ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ దళిత యువకుడిని అత్యంత క్రూరంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళితే... ఫతే‌పూర్‌కు చెందిన ప్రమోద్ కుమార్ అనే 22 ఏళ్ల దళిత యువకుడు ఆదివారం 12 గంటల ప్రాంతంలో పొలానికి వెళ్లాడు. 2.30 గంటల ప్రాంతంలో తల లేని మృతదేహాన్ని అటుగా వెళుతున్న కొందరు స్థానికులు గుర్తించారు.

Also Read:వివాహేతర సంబంధం... తల నరికి వ్యక్తి దారుణ హత్య

ఈ వెంటనే కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు యువకుడి కుడిచేతి వేళ్లను మూడింటిని తొలగించి ఉండటం గమనించారు.

అంతేకాకుండా అతడి తలను ఇటుకపై పెట్టి, వేరు చేసినట్లుగా వారికి ఆనవాళ్లు లభించాయి. దీనికి తోడు మృతుడి సెల్‌ఫోన్ సైతం కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తమ కుమారుడికి ఎవరితోనూ శతృత్వం లేదని ప్రమోద్ తల్లిదండ్రులు చెబుతున్నారు.

Also Read:యువకుడి తల నరికి ఫ్రిజ్ లో పెట్టి దాన్ని చూస్తూ మద్యం తాగారు

ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాదాపు 10 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం ముగ్గురి కంటే ఎక్కువమంది ఈ హత్యలో పాల్గొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.