Asianet News TeluguAsianet News Telugu

Bipin Rawat last speech: సీడీఎస్ బిపిన్ రావత్​ చివరి సందేశం విడుద‌ల‌.. ఏం మాట్లాడారంటే..?

Bipin Rawat last speech: 1971లో జ‌రిగిన పాకిస్థాన్ - భార‌త్ మ‌ధ్య జ‌రిగిన యుద్ధంలో భారత్ విజ‌యం సాధించింది. ఆ విజయానికి గుర్తుగా 'స్వర్ణిమ్​ విజయ్‌ పర్వ్​' వేడుకలను దిల్లీలోని ఇండియా గేట్​ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దివంగ‌త తొలి సీడీఎస్​ చివరి వీడియో రికార్డును ప్రసారం చేశారు.
ఆ వీడియోను డిసెంబర్ 7న రికార్డు చేసినట్టు భారత సైన్యం తెలిపింది.
 

CDS GENERAL BIPIN RAWAT LAST SPEECH PRE RECORDED MESSAGE
Author
Hyderabad, First Published Dec 12, 2021, 2:08 PM IST

Bipin Rawat last speech: భారత తొలి సర్వసైన్యాధ్యక్షుడు (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్-సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ఆకస్మిక మ‌ర‌ణ వార్త  నుంచి దేశం ఇంకా కోలుక్కొలేదు. డిసెంబ‌ర్ 8 న త‌మిళ‌నాడు  నీల‌గిరి ప‌ర్వ‌త‌శ్రేణుల్లోని కూనుర్ పాంత్రంలో జ‌రిగిన ప్ర‌మాదంలో రావ‌త్ దంప‌తుల‌తో పాటు మ‌రో 11 మంది  సైనికులు మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. సీడీఎస్ మ‌ర‌ణ‌వార్త‌తో య‌వ‌త్తు దేశం విషాదం లోని వెళ్లింది. ఈ స‌మయంలో ఆయన గురించి ఎన్నో విశేషాలు తెలుసుకుంటున్న ప్రజానీకం మరింత తల్లడిల్లిపోతోంది. వీరుడా సెల‌వంటూ భారతావాని కన్నీటి వీడ్కోలు పలికింది. యావత్‌ ప్రజానీకం రావత్‌కు నివాళి అర్పించింది.

 కాగా.. ఆయ‌న మ‌ర‌ణానికి కొద్ది గంటల ముందు రికార్డు చేసిన ఓ వీడియోను  సీడీఎస్ బిపిన్ రావ‌త్  చిట్ట చివరి సందేశమంటూ..  ఇండియన్ ఆర్మీ ఆదివారం నాడు విడుదల చేసింది. స్వ‌ర్ణిమ్ విజ‌య్ ప‌ర్వ్ అనే కార్య‌క్ర‌మంలో జన‌ర‌ల్ బిపిన్ రావ‌త్ చివ‌రి వీడియో సందేశాన్ని ప్ర‌సారం చేశారు. ఈ వీడియోను డిసెంబరు 7న రికార్డు చేసినట్టు అధికారులు తెలిపారు. 

ఇంత‌కీ ఏం మాట్లాడంటే.. 

స్వర్ణిమ్ విజయ్ పర్వ్ సందర్భంగా.. భారత దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లను నేను అభినందిస్తున్నాను. 1971 ఇండియా-పాక్ యుద్ధంలో భారత్ విజ‌యం సాధించి.. 50 యేండ్లు పూర్తయింది. ఆ మ‌ర‌ణ వీరుల త్యాగాల‌కు గుర్తుగా 'స్వర్ణిమ్ విజయ్ పర్వ్' జరుపుకుంటున్నాము. ఈ ప్రత్యేక సందర్భంలో, నేను ధైర్యవంతులను స్మరించుకుంటాను. వారి త్యాగాలకు నా నివాళులర్పిస్తాను..’అంటూ తన చిట్టచివరి సందేశంలో సీడీఎస్ రావత్ పేర్కొన్నారు.

Read Also: https://telugu.asianetnews.com/national/cds-general-bipin-rawat-daughters-immerse-parents-ashes-in-ganga-at-haridwar-r3y5oe

తూర్పు పాకిస్థాన్  స్వతంత్ర పోరాటం వ‌ల్ల 1971లో భారత్‌-పాక్‌ మధ్య యుద్ధం జ‌రిగింది. ఈ యుద్దంలో  పాకిస్థాన్ ను భారత్‌ ఓడించింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఏర్పడింది. ఈ యుద్దంలో విజ‌యం సాధించడంతో దానికి గుర్తుగా ప్ర‌తి యేటా డిసెంబరు 16న విజయ్‌ దివస్‌ నిర్వహిస్తున్నారు. ఆ​ యుద్దానికి  50 యేండ్లు పూర్తయిన సందర్భంగా 'స్వర్ణ విజయ సంవత్సరం'గా పేర్కొంటూ ఏడాది పాటు దేశవ్యాప్తంగా వేడుకలను నిర్వహిస్తున్నారు. దిల్లీలోని ఇండియా గేట్​ వద్ద ఈ కార్య‌క్ర‌మాన్ని కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు.

Read Also: https://telugu.asianetnews.com/andhra-pradesh/pawan-kalyan-to-stage-deeksha-today-against-vizag-steel-plant-privatisation-r3zgiy

ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ మాట్లాడుతూ..  1971 ఇండియా-పాక్‌ యుద్ధ  అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని అట్ట‌హాసంగా చేయాల‌ని భావించినా.. సీడీఎస్ జనరల్ బిపిన్​ రావత్​ అకాల మరణంతో నిరాడంబరంగా జరుపుతున్నట్లు రాజ్​నాథ్​ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రావత్ భార‌త సైన్యానికి చేసిన సేవ‌ల‌ను స్మరించుకుంటూ నివాళులర్పించారు.

1971 ఇండో-పాక్​ యుద్ధంతో దక్షిణాసియా చరిత్ర, భౌగోళిక స్థితి మారింద‌నీ, ఆ యుద్ధంలో అమరులైన ప్రతి సైనికుడి ధైర్యానికి, పరాక్రమానికి, త్యాగానికి నమస్కరిస్తున్న‌ని అన్నారు. ఆ దైర్య‌వంతుల త్యాగానికి దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుందని, ఈ యుద్ధంతో  భారత దేశ నైతికత, ప్రజాస్వామ్య సంప్రదాయాలు 
ప్ర‌పంచ దేశాలు తెలిశాయ‌ని అన్నారు. గడిచిన 50 ఏళ్లలో బంగ్లాదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందింద‌నీ, ఇప్పుడూ ఆ దేశం మిగిలిన ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందని అన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios