఉందా? అని కొందరు ప్రయాణికులు ప్రభుత్వాన్ని నిలదీశారు. తేలికపాటి వర్షాల‌కే ఇలా ఉంటే వర్షాకాలంలో ఏం జరుగుతుందని ఓ ట్విటర్ యూజర్ ప్రశ్నించారు. "ఒక్క తేలికపాటి వర్షం కురవడంతో లోపల నీరు పూర్తిగా ప్రవహించింది. వర్షాకాలంలో ఏం జరుగుతుంది.." అని రాసుకొచ్చారు.


 

Scroll to load tweet…

 

మ‌రో నెటిజ‌న్ స్పందిస్తూ.. ‘పనులు సరిగ్గా పూర్తి చేయకుండానే హడావుడిగా మెట్రో స్టేషన్లు తెరిచినప్పుడు ఇలా జ‌రుగుతుంద‌ని అనుకోవచ్చు’ అని ట్వీట్ చేశారు.


 

Scroll to load tweet…