Asianet News TeluguAsianet News Telugu

బీహార్ లో దారుణం.. పెళ్లి సాకుతో మైనర్ పై అత్యాచారం.. అనంతరం మెడలో టవల్ వేసి ఊరేగింపు..

మహిళపై లైంగిక దాడులు ఆగడం లేదు. ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట మహిళపై అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. తాజాగా బీహార్ లో ఓ యువకుడు బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడు. 

Atrocity in Bihar.. Rape of a minor on the pretext of marriage.. After that, a towel is placed around the neck and the procession takes place.
Author
First Published Nov 3, 2022, 5:17 AM IST

బీహార్‌లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు మైనర్ బాలికను ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన నిందితుడి ఇంట్లోనే జరిగింది. చివరికి ఈ విషయం అతడి కుటుంబ సభ్యులకు తెలిసింది. అయితే ఈ విషయంలో యువకుడిని మందలించాల్సిన ఆ కుటుంబం బాలికను తీవ్రంగా అవమానించింది. బాలిక మెడలో ఓ కాటన్ టవల్ వేసి ఊరేగించింది.

సీఏఏ అమలుకు అనుమతివ్వబోమన్న మమతా బెనర్జీ.. బదులిచ్చిన హోం శాఖ సహాయ మంత్రి.. ఏమన్నారంటే ?

పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. సమస్తిపూర్‌ జిల్లా అంగర ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువకుడు విపిన్‌ పాశ్వాన్‌ అనే యువకుడు ఓ బాలికను ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అక్టోబర్ 26వ తేదీన ఆ బాలికతో మాట్లాడి తన ఇంటికి తీసుకొచ్చాడు. అనంతరం మూడు రోజుల పాటు బాలికపై అత్యాచారం చేశాడు. 

ఆ యువకుడు బాలికను ఇంట్లో ఉంచుకొని మూడు రోజులుగా అత్యాచారం చేస్తున్నాడని గ్రామస్తులకు తెలిసింది. విపిన్ చర్యలకు అభ్యంతరం తెలిపారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో ఆ నిందితుడి తల్లి యువకుడిని మందలించకుండా బాలికనే బలిపశువును చేసింది. బాలిక మెడలో టవల్ వేసి ఊరంతా తిప్పింది. ఈ సందర్భంగా బాధితురాలుపై అసభ్యంగా ప్రవర్తించారు. తనపై జరిగిన ఈ ఘోర అవమానాన్ని ఆ బాలిక అంగర ఘాట్ పోలీస్ స్టేషన్ లో పోలీసుల ఎదుట వెల్లడించింది. నిందితులపై ఫిర్యాదు చేసింది.

తొలిసారిగా సీఆర్‌పీఎఫ్‌లో ఇద్దరు మహిళలకు ఐజీ ర్యాంక్.. ఆర్‌ఏఎఫ్, బీహార్ సెక్టార్ బాధ్యతల అప్పగింత

అనంతరం ఈ కేసును మహిళా పోలీసు స్టేషన్ కు బదిలీ చేశారు. వారు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ప్రధాన నిందితుడి విపిన్ పాశ్వాన్ తో పాటు మరో ఇద్దరు నిందితులు అయిన నాన్కి పాశ్వాన్, సునీల్ పాశ్వాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. జైలుకు తరలించారు. అయితే మరో నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడు. ఘటనపై మహిళా పోలీస్ స్టేషన్ అధికారి పుష్పలత కుమారి మాట్లాడుతూ.. పరారీలో ఉన్న మహిళా నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

మసీదులో మత గ్రంథాల దహనం.. యూపీలోని షాజహాన్‌పూర్‌లో ఉద్రిక్తత..

ఇదిలా ఉండగా.. ఇలాంటి ఘటనే ఒకటి ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేకుంటానని నమ్మించి ఓ మహిళపై సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పదే పదే అత్యాచారం చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన ఓ మహిళకు తన చెల్లెలు భర్త ద్వారా సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గా పని చేసే విజయ్ కుమార్ (33)తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో ఆమెను అతడు పెళ్లి చేసుకుంటానని పలుమార్లు అత్యాచారం చేశాడు. కానీ చివరికి ఆమెను మోసం చేశాడు. పెళ్లి చేసుకోబోనని చెప్పాడు. ఆమె ఫోన్ నెంబర్ ను కూడా బ్లాక్ చేశాడు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios