Asianet News TeluguAsianet News Telugu

రావత్, సైనికులకు స్మారకం కట్టండి.. ప్రధానికి వెల్లింగ్టన్ కంటోన్మెంట్ వాసుల లేఖ

హెలిక్యాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన బిపిన్ రావ‌త్ కు, ఇత‌ర సైనిక అధికారుల‌కు స్మార‌క చిహ్నం క‌ట్టించాల‌ని కూనూరు గ్రామ‌స్తులు ప్ర‌ధానిని కోరారు. ఈ మేర‌కు ఆ గ్రామ‌స్తులు ప్ర‌ధానికి లేఖ రాశారు.

Rawat build a monument to the soldiers Letter from the people of Wellington Cantonment to the Prime Minister
Author
Hyderabad, First Published Dec 13, 2021, 7:36 PM IST

బిపిన్ రావత్ ఆయ‌న స‌తీమ‌ణి మ‌ధులిక రావ‌త్ తో పాటు 12 మంది ఆర్మీ అధికారులు ప్ర‌యాణిస్తున్న హెలిక్యాప్ట‌ర్ ఈ నెల 8 నీలిగిరి అడ‌వుల్లో కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో బిపిన్ రావ‌త్ దంప‌తులు 11 మంది సైనికులు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న నుంచి దేశం ఇప్ప‌టికీ కోలుకులేక‌పోతుంది. గొప్ప దేశ‌భ‌క్తులను కోల్ప‌యామ‌ని భావిస్తోంది. హెలిక్యాప్ట‌ర్ ప్ర‌మాదంలో చ‌నిపోయిన సైనికులంద‌రికీ దేశం మొత్తం శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించింది. 

కూనూరు గ్రామ‌స్తుల విజ్ఞ‌ప్తి...
హెలిక్యాప్ట‌ర్ ప్ర‌మాదం దేశం మొత్తాన్ని విచారంలో ముంచెత్తింది. ఆ ప్ర‌మాదం జ‌రిగి దాదాపు 6 రోజులు దాటుతున్నా..ఆ ప్ర‌మాద తాలుక దృశ్యాలు అంద‌రి క‌ళ్ల‌ల్లో మెదులుతున్నాయి. అయితే ఈ ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతానికి చెందిన ప్ర‌జ‌లు కూడా ఆ ఘ‌ట‌న నుంచి ఇంకా తేరుకోలేక‌పోతున్నారు. సుదీర్ఘ కాలంపాటు దేశానికి సేవ చేసిన గొప్ప దేశ‌భ‌క్తులు త‌మ ప్రాంతంలో చ‌నిపోవ‌డం వారిని తీవ్ర మ‌నోవేద‌న‌కు గురి చేస్తోంది. అమరుల ప‌ట్ల గౌర‌వాన్ని చాటుకునేందుకు వారు గొప్ప సంక‌ల్పం చేయాల‌ని భావిస్తున్నారు. ఈ ప్ర‌మాదం నీలిగిరి జిల్లాలోని కూనురు ప్రాంతంలో జ‌రిగింది. ఆ గ్రామ‌స్తులు అంతా క‌లిసి గొప్పకార్యం చేయాల‌ని ప్ర‌ధానికి లేఖ రాశారు. అందులో  హెలిక్యాప్ట‌ర్ ప్ర‌మాదంలో మృతి చెందిన అమ‌రుల‌కు త‌మిళనాడులో ఒక స్మార‌క చిహ్నం క‌ట్టించాల‌ని కోరారు. దీంతో దేశ ప్ర‌జ‌లు, ఈ ప్రాంతంలోని వాసులంతా వారిని స్మ‌రించుకునేందుకు, నివాళి అర్పించేందుకు వీలు అవుతుంద‌ని అందులో కోరారు. ఇది త‌మ మ‌న‌సులోని భావ‌న అని తెలిపారు. దీంతో పాటు స్థానిక రైల్వే స్టేష‌న్‌కు రావ‌త్ పేరు పెట్టాల‌ని సూచించారు. ఇది గొప్ప దేశ‌భ‌క్తుల‌కు ఇచ్చే గొప్ప గౌర‌వం అని పేర్కొన్నారు. ఈ లేఖ‌ను ప్ర‌ధానితో పాటు ర‌క్ష‌ణ మంత్రికి, త‌మిళ‌నాడు సీఎంకు పంపించారు. 

దేశ విభజనపై ఫ‌రూక్ అబ్దుల్లా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు !

అస‌లేం జ‌రిగింది...
ఈనెల 8న నీలగిరి జిల్లా వెల్లింగ్టన్‌లో ట్రైనింగ్‌లో ఉన్న సైనికుల‌కు, అధికారుల‌ను ఉద్దేశించి మాట్లాడేందుకు బిపిన్ రావ‌త్ ఆయ‌న స‌తీమ‌ణి మ‌ధులిక రావ‌త్ తో పాటు మ‌రో 12 మంది అధికారులు హెలిక్యాప్ట‌ర్‌లో బ‌య‌లుదేరారు. వెల్లింగ్టన్‌కు ఎంఐ-17వీ5 హెలికాప్టర్‌లో వారంతా బ‌య‌లుదేరారు. అయితే వాతావ‌ర‌ణం అనుకూలించ‌క‌పోవ‌డంతో మధ్యాహ్నం 12.20 గంటల ప్రాంతంలో కున్నూరు సమీపంలో ఆ హెలిక్యాప్ట‌ర్ కుప్ప‌కూలిపోయింది. దీంతో హెలిక్యాప్ట‌ర్‌లో మొత్తం మంట‌లు చెల‌రేగాయి. ఈ ప్ర‌మాదంలో తొలి సీడీఎస్ బిపిన్ రావ‌త్ దంప‌తుల‌తో పాటు మిగిలిన 11 మంతి మృతి చెందారు. ఒక్క‌రు మాత్ర‌మే ప్రాణాల‌తో బ‌య‌ట‌పడ్డారు. ఆయ‌న ఇప్పుడు హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. ఇందులో బిపిన్ రావ‌త్ దంప‌తులు, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, బ్రిగేడియర్ ఎల్‌ఎస్ లిద్దర్, వింగ్ కమాండర్ పీఎస్ చౌహన్, స్క్వాడ్రన్ లీడర్ కుల్దీప్ సింగ్,  జూనియర్ వారెంట్ ఆఫీసర్ ప్రదీప్ అరక్కల్,  జూనియర్ వారెంట్ ఆఫీసర్ రాణా ప్రతాప్ దాస్,  సీడీఎస్ బిపిన్ రావత్ వ్యక్తిగత భద్రతా అధికారి హవిల్దార్ సత్పాల్, లాన్స్  నాయక్ వివేక్ కుమార్, లాన్స్ నాయక్ సాయి తేజ,  నాయక్ జితేందర్ కుమార్, నాయక్ గుర్‌ సేవక్ సింగ్ మృతి చెందారు. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఇప్పుడు హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios