Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ గ్యాస్‌ చాంబర్‌గా మారింది - పంజాబ్‌ ఆప్‌ ప్రభుత్వంపై మండిపడ్డ కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్

ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతోందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ పార్టీయే కారణం అని ఆయన ఆరోపించారు. పంట వ్యర్థాల నిర్వహణ కోసం ఇచ్చిన నిధులను కూడా పంజాబ్ ప్రభుత్వం ఖర్చు చేయలేదని తెలిపారు. 

Delhi has become a gas chamber - Union Environment Minister Bhupendra Yadav angry at Punjab AAP government
Author
First Published Nov 3, 2022, 6:00 AM IST

ఢిల్లీలో కాలుష్యంపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఆమ్ ఆద్మీ పార్టీని టార్గెట్ చేశారు. ఢిల్లీని గ్యాస్ చాంబర్‌గా మార్చడానికి ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తుందో వివరిస్తూ ఆయన బుధవారం ట్విట్టర్‌లో గ్రాఫిక్ ఫొటోలను షేర్ చేశారు. 2021తో పోల్చితే పంజాబ్‌లో 19 శాతానికి పైగా పంట వ్యర్థాల దహనం పెరిగిందని అన్నారు. అదే సమయంలో హర్యానాలో (బీజేపీ అధికారంలో ఉంది) 30.6 శాతం తగ్గుదల నమోదైందని పేర్కొన్నారు. ఢిల్లీని గ్యాస్ ఛాంబర్‌గా మార్చిందెవరు అనే విషయం ఇక్కడే స్పష్టం అవుతోందని తెలిపారు.

బీహార్ లో దారుణం.. పెళ్లి సాకుతో మైనర్ పై అత్యాచారం.. అనంతరం మెడలో టవల్ వేసి ఊరేగింపు..

ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్న చోటే స్కామ్ ఉంటుందని భూపేంద్ర యాద్ తీవ్రంగా ఆరోపించారు. ‘‘ గత 5 సంవత్సరాలలో పంజాబ్‌కు పంట అవశేషాల నిర్వహణ యంత్రాల కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 1,347 కోట్లు ఇచ్చింది. రాష్ట్రం 1,20,000 యంత్రాలను కొనుగోలు చేసింది. వాటిలో 11,275 యంత్రాలు మాయమయ్యాయి. డబ్బు వినియోగంలో ప్రభుత్వ అసమర్థత కనిపిస్తోంది.’’అని ఆయన ఆరోపించారు.

సీఏఏ అమలుకు అనుమతివ్వబోమన్న మమతా బెనర్జీ.. బదులిచ్చిన హోం శాఖ సహాయ మంత్రి.. ఏమన్నారంటే ?

పంట అవశేసాల నిర్వహణ యంత్రాల కోసం పంజాబ్ ప్రభుత్వానికి దాదాపు రూ. 280 కోట్లు ఇచ్చామని, గత ఏడాది రూ. 212 కోట్లు వెచ్చించామని మంత్రి చెప్పారు. ‘‘ గతేడాది ఇచ్చిన రూ. 212 కోట్లు ఖర్చు  చేయలేదు. ఈ సంవత్సరం కూడా పంట వ్యర్థాల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం పంజాబ్‌కు రూ. 280 కోట్లు ఇచ్చింది. కాబట్టి సుమారు రూ. 492 కోట్లు అందుబాటులో ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూర్చోవాలని నిర్ణయించుకుంది. నిస్సహాయ రైతులను పంట అవశేషాలను కాల్చేలా చేస్తోంది.’’ అని పేర్కొన్నారు.

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పై కూడా భూపేంద్ర యాదవ్ తీవ్ర స్థాయిలో ఆయన విరుచుకుపడ్డారు. ‘‘ పంజాబ్ ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గం అయిన సంగ్రూర్‌లో రైతులకు ఉపశమనం కలిగించడంలో కూడా విఫలమయ్యారు. గతేడాది (సెప్టెంబర్ 15-నవంబర్ 2) సంగ్రూర్‌లో 1,266 వ్యవసాయ మంటలు నమోదయ్యాయి. ఈ సంవత్సరం అవి 139 శాతం పెరిగి 3,025కి చేరుకుంది.’’ అని ఆయన ఆరోపించారు.

నేడు ఆరు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు.. ఎక్కడెక్కడంటే ?

ఇదిలా ఉండగా.. ఢిల్లీ కాలుష్యం విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. కాలుష్యం ఒక్క ఢిల్లీకే పరిమితం కాలేదని, ఇది ఉత్తర భారతదేశ మొత్తం సమస్య అని అన్నారు. దీనిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రధానికి ఉందని తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “ కాలుష్యం మొత్తం ఉత్తర భారతదేశం సమస్య. దీనిపై రాజకీయాలు చేస్తున్నారు. ఢిల్లీ, పంజాబ్ లో మాత్రమే కాలుష్యం ఉందని చూపిస్తున్నారు. హర్యానా, యూపీ నగరాల్లో కూడా కాలుష్యం ఉంది. మరి దీనిని ప్రధాని పరిష్కరించాలి. ’’ అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios