CSD Bipin Rawat తమిళనాడు నీలగిరి జిల్లా కూనూర్​ సమీపంలో CSD Bipin Rawat సహా​ మరో 13 మంది దుర్మరణానికి కారణమైన ఆర్మీ హెలికాప్టర్​ ప్రమాద ఘటనపై  ద‌ర్యాప్తు చేప‌ట్టారు ఈ ద‌ర్యాప్తులో ఐఏఎఫ్​, ఆర్మీ, నేవీకి చెందిన అధికారులు పాల్గొన్నారు. కాగా, వచ్చే వారమే ప్ర‌మాదానికి సంబంధించిన నివేదికను వైమానిక దళానికి (ఐఏఎఫ్) సమర్పించనున్నట్లుసమాచారం. 

CSD Bipin Rawat: త్రివిధదళాధిపది జనరల్ బిపిన్ రావత్ (CSD Bipin Rawat) సహా 13 మంది మృతికి కారణమైన హెలికాప్టర్ ప్రమాదం (Helicopter Crash)పై వాస్తవ నివేదిక దాదాపుగా సిద్ధమైన‌ట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వంలోని త్రీ-సేవ కమిటీ స‌మ‌గ్ర‌ నివేదికను సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తోంది. వచ్చే వారం వైమానికదళ (IAF) ప్రధాన కార్యాలయానికి అందించనున్నారు. 

IAF ఎయిర్ మార్షల్​ మానవేంద్ర సింగ్ నేతృత్వంలోని దర్యాప్తు జ‌రిగింది. ఈ దర్యాప్తులో ఆర్మీ, నేవీలకు చెందిన బ్రిగేడియర్ ర్యాంక్ అధికారులు పాల్గొన్నారు. ఈ ప్ర‌మాదం మానవ తప్పిదం వల్ల జ‌రిగిందా? లేదా వాతావరణ ప్ర‌తికూల‌త వ‌ల్ల ప్ర‌మాదం సంభ‌వించిందా? ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్నప్పుడు సిబ్బంది దిక్కుతోచని స్థితిలో ఉన్నారా? అన్న విష‌యాల‌తో పాటు ప‌లు కోణాల్లో దర్యాప్తు జరిపినట్లు తెలుస్తోంది. విచారణలో నిర్దేశించిన నియమాలు, విధానాలను దర్యాప్తు బృందం అనుసరించిందని నిర్ధారించేందుకు చట్టపరమైన పరిశీలన జరుగుతున్నట్టు తెలుస్తోంది.

Read Also : Bipin Rawat last speech: సీడీఎస్ బిపిన్ రావత్​ చివరి సందేశం విడుద‌ల‌.. ఏం మాట్లాడారంటే..?

కాగా, హెలికాప్టర్ ఫైలట్ నియంత్రణలోనే ఉన్నప్పటికీ.. ద‌ట్ట‌మైన‌ వాతావరణ పొగమంచు కార‌ణంగా.. పైలట్ కు ఎదురుగా ఉన్న లక్ష్యం లేదా ముందున్న అడ్డంకులను గుర్తించలేక.. ఏదైనా చెట్టునుగాని, కొండనుగాని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే విచారణకు సంబంధించి ఇప్పటి వరకు త్రివిధ దళాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇదిలాఉంటే.. Mi-17 V5 హెలికాప్టర్ లో సాంకేతిక లోపం వ‌ల్ల ఈప్రమాదం జరిగి ఉంటుంద‌నే వాద‌న‌ను ఎయిర్ మార్షల్ మానవేంద్రసింగ్ కొట్టిపారేశారు. ప్రమాదానికి గల అన్ని కారణాలను క్షుణంగా విశ్లేషించుకున్న తరువాతనే నివేదికను వెల్ల‌డిస్తామ‌ని తెలిపారు. 

Read Also : రావత్ హెలికాప్ట‌ర్ ప్రమాదంపై చాలా ఫెయిర్‌గా విచారణ సాగుతుంది.. ఇప్పుడే కామెంట్ చేయలేం: ఎయిర్ చీఫ్ వీఆర్ చౌద‌రీ
వాతావ‌ర‌ణంలో సంభ‌వించే ఆక‌స్మిక మార్పుల‌పై పైలట్లకు అవగాహన లేకపోవడం, పరిసరాలు కనిపించకపోవడం వల్ల చాలా ప్ర‌మాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయని విమానయాన రంగ నిపుణులు చెబుతున్నారు. దాదాపు పూర్తయిన ఈ నివేదికను చీఫ్ ఆఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరికి మరో వారం రోజుల్లో సమర్పించే అవకాశం ఉందని సమాచారం. ఈ విష‌యంలో త్వ‌ర‌లోనే అధికారికంగా ప్రకటన రానున్న‌ది. 

Read Also : రావత్, సైనికులకు స్మారకం కట్టండి.. ప్రధానికి వెల్లింగ్టన్ కంటోన్మెంట్ వాసుల లేఖ

CSD జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి సహా మరో 12 మంది సైనికులు, పౌరులు.. డిసెంబర్ 8 2021లో తమిళనాడులోని సూళూర్ ఎయిర్ బేస్ నుంచి Mi-17 V5 హెలికాప్టర్ లో వెల్లింగ్టన్ హెలిపాడ్ వద్దకు బయలుదేరారు. బయలుదేరిన నిముషాల వ్యవధిలోనే తమిళనాడులోని నీలగిరి జిల్లా కూనూర్ వద్ద హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది.