Asianet News TeluguAsianet News Telugu

'సంస్కృతం అన్ని భాషలకు మూలం.. ఆ భాషతో ఇతర భాషలను నేర్చుకోవడం సులభం' :డాక్టర్ నూరిమా యాస్మిన్ శాస్త్రి 

ఈ రోజుల్లో మనం మతం పేరుతో భిన్నమైన అభిప్రాయాలను వింటున్నాము. కానీ పవిత్ర ఖురాన్, వేదాలు ఇతర మతాలను ద్వేషించాలని చెప్పలేదనీ, తాను ఖురాన్ ,వేదాలు రెండింటినీ చదివానని, సంస్కృతం అని భాషలకు మూలం అంటారు డాక్టర్ నూరిమా యాస్మిన్ అస్సామీ శాస్త్రి.

Dr Nurima Yasmin Shastri says knowing Sanskrit makes learning languages easy KRJ
Author
First Published Apr 5, 2023, 4:26 PM IST

సంస్కృతం అనేది దైవ భాష.. అలాగే.. హిందూ, బౌద్ధమతాల వారు సంస్కృత భాషను పవిత్ర భాషగా భావిస్తారు.   హిందూ మతానికి చెందిన అనేక పవిత్ర గంధ్రాలు సంస్కృతంలో రాయబడ్డాయి. ఆ భాషను నేర్చుకోవడం చాలా కష్టం. అయినా ఆ భాషను బ్రహ్మణులే నేర్చుకుంటారు. అనే భావన సహజం.

అయితే... అస్సాంకు చెందిన ఓ ముస్లిం మహిళ మూస ధోరణిని బద్దలు కొట్టింది. అరబిక్, పర్షియన్,ఉర్దూ నేర్చుకునే కంటే.. సంస్కృతం అభ్యసించడం చాలా సులభమని నిరూపించింది.  ఆమెనే డాక్టర్ నూరిమా యాస్మిన్ శాస్త్రి. ఆమె తన పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు సంస్కృతం అభ్యసించింది. సంస్కృత భాషలో పట్టు సాధించి..  పట్టభద్రులయ్యారు. ప్రస్తుతం ఆమె.. కుమార్ భాస్కర్ వర్మ సంస్కృతం, ప్రాచీన అధ్యయనాల విశ్వవిద్యాలయం-నల్బరిలో సంస్కృత విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ..  సంస్కృత పాఠాలను  బోధిస్తున్నారు.

డా. నురిమా యాస్మిన్ అస్సామీ.. పశ్చిమ అస్సాంలోని రంగియాకు చెందిన దివంగత అలీ బర్దీ ఖాన్ , షమీనా ఖాతున్‌ల చిన్న కుమార్తె. ఆమె తండ్రి రంగియా హయ్యర్ సెకండరీ స్కూల్ లో ఇంగ్లీష్ టీచర్ గా పనిచేసేవారు.  ఆమె తన పాఠశాల విద్యను రంగియా హయ్యర్ సెకండరీ స్కూల్‌లో పూర్తి చేసి, కాటన్ కాలేజీలో (ప్రస్తుతం కాటన్ విశ్వ విద్యాలయం) చేరారు. ఆమె కాటన్ కాలేజీ నుండి సంస్కృతంలో గౌరవ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తరువాత  గౌహతి విశ్వవిద్యాలయంలో పీజీ (2008) , ఎంఫిల్ (2015) డిగ్రీలను పొందారు. ఆమె 2008 నుండే ..  కుమార్ భాస్కర్ వర్మా సంస్కృతం,ప్రాచీన అధ్యయనాల విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.

డాక్టర్ నురిమా యాస్మిన్ ..  అవాజ్-ది వాయిస్ అనే మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ.. "సంస్కృతం లోతైన, చాలా కఠినమైన ఆంశం. ఇది కేవలం మతానికి సంబంధించిన భాష కాదు. సంస్కృతం ఒక దైవిక భాష ,అన్ని భాషలకు మూలం. సంస్కృతం చదవడం వల్ల ఇతర భాషలను సులభంగా,  పరిపూర్ణంగా నేర్చుకోవచ్చు. మనమందరం సంస్కృతాన్ని అధ్యయనం చేయాలి." అని నురిమా యాస్మిన్ చెప్పారు. డా. నూరిమా యాస్మిన్ తన పేరులో  శాస్త్రి  గురించి మాట్లాడుతూ.. తన లోతైన అధ్యయనం, సంస్కృతంపై పట్టు సాధించినందుకు అందుకున్న డిగ్రీ అని తెలిపారు. తన చిన్నతనం నుండే ప్రాచీన భాష (సంస్కృతం)పై ఆసక్తి ఉందని చెప్పారు. 

తన సంస్కృతం అభ్యసనం గురించి మాట్లాడుతూ.. “నేను 8వ తరగతి నుండి సంస్కృతం చదువుతున్నాను. స్కూల్లో ఈ సబ్జెక్ట్ తీసుకోకుండా నన్ను ఎవరూ అడ్డుకోలేదు. నేను స్కూల్లో సంస్కృతం చదివినప్పుడు, మా తరగతిలో నేనొక్కడినే ముస్లిం విద్యార్థిని. నేను నా గ్రాడ్యుయేషన్‌ను (సంస్కృతం) డిటింక్షన్‌తో పూర్తి చేశాను.తరువాత 2008లో అదే సబ్జెక్ట్‌లో శాస్త్రితో పాటు MA , M.Phil డిగ్రీలను పొందాను. అని తెలిపారు. 

ఇంకా మాట్లాడుతూ.. "సంస్కృతం గురించి తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి.కాబట్టి ప్రతి ఒక్కరూ సంస్కృతం చదవాలని నేను భావిస్తున్నాను. నేను ప్రస్తుతం సంస్కృత సాహిత్యం, సంస్కృత వేద అధ్యయన విభాగం, సర్వదర్శన విభాగంలో పనిచేస్తున్నాను. చాలా మంది ముస్లిం విద్యార్థులు ఈ విభాగాలలో చదువుతున్నారు. సంస్కృతం నేర్చుకుంటున్నారు." అని డా.నూరిమా యాస్మిన్ శాస్త్రి తెలిపారు.

"ఈ రోజుల్లో మనం మతం పేరుతో మన చుట్టూ భిన్నమైన అభిప్రాయాలను వింటున్నాము. కానీ పవిత్ర ఖురాన్ , వేదాలు ఇతర మతాలను ద్వేషించాలని చెప్పలేదు. నేను ఖురాన్ , వేదాలు రెండింటినీ చదివాను," అని డాక్టర్ నూరిమా చెప్పారు. డాక్టర్. నురిమా యాస్మిన్ పశ్చిమ అస్సాంలోని దర్రాంగ్ జిల్లాలో మంగళ్‌దై సివిల్ హాస్పిటల్‌లో డాక్టర్ షంసుల్ హక్‌ను వివాహం చేసుకున్నారు. ఆమె ఇప్పుడు ఇద్దరు పిల్లలకు తల్లి. 

Follow Us:
Download App:
  • android
  • ios